'ప్రజాసేవ కోసమే బాలకృష్ణ మంత్రి పదవి వదులుకున్నారు'
ప్రజలకు సేవ చేసేందుకు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రి పదవిని సైతం వదులుకున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పటల్ 14వ వార్షికోత్సవ సభలో కోడెల శివప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ... బసవతారకం ఇండోఅమెరికన్ క్యాన్సర్ హాస్పటల్లో ప్రపంచస్థాయి క్యాన్సర్ చికిత్సను పేషెంట్లకు అందిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధిలో స్పీకర్ కోడెల చేసిన విశేష కృషిని ఆ ఆసుపత్రి ఛైర్మన్ అయిన బాలకృష్ణ ఈ సందర్భంగా గుర్తు చేశారు.Follow @sakshinews