basaveshwara
-
బసవన్నకు ‘వీక్లీ ఆఫ్’.. ఎక్కడ? ఎప్పుడు అంటే?
మంత్రాలయం/ఆలూరు: గోవులను, ఎడ్లను పూజించడం హిందువుల సంప్రదాయం. ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను ఎద్దుల పండుగలుగా భావిస్తారు. ఆయా రోజుల్లో వాటికి స్నానాలు చేయించి, అలంకరణలు గావించి, పిండివంటలు పెట్టి పూజిస్తారు. మనకు ఇంత వరకే తెలుసు. కానీ జిల్లాలోని కర్ణాటక సరిహద్దులో ఉన్న సుళేకేరి, విరుపాపురం గ్రామాల్లో ఎద్దులను ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. ఇలవేల్పు బసవేశ్వర స్వామి ప్రతి రూపాలుగా భావించి వారంలో ఒక రోజు పూర్తిగా సెలవు ఇచ్చేస్తారు. ఎంత పని ఉన్నా సోమవారం వాటితో చేయించరు. శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయంపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం. చదవండి: గుమ్మటం తండాలో పర్యటించనున్న సీఎం జగన్ కట్టుబాట్ల సుళేకేరి.. కౌతాళం మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుళేకేరి గ్రామంలో అవధూత బంధమ్మవ్వ మహిమాని్వతురాలుగా ప్రసిద్ధి. అవ్వ పరమపదించిన తరువాత గ్రామంలో జాతరతో పాటు కొన్ని కట్టుబాట్లను పాటిస్తూ వస్తున్నారు. అవ్వ జాతరకు నెల రోజుల ముందు ఓ సామాజికవర్గం గ్రామ చావిడిలో చెప్పులు వేసుకుని నడవకపోవడం ఒక సంప్రదాయం కాగా మరొకటి ప్రతి సోమవారం ఎద్దులకు సెలువు ఇవ్వడం. దాదాపు 4 శతాబ్దాల క్రితం గ్రామంలో రైతులు యథావిధిగా ప్రతి రోజు పొలాలకు వెళ్లి కాడెద్దులతో పనులు చేసుకునేవారు. అయితే సోమవారం ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునేవి. కాడెద్దు చనిపోవడం, కాలు విరగడం, బండి ఇరుసులు, చక్రాలు విరగడం, రైతులకు గాయాలు కావడం జరిగేవి. దీంతో గ్రామంలోని అవధూత బంధమ్మవ్వకు గ్రామస్తులు గోడును వినిపించుకున్నారు. సోమవా రం కాడెద్దులను కష్టపెట్టడం మానేయాలని ఆమె ఆదేశించడంతో ఆ ఆజ్ఞను సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. విరుపాపురంలో విత్తు ఉన్నా సెలవే.. ఆలూరు నియోజకవర్గ కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో విరుపాపురం ఉంది. ఆ గ్రామ ఇలవేల్పు బలగోట బసవేశ్వర స్వామి. ఏటా ఏప్రిల్ నెలలో వచ్చే హంపయ్య పౌర్ణమి రోజున మూడు రోజుల పాటు జాతర జరుపుకుంటారు. శివుని వాహనం బసవేశ్వరుడు కావడంతో గ్రామస్తులు బసవన్నలను దైవాలుగా పూజిస్తారు. ఇక్కడ 1975లో ఇందిరమ్మ గృహాలు రావడంతో విరుపాపురం పక్కనే బలగోట గ్రామం వెలసింది. విరుపాపురం గ్రామం రెండు గ్రామాలుగా ఆవిర్భవించడంతో బలగోట బసవేశ్వర స్వామి(బలగోటయ్య తాత) ఆజ్ఞగా భావించి ప్రతి సోమవారం కాడెద్దులకు సెలవు దినంగా ప్రకటించుకున్నారు. దాదాపు 5 శతాబ్దాలుగా ఈ సంప్రదాయం ఆచరిస్తున్నారు. సంప్రదాయంలో భాగంగా ప్రతి సోమవారం కాడెద్దులకు స్నానాలు చేయించడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, పిండి వంటలతో నైవేద్యాలు సమరి్పంచడం చేస్తున్నారు. అదే రోజు బలగోటయ్య స్వామి ఆలయానికి ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలతో ఎద్దులను తీసుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసుకుంటారు. విత్తు వేసే పనులు ఉన్నా, పెళ్లిళ్లకు మెరవణిలు, ప్రయాణాలు ఉన్నా ఎద్దులతో పనులు చేయించరు. -
సంగారెడ్డికి గోదారమ్మ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు రూపుదిద్దుకోబోతున్నాయి. సముద్రమట్టానికి ఎత్తై న ప్రాంతంలో ఉండే నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలను తరలించాలనే ఇక్కడి రైతుల ఎన్నో ఏళ్ల కళ సాకారమవబోతోంది. ఈ రెండు ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ సోమవారం భూమి పూజ చేయనున్నారు. తర్వాత నారాయణఖేడ్ శివారులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీలు తరలించి.. సంగమేశ్వర, బసవేశ్వర పథకాలకు రాష్ట్రం రూ.4,427 కోట్లు ఖర్చు చేయనుంది. వీటి నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 4 నియోజకవర్గాల పరిధిలో 3.84 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. మొత్తం 397 గ్రామాలకు చెందిన రైతులు లబ్ధి పొందనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొమురవెల్లి మల్లన్నసాగర్ జలాశయం నుంచి సుమారు 12 టీఎంసీల నీటిని సింగూరు జలాశయానికి తరలిస్తారు. అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా ఆయకట్టుకు మళ్లించేలా ఈ పథకాలను డిజైన్ చేశారు. రెండు ఎత్తిపోతల పథకాలకు కలిపి 5 పంప్‌హౌజ్‌లను నిర్మించనున్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి నీటి పారుదల శాఖ ఇప్పటికే టెండరు ప్రక్రియను పూర్తి చేయగా మెగా కంపెనీ పనులు దక్కించుకుంది. సంగారెడ్డి సస్యశ్యామలం: హరీశ్ నారాయణఖేడ్: సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న రెండు ఎత్తిపోతల పథకాలు సంగారెడ్డి జిల్లాకు వరప్రదాయనిగా మారనున్నాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో జరగనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలసి ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఈ ప్రాంత అభివృద్ధికోసం రూ.4,500 కోట్లతో రూ.3.89 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టులను మంజూరు చేశారన్నారు. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లో 406 గ్రామాల రైతులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితమే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టామని, సర్వే పనులు పూర్తయ్యేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. -
కాయకమే కైలాసం... శ్రమయే శివనిలయం
కర్ణాటకలోని హింగులేశ్వర బాగేవాడి అగ్రహారంలో 1134వ సంవత్సరం వైశాఖ శుద్ధతదియ (అక్షయ తతీయ) రోజున మండెన మాదిరాజు, మాతాంబిక దంపతులకు బసవేశ్వరుడు జన్మించాడు. ఈయన వీరశైవ సంప్రదాయాన్ని మహోజ్వలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప భక్తుడు. ఆయనకు భక్తి బండారి అనే మరొక పేరు కూడా ఉంది. ఆయన గొప్ప సంఘసంస్కర్త. కులతత్వ నిర్మూలన, స్త్రీ పురుష సమానత్వం మొదలైన నూతన సంప్రదాయ యుగానికి ఆయన నాంది పలికాడు. బసవన్న రాసిన నాలుగు లక్షలకు పైబడిన వచనాలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా నేడు కొన్ని మాత్రం ప్రజలనాల్కలపై ఆడుతూ సజీవంగా నిలిచి ఉన్నాయి. సమాజంలోని అన్ని వర్గాలప్రజలూ దైవంతో వారికున్న అనుభవాల్ని పంచుకోవడానికి అల్లమప్రభువులవారి అధ్యక్షతన అనుభవమండపాన్ని ఏర్పరచారు. తన ఆరాధ్యదైవమైన కూడలసంగమేశ్వరుడే తన వచనాలకు మకుటంగా మార్చుకుని కీర్తించాడు. ఆ వచనాలు రాసి కొన్ని శతాబ్దాలు దాటినా నేటికీ నిత్యనూతనం. దయలేని ధర్మమదేవిటయ్యా దయయే కావాలి ప్రాణులన్నిటిలో దయయే ధర్మం మూలమయ్యా కూడలసంగముని వంటీ దైవం లేదయ్యా సిగ్గొదిలి అన్యులను యాచించకుండా మతిచెడి పరులను పొగడకుండా పరసతులపై మనసు పడకుండా శివపథభక్తుల పాదాలు విడువకుండా వేరుమార్గంలో నా నడక సాగకుండా నన్ను నడిపించు కూడలసంగమదేవా ఉన్నవాళ్లు గుళ్లు గోపురాలు కట్టిస్తారు లేనివాణ్ణి నేనేమి చెయ్యాలి? నా కాళ్లే స్తంభాలు కాయమే కోవెల శిరసే బంగారు శిఖరం కూడలసంగమదేవా! విను చెడితే స్థావరం చెడుతుంది గాని జంగమం చెక్కు చెదరదు దొంగిలించకు చంపకు అబద్ధం పలుకకు కోపగించుకోకు అన్యులను ఏవగించుకోకు నీ గురించి పొగుడుకోకు ఎదుటి వ్యక్తిని నిందించకు ఇదే అంతరంగ శుద్ధి ఇదే బహిరంగ శుద్ధి ఇదే మా కూడలసంగమదేవుని మెప్పించే పద్ధతి దేవలోకం మర్త్యలోకం వేరే వేరే లేవు సత్యాన్ని పలికేదే దేవలోకం అసత్యాన్ని పలికేదే మర్త్యలోకం ఆచారమే స్వర్గం అనాచారమే నరకం కూడలసంగమదేవా –కె.వి.ఎస్. బ్రహ్మాచార్య, శాస్త్ర ప్రవీణ -
బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవ
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ కల్చరల్: కుల రహిత సమాజం కోసం పాటు పడిన బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకొని, ధార్మిక, సామాజిక సేవల్లో తరించాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. వీరశైవ లింగాయత్ –లింగబలిజ సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక గోపాల్‌రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘కాయకమే కైలాసం’ (కçష్ట పడితేనే ముక్తి, భుక్తి) అంటూ చాటి చెప్పిన బసవేశ్వరుడు గొప్ప మానవతా వాది అన్నారు. 12వ శతాబ్దంలోనే ‘అనుభవ మండపం’ అనే పార్లమెంటను ఏర్పాటు నిర్వహించారని గుర్తు చేశారు. బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీసీలో చేర్చిన ఘనత వైఎస్‌దే.. ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సంగేశ్వర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009లో తయ కులస్థులను బీసీల్లో చేర్చారని అన్నారు. ఓబీసీలుగా గుర్తించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి శివరత్నం నూతన కార్యవర్గ సభ్యులచే పదవీ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నేతలువన్నె ఈశ్వరప్ప,కవితా దేశ్‌ముఖ్, శేఖర్, పవన్, రేణుక,సోమశేఖర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జేపీఎన్సీఈ చైర్మెన్ కేఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.