basic education
-
అ ఆ లు ప్రతి ఇంటికీ రావాలి
104 ఏళ్ల కేరళ కుట్టియమ్మ పరీక్షలు రాసి పాసవడం చూశాం. ఆమెకేనా ఆ అదృష్టం? ఐదారు దశాబ్దాల క్రితం పుట్టిన చాలా మంది స్త్రీలు చదువుకు నోచకనే జీవితంలో పడ్డారు. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలుగా ఉన్న వారంతా కుట్టియమ్మకు మల్లే చదువుకోవాలని అనుకోవచ్చు. కేరళలో ఇలాంటి స్త్రీల కోసం ఇంటికి వచ్చి చదువు చెప్పే ప్రభుత్వ వాలంటీర్లు ఉన్నారు. కుట్టియమ్మ అలా ఇంట్లోనే చదివింది. దేశమంతా ఇలా అఆలు ఇళ్ల తలుపు తట్టాల్సి ఉంది. వెలుతురు నవ్వు చూడాల్సి ఉంది. ‘అ’ అంటే అమ్మ అని పుస్తకాల్లో చదువుకుంటాం. ఇక మీదట ‘అ’ అంటే ‘అవ్వ’ అని చదవాలమో. కుట్టియమ్మ అనే అవ్వ ఇప్పుడు ఆ మేరకు వార్తలు సృష్టిస్తోంది. దానికి కారణం ఆమె వయసు 104. ఆమె పరీక్షల్లో సాధించిన మార్కులు 100కు 89. మొన్నటి నవంబర్ 10న ఆమె ఈ పరీక్షలో కూచుంది. ఇంకేంటి. ఆమె పేరు మారుమోగదా? కేరళలోని కొట్టాయం జిల్లాలోని ‘అయర్ కున్నమ్’ అనే పంచాయతీకి చెందిన కుట్టియమ్మను చూడటానికి ఇప్పుడు ఆ ఊరికి కార్లు వస్తున్నాయి. అందులో నాయకులు వస్తున్నారు. కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివన్ కుట్టి ఆమెను సత్కరించి ‘అక్షర ప్రపంచంలోకి స్వాగతం’ అన్నాడు. ఆమె ఇలా చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అన్నాడు. ఇంతకు మించిన స్ఫూర్తి ఏముంటుంది ఏ వయసులో అయినా చదువుకోవడానికి. రెండు నెలల్లో చదివి కుట్టియమ్మ కథ దేశంలోని లక్షల మంది స్త్రీల కథే. ఆమెకు చదువుకునే వీలు కలగలేదు. 15 ఏళ్లకే పెళ్లి అయ్యింది. ఇప్పటికి ఆమె తన వంశంలో ఏడు తరాలను చూసింది. కాని ఆమెకు చదువుకోవాలని ఉండేది. అక్షరాలను గుణించుకుని న్యూస్‌పేపర్ చదివే ప్రయత్నం చేసేది. కాని ఆమె పెన్ను పట్టుకుని రాయలేదు. కేరళ ప్రభుత్వం ‘సాక్షరతా మిషన్’లో భాగంగా ‘సాక్షరతా ప్రేరకులు’ పేరుతో వాలంటీర్లను నియమించి ఇలాంటి మహిళల కోసం ఇంటింటికి వెళ్లి చదువు చెప్పే ఏర్పాటు చేసింది. అలా ఫెహరా జాన్ అనే వాలంటీర్ ఆమె ఇంటికి వచ్చి చదువు చెప్పింది. ‘టీచర్‌ను చూసి ఆమె చిన్నపిల్లలా ఉత్సాహపడింది’ అని కుట్టియమ్మ కుటుంబ సభ్యులు చెప్పారు. పరీక్ష రాస్తున్న కుట్టియమ్మ ‘ఆమె షరతు ఒక్కటే. పెద్దగా పాఠం చెప్పమని. ఎందుకంటే ఆమెకు సరిగా వినపడదు. నేను అరిచి చెప్పేదాన్ని. సాక్షరతా మిషన్‌లో భాగంగా కేరళలోని ప్రతి పంచాయితీలో ప్రాథమిక పరీక్షను నిర్వహిస్తారు. ఆ పరీక్షలో పాసైతే 4వ తరగతి స్థాయి పరీక్ష రాయవచ్చు. ప్రాథమిక పరీక్షలో మలయాళం, లెక్కలు, జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. పరీక్షకు కేవలం రెండు నెలల ముందే ఆమెకు చదువు మొదలయ్యింది. రెండు నెలల్లోనే ఆమె బాగా పాఠాలు నేర్చుకుంది. అంతే కాదు పెన్ను పట్టి అక్షరాలు రాయడం మొదలెట్టి మార్కులు కూడా తెచ్చుకుంది’ అంది ఫెహరా జాన్. ‘ఆమె గుచ్చి గుచ్చి అడిగి మరీ తెలుసుకునేది. నస పెట్టడం అంటారు చూడండి. అలా’ అని నవ్వుతుంది ఆ పెద్ద వయసు స్టూడెంట్ కలిగిన చిన్న వయసు టీచర్. కర్ర పెండలం, చేపలు కుట్టియమ్మకు 104 సంవత్సరాలు ఉన్నా ఇంకా చురుగ్గా ఉంది. బి.పి, షుగర్ లేవు. కళ్లద్దాలు కూడా లేవు. రాత్రి పూట చూపు ఆనదు. వినపడదు. అంతే. ‘ఆమె ఉదయం పూట టిఫిన్ రాత్రి భోజనం తప్ప మధ్యలో ఏమీ తినదు. అవి కూడా కొంచెం కొంచెమే తింటుంది. మధ్యాహ్నం ఆమెకు పడుకునే అలవాటు లేదు. ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఆమెకు చేపలు, కర్రపెండలం ఇష్టం.’ అని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ వయసులో చదువుకోవడం వల్ల ఇప్పుడు ఆమెకు మాత్రమే కాక ఆమె ఇంటికి కూడా గుర్తింపు వచ్చింది. ఇతరుల సంగతి ఏమిటి? ఏ మనిషికైనా తన పేరు తాను రాసుకోగలగడం, తన పేరును తాను చదువుకోగలడం ప్రాథమిక అవసరం. దేశంలో సంపూర్ణ అక్షరాసత్య కార్యక్రమాలు మొదలయ్యి ఇన్నాళ్లవుతున్నా అందరినీ అక్షరాస్యులు చేసే పని అంత సజావుగా సాగడం లేదు. కేరళలో మాత్రం 1989లోనే ‘కొట్టాయం’ జిల్లా సంపూర్ణ సాక్షరతను సాధించిన జిల్లాగా పేరు పొందింది. సాక్షరతా సూచిలో తమ రాష్ట్రం ముందుండేలా ఆ రాష్ట్రం నిరంతరం శ్రద్ధ పెడుతూనే ఉంది. ఇలా ప్రతి రాష్ట్రంలో చదువు, జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. వారి కోసం కొంత కాలం ప్రభుత్వాలు రాత్రి బడులు నిర్వహించాయి. ఇప్పుడు అలాంటి పని జరగడం లేదు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. కుట్టియమ్మ చూపిన పట్టుదల చదువుకు నోచుకోని ప్రతి మహిళా చూపితే, అందుకు వ్యవస్థలు మద్దతుగా నిలిస్తే దేశం నిజమైన వికాసంలోకి అడుగు పెడుతుంది. ఇంట్లో తన టీచర్ దగ్గర చదువుతూ... జ్ఞానం పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఏ వయసులోనైనా ఉంది. స్త్రీలు ఎన్నో దశాబ్దాలుగా అక్షరానికి దూరమై ఉన్నారు. కేరళ వంటి చోట చదువే అలాంటి వారి ముంగిట్లోకి వస్తోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు. ఆ వెలుగు ఇంటింటికి చేరాల్సి ఉంది. -
చిట్టిబుర్రలకు ట్రాఫిక్ చిట్కాలు
బెంగళూరు ట్రాఫిక్ అంటే అదొక పద్మవ్యూహమే. లక్షలాది వాహనాలు, మనుషులతో కిక్కిరిసిన రోడ్లు అమ్మో అనిపిస్తాయి. దీనికి వాహనదారుల్లో అవగాహన లేకపోవడమూ ఒక కారణమనాలి. చిన్నప్పటి నుంచే బాలల్లో ట్రాఫిక్ పై చైతన్యం కల్పించడం ఉత్తమమని భావించిన రవాణా, విద్యాశాఖలు ఆ దిశగా కదిలాయి. జయనగర: సిలికాన్ సిటీలో ట్రాఫిక్ ని ర్వహణ అనే అంశాన్ని పాఠ్యాం శంలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరులో వాహన సంచారం– ట్రాఫి క్ సమస్య నిర్వహణ అనే విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం పరిశీలించాలని రవాణాశాఖ ఇటీవల ప్రాథమికోన్నత విద్యాశాఖకు ప్రతిపాదన అందించింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ దీనిపై లోతుగా ఆలోచిస్తోంది. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తికాగా, నూతన విద్యాసంవత్సరం ప్రారంభదశలో ఉంది. అంతేగాక 2018–19 పాఠ్యపుస్తకాల ముద్రణకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించగా, ఈ దశలో నూతన విషయాన్ని పాఠ్యాంశంలో చేర్చడం సాధ్యం కాదు. దీంతో 2019–20 విద్యాసంవత్సరం నుంచి బెంగళూరు ట్రాఫిక్ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వం తీర్మానించింది. ఉద్యానగరం విస్తారంగా అభివృద్ధి చెందడంతో నగరంలో ప్రతి ఒక్కరూ కూడా ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డు భద్రత గురించి విద్యార్థులను ఏవిధంగా జాగృతం చేయాలి అనే దాని పట్ల రవాణాశాఖ సలహాలు అందజేసింది. వాటికి అనుగుణంగా ఈ విషయాన్ని పాఠ్యపుస్తకాల్లో చేరుస్తున్నారు. 2019–20 నుంచి అందుబాట్లోకి వస్తుందని బుధవారం రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్‌సేఠ్Š‡ తెలిపారు. పాఠ్యాంశంలో చేర్చే విషయాలు.... ♦ రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్, నియమాలు ♦ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, జరిమానా గురించి సమాచారం ♦ వేగ నియంత్రణ, ఓవర్టేక్, పాదచారుల సురక్షత గురించి సమాచారం ♦ రోడ్డు ప్రమాదం సంభవించే సమయంలో అత్యవసరంగా సంప్రదించే సంస్థల వివరాలు ఉంటాయి. ♦ ఈ పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయులను ఎంపికచేసి ఢిల్లీలో ఉన్నతస్థాయి శిక్షణ తరగతులకు పంపుతారు. అక్కడ మాస్టర్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఇక్కడకు వచ్చి ఇతర ఉపాధ్యాయులకు రోడ్డు భద్రత గురించి శిక్షణనందిస్తారు. -
‘కేజీ’ కారాదు పసివారికి దూరం, భారం
పసి పిల్లలకు తరగతి గదుల్లో అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా చెబుతున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆ పట్టింపే లేకుండా పసివాళ్లకు కేజీ తరగతులను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొల గించేలా దాన్ని సంస్కరించాలి. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా ప్రభుత్వ రంగంలోని కేజీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పుడు అమల్లో ఉన్న తర గతి గది బోధనా పద్ధతుల్ని పటిష్టం చేసి, విద్యను సామా జికీకరణ చేయాలనే లక్ష్యంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఓ కొత్త ప్రయోగాన్ని తెలంగాణ విద్యారంగంలో మొదలుపె ట్టారు. ఇప్పటి వరకూ మన శ్రద్ధంతా సెకండరీ విద్యపైనే కేంద్రీకరించడం జరిగింది. మారిన పరిస్థితులకు అను గుణంగా కేజీ విద్యపైకి తెలంగాణ ప్రభుత్వం దృష్టి మరల్చింది. పరీక్షా విధానంలో సైతం దేశంలో మరె క్కడా చేపట్టని పలు సంస్కరణలను కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఇంతవరకు ఒకే లోపభూయిష్ట విద్యా విధానం అమలవుతూ వచ్చిన తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కే కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రా లకు సైతం ఈ నూతన వైఖరి అనుసరణీయమైనది. ప్రత్యేకించి నేటి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని కేజీ చదువులను ప్రభుత్వ విద్యారంగం పరి ధిలోకి తేవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ప్రయోగంలో విజయం సాధిస్తే తెలంగాణ దేశానికే ఆదర్శ నమూనా అవుతుంది. మూడు నుంచి ఆరేళ్ల వయసు పిల్లల కోసం ప్రత్యే కంగా పిల్లలను కేజీ స్కూళ్లలో చేర్చే దేశవ్యాప్త సంప్రదా యానికి మధ్యతరగతి లేక సంపన్న వర్గాలు శ్రీకారం చుట్టాయి. అలా తరగతి గదుల్లో అంత చిన్న పిల్లలకు అక్షరాలు నేర్పటం సరైంది కాదని విద్యావేత్తలంతా ఎప్ప టి నుంచో చెబుతున్నారు. కానీ ప్రైవేట్ యాజమా న్యాలు ఆ పట్టింపే లేకుండా పసి పిల్లలకు కేజీ తరగతు లను, చదువులను తప్పనిసరి చేసేశాయి. పైగా వారికి ఇంచుమించు ప్రాథమిక పాఠశాల పాఠ్యాంశాలనే బోధి స్తున్నారు. 3 నుండి 6 ఏళ్ల వయసు పిల్లలకు అక్షరం నేర్ప డం కన్నా ఇంద్రియాల శిక్షణే అవసరం. ‘సర్వేంద్రి యానాం నయనం ప్రధానం’ అంటాం. కాబట్టి ఇంద్రి యాలకు శిక్షణనివ్వాలి. దృష్టి సరిగా ఉంటే వస్తువుల లోని తేడాలను గుర్తించగలుగుతారు. అంటే ఆ వయసు పిల్లలు వస్తువుల రంగు, ఆకారం, విస్తీర్ణం, పరిధుల లోని తేడాలను గుర్తించగలిగేటట్లు చేస్తే సరిపోతుందా? ఇదంతా దృష్టి చేసే పరిశీలన మీదనే ఆధారపడినది. అనగా ‘నేను చూస్తున్నాను’, ‘నేను పరిశీలిస్తున్నాను’, ‘నేను అధ్యయనం చేస్తున్నాను’ అన్నవి మూడూ కంటికి సంబంధించినవి. కంటి శిక్షణపై ఈ మూడింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. అదే మాదిరిగా ‘నేను వింటున్నాను’, ‘నేను ఆలకిస్తున్నాను’. ఈ రెండింటి లోనూ వస్తువుల మధ్య తేడాను గుర్తించడం కన్ను, కంటి చూపులపై ఆధారపడి ఉంటాయి. ఇదే మాదిరిగా నాలుకకు శిక్షణ ఇవ్వటాన్ని ఎంతగా సంస్కరిస్తే విద్యా ర్థుల ఆలోచన అంతగా పదునెక్కుతుంది. కాబట్టి అన్ని దేశాల్లోనూ కేజీ స్కూళ్లపై దృష్టిని కేంద్రీకరించారు. అందుకు భిన్నంగా మన పట్టణాల్లోని మార్కెట్ శక్తులు లాభాపేక్షే లక్ష్యంగా కేజీ స్కూళ్లను పెట్టాయి. నిపుణుల సూచనలను పట్టించుకోకుండా తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా స్కూళ్లను నడిపి డబ్బు రాబట్టే వ్యవస్థగా ప్రైవేట్ స్కూళ్ల వ్యవస్థ మారింది. ఈనాడు కేజీ స్కూళ్ల ఫీజు లక్ష రూపాయల దాకా పోయింది. దానికి కూడా రికమండేషన్ లేకపోతే సీటు దొరకని దశను తీసుకొచ్చారు. పసిపిల్లల మనోవికా సాన్ని దెబ్బతీసేలా అక్షరాలు నేర్పడానికి తోడు ఉపా ధ్యాయులకు సరైన అర్హతలు, శిక్షణ కొరవడుతున్నాయి. దీంతో ఇప్పుడున్న కేజీ స్కూళ్లు విదేశాల్లోలాగా వాటి లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతున్నాయి. మొత్తంగా చూస్తే నేడు విద్యారంగంలో కేజీ స్కూళ్ల ప్రాధాన్యత పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్య కేవలం రాజకీయ నినాదం కాదు. మారిన సామాజిక పరిస్థితులకనుగుణంగా విద్యారం గంలో తీసుకురావాల్సిన సంస్కరణగా ప్రభుత్వం రం గంలోని కేజీ విద్యను గుర్తించాలి. కేజీ నుంచే నాణ్యమైన విద్యను సామాన్యుల పిల్లలకు అందుబాటులోకి తీసుకు రావాలనే కోరికను ప్రత్యేకమైనదిగా చూడాలి. మారు మూల గ్రామాల్లోని నిరుపేదల పిల్లలకు సైతం దాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. కేజీ విద్య ప్రైవేటు యాజమాన్యంలో ఉండటం వలన ఫీజులు విపరీతంగా పెరిగాయి. దీన్ని నియంత్రించాలని ప్రభుత్వం గుర్తించ టం వల్ల విద్యారంగానికి గొప్ప మేలు జరుగుతుంది. కేజీ విద్యను పేదవానికి అందుబాటులోకి తేవడం మాత్రమే కాదు, ప్రమాణాలను కాపాడాలి. పిల్లలపై అనవసర భారాన్ని, ఒత్తిడిని తొలగించేలా దాన్ని సంస్క రించాలి. ఆ లక్ష్యానికి తగినట్లు శిక్షణ పొందిన ఉపా ధ్యాయులను నియమించాలి. కేజీ విద్యావ్యవస్థను పూర్తి ప్రభుత్వ అజమాయిషీలో ఉంచాలి. కామన్ స్కూల్ సిస్టంను తీసుకురావాలి. దాని వల్ల శ్రీమంతుల పిల్లలైనా, పేదల పిల్లలైనా పసితనం నుంచే వివక్షతకు గురికాకుండేలా చూసి, అందరిలో సమానత్వ భావనను కల్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక, సామాజిక సమానత్వానికి బీజం పడే అవకాశం ఏర్పడుతుంది. కేజీ స్కూళ్లను ప్రభుత్వపరంగానే నెలకొల్పి, ప్రతి వారూ నిర్బంధంగా ఈ ప్రభుత్వ బడులకే పిల్లలను పం పేలా చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పనిని గ్రామ పంచాయతీలకే అప్పగించాలి. ప్రతి గ్రామ పంచాయతీ తమ పరిధిలోని స్కూళ్లకు ఎంత మంది పిల్లలు వస్తు న్నారో నమోదు చేయాలి. కేజీ స్కూల్‌పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అప్పుడు కేజీ విద్య అందరికీ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక విద్యలో భాగమైన కేజీ చదువులో అంతరాలకు తావు లేకుండా పోతుంది. (చుక్కా రామయ్య , వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు) -
ఆదివాసీ లిపిలో, భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా గుంజాల
ఇన్ బాక్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక విద్యా విధానం ఎన్నో సవాళ్లని ఎదుర్కొంటున్నది. ఈ విద్యా విధా నంలో ‘భాష’ ప్రధానమైనది. అడుగు వర్గాల పిల్ల లకి, ఆదివాసీ పిల్లలకు ఏ భాషలో విద్య ఉండాలి అనే సమస్య ప్రపంచంలోని చాలా దేశాలు, సమా జాలు ఎదుర్కొంటున్నవి. బహుళ భాషలు ఉన్న ప్రాంతాలలో ఏ భాష బడి భాషగా ఉండాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే అక్షరాస్యత శాతం పెరగడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఎంతో సమాచారం సేకరించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఏడు వేల భాష లు ఉన్నాయి. అందులో 370 మిలియన్ల మూలవాసీ ప్రజలలో మూడింట రెండో వంతు పసిఫిక్ తీర ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలలో ఉన్నారు. ఈ తెగల ఆర్థిక పరిస్థితి దినదినం దిగజారిపోతున్నది. అలాగే భారతదేశంలో కూడా ఈ సమస్య పెద్దదిగానే ఉంది. ఆదివాసుల నేల గాలి నీరు పరాయీకరణకు గురవుతున్నది. వారు నిర్వాసితులుగా చేయబడుతు న్నారు. ఈ క్రమంలో చరిత్రలోకి తొంగిచూస్తే ప్రతి దశలోనూ వారు నివసించే నేల నుండి తొలగిం పబడటం వాస్తవం. నేలని కోల్పో వడం తల్లిని కోల్పోవడమే. తల్లి భాషని, సంస్కృతిని కూడా కోల్పో వడమే. ఈ రెండూ పోయిన వాళ్లకి అస్తిత్వం కూడా మిగలదు. చిరు నామా, ఆత్మగౌరవం లేని నిర్జీవ శరీరాలుగా మిగిలి పోతారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి. ఆరేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా, నార్నూరు మండలంలోని గుంజాల గ్రామంలో కోయతూర్ లిపి లభించింది. ఇది చాలా కాలం నుండి ఉన్నది. ఈ లిపిలో రాతప్రతులు ఉండటమే కాదు, వాటిని చదివే నలుగురు వృద్ధ పండితులు కూడా జీవించి ఉన్నారు. ఈ గుంజాల కోయతూర్ లిపి ఉపయోగిం చిన పలు చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేశాం. చాలా వరకు సత్ఫలితాలు, సత్వర ఫలితాలు లభించాయి. ఉట్నూరులోని ఐటీడీయే సహకారంతో 15 ఏళ్లలో ఈ లిపిని ప్రవేశపెట్టిన కొద్ది మాసాలలోనే పిల్లలు సొంత లిపిలో, సొంత భాషలో గణనీయమైన ప్రగతి సాధించారు. ఇది ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అందుకే గుంజాల గ్రామాన్ని ఆదివాసీ లిపిలో, ఆదివాసీ భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా తయారుచేయాలని నిర్ణయించాం. నాలు గేళ్ల పిల్లవాడి మొదలు డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు ఈ లిపిలో రాసేట్లు, చదివేట్లు చేయడమే ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దేశంలోనే మొట్ట మొదటి ప్రయోగం ఇది. అలాంటి ఆ కార్యక్రమానికి 15 డిసెంబర్ నాడు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆరు నెలల్లో గుంజాలలోని సుమారు పదిహేను వందల మంది తమ ఆదివాసీ లిపిలో సంతకం చేసి అధికారులకి అర్జీ పత్రాలు రాసే విధంగా అక్షరా స్యులుగా చేయాలని సంకల్పించాం. ఈ కార్యక్రమా నికి హితైషులను, మిత్రులను ఆహ్వానిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయే దినంగా దీనిని భావి స్తున్నాం. దేశంలో మొదటి ఆదివాసీ లిపిలో, గోండీ భాషలో పూర్తి అక్షరాస్యతని సాధించిన గ్రామంగా గుంజాల నిలిచిపోగలదని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మా వేదిక కన్వీనర్, తెలం గాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరు మలరావు మార్గదర్శకులుగా ఉన్నారు. వారు అధ్య క్షత వహించే ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డా॥ జె.జగన్మోహన్, ఉట్నూరు ఐటీ డీఏ ఇన్ఛార్జీ పివో ప్రశాంత్ జె. పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సిడాస్ట్ కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.ఆర్.సర్రాజు తదితరులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం. డా॥ జి.మనోజ శాఖాధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లిష్, పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్ గుంజాల కోయతూర్ లిపి అధ్యయన వేదిక, ఉట్నూరు / ఆదిలాబాద్, ఫోన్: 9704643240 -
ప్రాథమిక విద్య పటిష్టతే ధ్యేయం
వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలను డిసెంబర్ నెల నుంచి ఎంఈవోలు తనిఖీ చేయాలని జిల్లా విద్యాధికారి సూచించారు. స్థానిక మెరీయానాట్స్ పాఠశాల ఆవరణలో జిల్లా హెచ్ఎంలు, ఎంఈవోలతో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రతీరోజు పాఠశాలలకు పిల్లల తల్లిదండ్రులు వచ్చి పాఠశాలల పనితీరును పరిశీలించాలనీ, కానీ టీచర్లను ప్రశ్నించొద్దని హితవు పలికారు. ఎదైనా సమస్య ఉంటే ప్రధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలన్నారు. తన లక్ష్యమంతా ప్రాథమిక విద్యను పటిష్టంగా తయారు చేయడమేనన్నారు. విద్యార్థులకు బట్టి వ్యవస్థను అలవాటు చేయకుండా, విభిన్న రంగాల్లో ప్రతిభావంతులుగా తయారయ్యే విధంగా చదవడం, రాయడంతోపాటు చతుర్విధ వ్యవస్థలకు అలవాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరుపై వచ్చే నెల నుంచి బృందాల తనిఖీలుంటాయన్నారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని సాయంత్రం 5.30 గంటల సమయంలో విద్యార్థులకు స్వయంగా పాఠ్యంశాల బోధన చేయాలన్నారు. పాఠశాలలను కాపాడుకోవలసి బాధ్యత ఉపాధ్యాయులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉందన్నారు. విద్యార్థులను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించే బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. జిల్లా వ్యాప్తంగా 344 మంది సింగిల్ టీచర్లు పనిచేస్తున్నారని, వారి ప్రాధాన్యతకు తప్పకుండా గుర్తింపునిస్తామన్నారు. గతేడాదికంటే ఈ ఏడాది పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించడమే తమ అంతిమ లక్ష్యమన్నారు. జిల్లా వ్యాప్తంగా 170 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించడానికి జిల్లా పరిషత్ సీఈవో అనుమతి ఇచ్చారన్నారు. ఇంక ఎక్కడైనా శిథిలావస్థలో పాఠశాలల భవనాలుంటే ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమాచారమివ్వకుండా దీర్ఘకాలికంగా పాఠశాలలకు గైర్హాజర్ అయిన ఉపాధ్యాయుల వివరాలను వెంటనే తనకు అందించాలని ఎంఈవోలను ఆదేశించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో ఉందనీ, ఏమైనా తప్పులుంటే సరిచేసి అందుబాటులో ఉన్న ఎంఈవోలకు ఇవ్వాలని ఉపాధ్యాయులకు తెలిపారు. సీనియారిటీ లిస్టును అధికారికంగా డిసెంబర్ 2న విడుదల చేస్తామన్నారు. ఉపాధ్యాయులు మెడికల్ లీవులను దుర్వినియోగం చేస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సమస్యలుంటే ఉపాధ్యాయులు తనను నేరుగా ఫోన్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎంఈవో గోవర్ధన్‌రెడ్డి, ధారూరు ఎంఈవో శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులూ.. తీరు మార్చుకోండి చేవెళ్ల రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల తీరు మారాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డీఈఓ రమేశ్ అన్నారు. మండలంలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య తీరుపై గ్రామ సర్పంచ్ మధుసూదన్‌గుప్త ఫిర్యాదు చేయటంతో బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలోని ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం పాఠశాలలోని అన్ని తరగతులు తిరిగి ఉపాధ్యాయుల బోధన తీరును తెలుసుకునేందుకు విద్యార్థులకు వివిధ ప్రశ్నలు వేశారు. 4,5,7,8వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, స్వయంగా విద్యార్థుల పేపర్లను దిద్దారు. ఉపాధ్యాయుల బోధన సక్రమంగా లేదని, అందుకే పాఠశాల విద్యార్థుల పురోగతి బాగా లేదన్నారు. ఉపాధ్యాయులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేకుంటే కఠినచర్యలు తప్పవన్నారు. విద్యార్థుల పరిస్థితిని చూసి ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్యకు మోమో జారీ చేస్తున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఫిర్యాదుతోనే ఆకస్మిక తనిఖీ.. గ్రామ సర్పంచ్ మధుసూదన్ గుప్త బుధవారం ఉదయం పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య రాలేదు. ఎందుకు రాలేదని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఈ విషయాన్ని డీఈఓకు సర్పంచ్ ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన డీఈఓ ఎంఈఓను తనిఖీకి పంపుతానని చెప్పారు. కానీ డీఈఓ రమేశ్ తానే పాఠశాలను సందర్శించేందుకు ఆకస్మికంగా పాఠశాలకు వచ్చారు. -
మూతబడి
కామారెడ్డి: జిల్లాలోని సర్కారు బడులలో ప్రాథమిక విద్య ప్రమాదంలో పడింది. పాఠశాలలలో మౌలిక సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, ఉపాధ్యాయులు ఉన్నచోట కొందరు ‘బెల్లు..బిల్లు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. రియల్ ఎస్టేట్, ఫైనాన్సులు, చిట్టీల దందాలు, హోటళ్లు, ప్రయివేటు బడులు, ప్రయివేటు కళాశాలలు ఇలా రకరకాల వ్యాపారాలలో మునిగిపోయి విధులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పభుత్వ విద్యపై తల్లిదండ్రులు విశ్వాసం కోల్పోతున్నారని అంటున్నారు. ఇంగ్లిషు మోజు కూడా పెరుగ డం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరో కార ణం. ఫలితంగా సర్కారు బడులు మూసివేత బాటలో నడుస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలలలో చదివేవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో మొత్తం 3,015 ప్రభు త్వ పాఠశాలలు ఉండగా, అందులో 2,31,500 మంది పిల్లలు చదువుతున్నారు. 835 ప్రయివేటు పాఠశాలల లో 1,95,000 మంది చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో సగటున ఒక్కో పాఠశాలలో 75 మంది చదువుతుంటే, ప్రయివేటు బడులలో సగటు సంఖ్య రెండు వందలకు పైగా ఉంది. ఏటా జిల్లాలో 35 నుంచి 60 వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజులలో ప్రభుత్వ పాఠశాలల ఉనికి లేకుండాపోతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల కల్పన పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేత బాటలో నడుస్తున్నాయి. యేడాదికేడాది విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. మూడేళ్ల వయస్సున్న పిల్లలను అంగన్వాడీ కేంద్రాల లో చేర్పించి, నాలుగేళ్లు దాటితే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలలో చేర్పించాలి. అయితే మూడేళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు బదులు కాన్వెంటులకు పం పుతున్నారు. తమ పిల్లలు ఇంగ్లిషు రైమ్స్ చెబుతుంటే మురిసిపోయే తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలన్నా, ప్రభుత్వ పాఠశాలలన్నా ఇష్టపడడం లేదు. కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సొంత వ్యాపకాలలో మునిగి తేలుతున్నారు. కొందరు రోజుల తరబడి బడులకు వె ళ్లకుండానే సంతకాలు చేస్తూ వేతనాలు పొందుతున్నారన్న విమర్శలున్నాయి. దీనికి కొందరు అధికారులు కూడా సహకరిస్తుండడతో విద్యావ్యవస్థ భ్రష్టుప ట్టి ప తోంద ని పలువురు ఆవేదన చెందుతున్నారు. పెరిగిన ఇంగ్లిషు మోజు ప్రభుత్వ పాఠశాలలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులున్నప్పటికీ, తెలుగు మీడియం చదువులు కావడంతో తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఇంగ్లిషు మీడియం పై పెరిగిన మోజుతో పిల్లలను ప్రయివేటు బడిబాట పట్టిస్తున్నారు. సర్కారు బడులలో ఉన్న ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించి ఇంగ్లీషు బోధించే ప్రయత్నం చేయడానికి ఇష్టపడడం లేదు. కామారెడ్డి ప్రాంతంలోని ఒకటి రెండు పాఠశాలలలో గ్రామస్థుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లిషు మీడియం మొదలుపెట్టా రు. అక్కడ పిల్లలంతా సర్కారు బడులనే ఆశ్రయిస్తున్నారు. దీనికి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఇలా అందరూ ఉపాధ్యాయులు ఆలోచిస్తే సర్కారు బడులకు పూ ర్వవైభవం తీసుకురావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధే లక్ష్యం
పాడేరు, న్యూస్‌లైన్ : వచ్చే విద్యా సంవత్సరంలో సంపూర్ణ గిరిజన విద్యాభివృద్ధి లక్ష్యంతో ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో పని చేయాలని గిరిజన సంక్షేమ డీడీ, ఇన్చార్జి ఏజెన్సీ డీఈఓ బి.మల్లికార్జునరెడ్డి ఆదేశించారు. తలారిసింగి ఆశ్రమ పాఠశాల భవనంలో అరకులోయ, అనంతగిరి మండలాలకు చెందిన అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక విద్య పటిష్టానికి ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. మెరుగైన ప్రాథమిక విద్యతోపాటు పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్ఎస్ఏ నిధులతో చేపట్టిన అదనపు భవనాల నిర్మాణాలను కూడా వేగవంతం చేస్తామన్నారు. పాఠశాలల అభివృద్ధికి రాజీవ్ విద్యామిషన్, ఎస్ఎస్ఏ నిధులను పారదర్శకంగా ఖ ర్చు పెట్టాలన్నారు. అన్ని పాఠశాలల కు గత విద్యా సంవత్సరంలో మంజూ రైన నిధులతో రంగులు వేయించాలని ఆదేశించినా కొన్ని పాఠశాలల్లోనే పనులు జరిగాయని చెప్పారు. మిగతా పాఠశాలల్లో పనులను కూడా విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేయాలన్నారు. రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 5 నుంచి 8వ తరగతి వరకు ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఎస్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని వివరించారు. అన్ని పాఠశాలలకు తరగతుల వారీగా పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ఉపాధ్యాయులు తీసుకెళ్లాలని సూచించారు. విద్యార్థులకు యూని ఫాం పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. వస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని, కుట్టుకూలి నిధులు కూడా ఆర్వీఎం పథకం కింద మంజూరయ్యాయన్నారు. సమావేశంలో అరకులోయ ఎంఈఓ సువర్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘నిర్బంధ కన్నడ’ రద్దు
సుప్రీం తీర్పు.. సర్కారుకు ఎదురు దెబ్బ - 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర - హైకోర్టు తీర్పు సరైందే - నాలుగో తరగతి వరకు ఇక ‘నిర్బంధం’ వద్దు - బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్దరాదు - తల్లిదండ్రుల నిర్ణయం మేరకే మాధ్యమం ఎంపిక - తీర్పు పట్ల విచారం వ్యక్తం చేసిన సాహితీవేత్తలు - అమలైతే భాషల మనుగడకు ప్రమాదమని ఆందోళన - అధ్యయనం చేసిన తర్వాతే తదుపరి చర్యలన్న సీఎం - ఇది భాషా మాధ్యమ ఉద్యమానికి - విఘాతం కాబోదన్న మంత్రి కిమ్మనె రత్నాకర్ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కొట్టి వేసింది. ప్రాథమిక విద్యను అభ్యసించాలనుకునే భాషా అల్ప సంఖ్యాకులపై బలవంతంగా స్థానిక మాతృ భాషను రుద్ద కూడదని అభిప్రాయపడింది. ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం. లోధా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఉత్తర్వులను వెలువరించడం ద్వారా సుమారు 20 ఏళ్ల వ్యాజ్యానికి తెర దించింది. నాలుగో తరగతి వరకు నిర్బంధ కన్నడ మాధ్యమాన్ని అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. రాష్ర్ట ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల మధ్య 1994 నుంచి ఈ న్యాయ పోరాటం సాగుతోంది. తల్లిదండ్రుల ఇష్టం తమ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుకోవాలనే విషయమై తల్లిదండ్రులు నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రాథమిక విద్యను విధిగా కన్నడ మాధ్యమంలోనే అభ్యసించాలన్న రాష్ట్ర ప్రభుత్వ భాషా మాధ్యమ విధానాన్ని రద్దు చేస్తూ హైకోర్టు 2008 జులై 2న వెలువరించిన తీర్పును సమర్థించింది. ప్రాథమిక విద్యలో కన్నడ మాధ్యమాన్ని నిర్బంధం చేయడం సరికాదని, సమంజసమూ కాదని పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల సమాఖ్య కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. భిన్నాభిప్రాయాలు సుప్రీం కోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జాగ్రత్తగా స్పందించారు. సాహితీవేత్తలు ఈ తీర్పు పట్ల విచారం వ్యక్తం చేశారు. తీర్పు ప్రతి చేతికందాక, పూర్తిగా అధ్యయనం చేసి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా సుప్రీం తీర్పు భాషా మాధ్యమ ఉద్యమానికి విఘాతం కాాబోదని పాఠశాలల విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, సాహితీవేత్తలతో చర్చించి తదుపరి న్యాయ పోరాటంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భాషా పరంగా చూస్తే ఈ తీర్పు దురదృష్టకరమని పేర్కొన్నారు. తీర్పు అమలైతే భాషల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తీర్పు ద్వారా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు గెలిచినట్లు భావించరాదని అన్నారు. ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలినట్లు కూడా కాదని తెలిపారు. సీనియర్ పరిశోధకుడు చిదానంద మూర్తి ఈ తీర్పు హాస్యాస్పదమని అన్నారు. మన సంస్కృతి బతికి బట్ట కట్టాలంటే మాతృ భాషలోనే ప్రాథమిక విద్యను బోధించాలని తెలిపారు. వేరే భాషల్లో బోధన వల్ల కన్నడం నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పారు. ‘ఒక వేళ నాకు అధికారం లభిస్తే దేశంలో ఆంగ్ల మాధ్యమాన్ని పెకిలించి వేస్తాను. మాతృ భాషలోనే విద్యా బోధన సాగాలని ఉత్తర్వులు జారీ చేస్తాను’ అని జాతి పిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. కాగా ఈ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం, కోర్టుల్లో రివ్యూ పిటిషన్లను దాఖలు చేస్తామని కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు పుండలీక హాలంబి తెలిపారు. ఈ తీర్పును ఒప్పుకోవడం సాధ్యం కాదని కన్నడ చళువలి నాయకుడు వాటాళ్ నాగరాజ్ పేర్కొన్నారు.