ఇన్ బాక్స్: ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక విద్యా విధానం ఎన్నో సవాళ్లని ఎదుర్కొంటున్నది. ఈ విద్యా విధా నంలో ‘భాష’ ప్రధానమైనది. అడుగు వర్గాల పిల్ల లకి, ఆదివాసీ పిల్లలకు ఏ భాషలో విద్య ఉండాలి అనే సమస్య ప్రపంచంలోని చాలా దేశాలు, సమా జాలు ఎదుర్కొంటున్నవి. బహుళ భాషలు ఉన్న ప్రాంతాలలో ఏ భాష బడి భాషగా ఉండాలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లే అక్షరాస్యత శాతం పెరగడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో యునెస్కో ప్రపంచవ్యాప్తంగా ఎంతో సమాచారం సేకరించింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు ఏడు వేల భాష లు ఉన్నాయి. అందులో 370 మిలియన్ల మూలవాసీ ప్రజలలో మూడింట రెండో వంతు పసిఫిక్ తీర ఆసియా దేశాలైన థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, మయన్మార్ వంటి దేశాలలో ఉన్నారు. ఈ తెగల ఆర్థిక పరిస్థితి దినదినం దిగజారిపోతున్నది. అలాగే భారతదేశంలో కూడా ఈ సమస్య పెద్దదిగానే ఉంది. ఆదివాసుల నేల గాలి నీరు పరాయీకరణకు గురవుతున్నది.
వారు నిర్వాసితులుగా చేయబడుతు న్నారు. ఈ క్రమంలో చరిత్రలోకి తొంగిచూస్తే ప్రతి దశలోనూ వారు నివసించే నేల నుండి తొలగిం పబడటం వాస్తవం. నేలని కోల్పో వడం తల్లిని కోల్పోవడమే. తల్లి భాషని, సంస్కృతిని కూడా కోల్పో వడమే. ఈ రెండూ పోయిన వాళ్లకి అస్తిత్వం కూడా మిగలదు. చిరు నామా, ఆత్మగౌరవం లేని నిర్జీవ శరీరాలుగా మిగిలి పోతారు. ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలి. ఆరేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా, నార్నూరు మండలంలోని గుంజాల గ్రామంలో కోయతూర్ లిపి లభించింది. ఇది చాలా కాలం నుండి ఉన్నది. ఈ లిపిలో రాతప్రతులు ఉండటమే కాదు, వాటిని చదివే నలుగురు వృద్ధ పండితులు కూడా జీవించి ఉన్నారు.
ఈ గుంజాల కోయతూర్ లిపి ఉపయోగిం చిన పలు చోట్ల ఎన్నో ప్రయత్నాలు చేశాం. చాలా వరకు సత్ఫలితాలు, సత్వర ఫలితాలు లభించాయి. ఉట్నూరులోని ఐటీడీయే సహకారంతో 15 ఏళ్లలో ఈ లిపిని ప్రవేశపెట్టిన కొద్ది మాసాలలోనే పిల్లలు సొంత లిపిలో, సొంత భాషలో గణనీయమైన ప్రగతి సాధించారు. ఇది ఎంతో ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. అందుకే గుంజాల గ్రామాన్ని ఆదివాసీ లిపిలో, ఆదివాసీ భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా తయారుచేయాలని నిర్ణయించాం. నాలు గేళ్ల పిల్లవాడి మొదలు డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు ఈ లిపిలో రాసేట్లు, చదివేట్లు చేయడమే ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నాం. దేశంలోనే మొట్ట మొదటి ప్రయోగం ఇది. అలాంటి ఆ కార్యక్రమానికి 15 డిసెంబర్ నాడు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆరు నెలల్లో గుంజాలలోని సుమారు పదిహేను వందల మంది తమ ఆదివాసీ లిపిలో సంతకం చేసి అధికారులకి అర్జీ పత్రాలు రాసే విధంగా అక్షరా స్యులుగా చేయాలని సంకల్పించాం. ఈ కార్యక్రమా నికి హితైషులను, మిత్రులను ఆహ్వానిస్తున్నాం. చరిత్రలో నిలిచిపోయే దినంగా దీనిని భావి స్తున్నాం. దేశంలో మొదటి ఆదివాసీ లిపిలో, గోండీ భాషలో పూర్తి అక్షరాస్యతని సాధించిన గ్రామంగా గుంజాల నిలిచిపోగలదని ఆశిస్తున్నాం.
ఈ కార్యక్రమానికి మా వేదిక కన్వీనర్, తెలం గాణ రచయితల వేదిక అధ్యక్షులు జయధీర్ తిరు మలరావు మార్గదర్శకులుగా ఉన్నారు. వారు అధ్య క్షత వహించే ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డా॥ జె.జగన్మోహన్, ఉట్నూరు ఐటీ డీఏ ఇన్‌ఛార్జీ పివో ప్రశాంత్ జె. పాటిల్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సిడాస్ట్ కోఆర్డినేటర్ ఆచార్య ఎస్.ఆర్.సర్రాజు తదితరులు పాల్గొంటారు.
అందరికీ ఆహ్వానం.
డా॥ జి.మనోజ శాఖాధిపతి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లిష్, పాలమూరు విశ్వవిద్యాలయం, మహబూబ్‌నగర్
గుంజాల కోయతూర్ లిపి అధ్యయన వేదిక, ఉట్నూరు / ఆదిలాబాద్, ఫోన్: 9704643240
ఆదివాసీ లిపిలో, భాషలో సంపూర్ణ అక్షరాస్య గ్రామంగా గుంజాల
Published Sat, Dec 13 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement