Basket price
-
సెప్టెంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం కూల్
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 18 నెలల కనిష్ట స్థాయికి దిగివచ్చింది. 10.7 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్లోకి వస్తువుల ధర 10.7 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ద్రవ్యోల్బణం తగ్గుతూ వస్తున్నప్పటికీ, 18 నెలల నుంచి రెండంకెల పైన కొనసాగుతోంది. సమీక్షా నెల్లో తయారీ, ఆహారం, ఇంధన ధరలు కొంత దిగివ చ్చాయి. డబ్లు్యపీఐ నెలవారీ తగ్గుదలకు ప్రధానంగా కమోడిటీ ధరలలో నియంత్రణ అని నిపుణులు పేర్కొంటున్నారు. కమోడిటీ ధరలు తగ్గుతాయన్న ధోరణి కూడా వ్యవస్థలో ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు రికవరీ ఊపందుకోవడం కూడా సానుకూల అంశమని వారు విశ్లేషిస్తున్నారు. గణాంకాల్లో కీలక విభాగాలు ఇలా... ► ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 11.03 శాతంగా ఉంది. ఆగస్టులో ఇది 12.37 శాతం. అయితే కూరగాయల ధరలు మాత్రం 39.66 శాతం పెరిగాయి. ఆగస్టులో ఈ స్పీడ్ 22.29 శాతం. ఆయిల్ సీడ్స్ ద్రవ్యోల్బణం 16.55% తగ్గింది. ► ఇంధనం, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 32.61 శాతం ఉంటే, ఆగస్టులో ఈ రేటు 33.67 శాతంగా ఉంది. ► ఇక సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 6.34 శాతంగా ఉంది. -
టోకు ధరల స్పీడ్ 11.16 శాతం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలో 11.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోల్చితే తాజా సమీక్షా నెల్లో టోకు ఉత్పత్తుల బాస్కెట్ ధర 11.16 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలలుగా టోకు ధరల స్పీడ్ రెండంకెలపైనే కొనసాగుతోంది. అయితే జూన్‌తో పోల్చితే టోకు ద్రవ్యోల్బణం తగ్గడమే కొంతలో కొంత ఊరట. ఏప్రిల్ (10.74 శాతం), మే (13.11 శాతం) జూన్ (12.07 శాతం)లలో కూడా టోకు ద్రవ్యోల్బణం రెండంకెలపైనే కొనసాగింది. అయితే ప్రస్తుతం ఈ స్థాయి ద్రవ్యోల్బణం కొనసాగడానికి 2020 ఇదే నెలల్లో ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితి (లో బేస్ ఎఫెక్ట్) ఉండడమూ కారణమన్న అంచనాలు ఉన్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ బేస్ 2020 జూలైని తీసుకుంటే టోకు ద్రవ్యోల్బణం మైనస్ 0.25 శాతం. అక్టోబర్ వరకూ టోకు ధరల తీవ్రతపై లో బేస్ ఎఫెక్ట్ ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫుడ్ ఆర్టికల్స్ టోకు ద్రవ్యోల్బణం తగ్గు తూ వస్తోంది. జూలైలో అసలు ఈ విభాగంలో ద్రవ్యోల్బణం యథాతథంగా కొనసాగింది. జూన్‌లో ఇది 3.09%. ఉల్లి ధరలు మాత్రం జూలైలో 72.01% పెరిగాయి. ► క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు జూన్‌లో 36.34% ఉంటే, జూలైలో 40.28 శాతంగా ఉంది. ► సూచీలో మెజారిటీ వాటా ఉన్న తయారీ రంగం టోకు ధరల పెరుగుదల జూలైలో 11.20 శాతం. జూన్‌లో ఇది 10.88%. -
రిటైల్ ధరలకు మళ్లీ రెక్కలు..!
- జూన్‌లో 5.4 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం - ఎనిమిది నెలల గరిష్టం న్యూఢిల్లీ: రిటైల్ ధరల జూన్‌లో భగ్గుమన్నాయి. రిటైల్ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూన్‌లో 5.4 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 జూన్‌లో ఈ వస్తువుల మొత్తం బాస్కెట్ ధరతో పోల్చితే... 2015 జూన్ నెలలో ఆ బాస్కెట్ ధర 5.4 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఎనిమిది నెలలుగా ఇంత స్థాయిలో ధరలు ఉండడం ఇదే తొలిసారి. ఒక్క చక్కెర, తీపి ఉత్పతులు తప్ప, మిగిలిన అన్ని వస్తువుల ధరలూ ఎంతోకొంత పెరిగాయి. చక్కెర ధరలు అసలు పెరక్కపోగా 8.55 శాతం క్షీణించాయి. పప్పు ధాన్యాల ధరలు మాత్రం భారీగా 22.24 శాతం పెరిగాయి. సుగంధ ద్రవ్యాల ధరలు 9.71 శాతం ఎగశాయి. మేలో రిటైల్ ధరల పెరుగుదల రేటు 5.01 శాతంకాగా, గత ఏడాది జూన్ నెలలో 6.77 శాతం. కేంద్ర గణాంకాల కార్యాలయం సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... వచ్చే నెల పావుశాతం రేటు కోత... ఆర్బీఐ రానున్న పాలసీ సమీక్ష(ఆగస్టు 14)లో రెపోరేటును పావు శాతం తగ్గించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్(బీఓఎఫ్ఏ-ఎంఎల్) అంచనావేసింది. అయితే తగిన వర్షపాత పరిస్థితులు ఉంటేనే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కాగా సంస్కరణలకన్నా... తక్షణం రెపో రేటు తగ్గింపే మధ్యకాలికంగా దేశ అభివృద్ధికి దారితీస్తుందని అభిప్రాయపడింది.