రైల్వే వెబ్ సైట్ హ్యాకర్ దొరికాడు
న్యూఢిల్లీ: తరచూ రైల్వే వెబ్ సైట్ ను హ్యాక్ చేస్తూ ప్రజల డబ్బును దండుకున్న నిందితుడిని ఎట్టకేలకు సీబీఐ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. వెబ్ సైట్ ను హ్యాక్ చేసి రైల్వే ఫేక్ టికెట్లు జనరేట్ అయ్యేవిధంగా చేసిన హమీద్ ను గురువారం సీబీఐ, రైల్వే విజిలెన్స్ అధికారలు ఉత్తరప్రదేశ్ లోని బస్తీ టౌన్ లో అరెస్టు చేశారు.
నకిలీ టికెట్లను తయారుచేసే సాఫ్ట్ వేర్ ను హమీద్ తయారు చేసినట్లు గుర్తించామని ఇందుకోసం, అతడిని పట్టుకునేందుకు మూడు రోజుల పాటు పట్టణంలోనే గడిపినట్లు కేసును డీల్ చేసిన అధికారి రోహిత్ మిశ్రా తెలిపారు. దేశవ్యాప్తంగా ఫేక్ టికెట్లను తయారు చేసే ముఠాలతో హమీద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని నుంచి 10 ల్యాప్ టాప్ లు, 16 ఏటీఏం కార్డులు, రెండు పాన్ కార్డులు, 50 లక్షల నగదును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సీబీఐ, రైల్వే విచారణా బృందాలు అతన్ని విచారిస్తున్నట్లు మరో అధికారి తెలిపారు.