Basudev Achariya
-
మాజీ ఎంపీ బాసుదేవ్ ఆచార్య కన్నుమూత: సీఎం మమత సంతాపం
Veteran CPI(M) leader Basudeb Acharia ప్రముఖ సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన బాసుదేవ్ ఆచార్య (81) కన్ను మూశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. దీంతో రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంత కాలంగా ఆయన వృద్ధాప్య కారణాలతో బాధపడుతున్నట్టు సమాచారం. బాసుదేవ్ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎండీ సెలీమ్ నివాళులర్పించారు. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ నియోజకవర్గానికి 9 సార్లు ఎంపికూ బాసుదేవ్ ఆచార్య బంకురాకు పర్యాయపదంగా నిలిచారు. 1980 నుంచి 2014 వరకు దాదాపు 34 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మున్మున్ సేన్ చేతిలో ఓడిపోయారు. 1942 జూలై 11 న పురూలియాలో జన్మించారు బాసుదేవ్. విద్యార్థి జీవితం నుండి చురుగ్గా ఉంటూ విద్యార్థి నాయకుడిగా, తరువాత కార్మిక నాయకుడిగా ఎదిగారు. అక్కడి గ్రామీణ గిరిజన సంఘం ఉద్యమంలో కీలకభూమికను పోషించారు. పశ్చిమ బెంగాల్ రైల్వే కాంట్రాక్టర్ లేబర్ యూనియన్, LIC ఏజెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, DVC కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ , ఇతరులకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు పనిచేసిన ఆచార్య 25 ఏళ్లపాటు రైల్వే స్టాండింగ్ కమిటీలో ఉన్నారు. Saddened at the demise of the veteran Left leader and former MP Basudeb Acharia. He was a trade union leader and Parliamentarian of formidable strength and his departure will cause significant loss in public life. Condolences to his family, friends and colleagues. — Mamata Banerjee (@MamataOfficial) November 13, 2023 -
నిబంధనలకు పాతర: లెఫ్ట్
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టే క్రమంలో అన్ని నియమ నిబంధనలనూ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కాయంటూ వామపక్షాలు దుయ్యబట్టాయి. ‘‘గురువారం సభలో జరిగిన సంఘటనలకు కేవలం మిరియాల ద్రావకం చల్లిన వారిని మాత్రమే బాధ్యులను చేయడం తగదు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు పూర్తి బాధ్యత వహించాలి. అవి సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోలేదు. నిజానికిదంతా ఉద్దేశపూర్వకంగా జరిగినదే. సభ సజావుగా సాగాలని కాంగ్రెస్ కోరుకోవడం లేదనేందుకు ఇదే రుజువు’’ అని సీపీఎం లోక్‌సభా పక్షనేత బాసుదేవ్ ఆచార్య ఆరోపించారు. ఇలాంటి వివాదాస్పద బిల్లును ప్రవేశపెట్టే విషయమై కేంద్రం కేవలం బీజేపీతో మాత్రమే చర్చించింది తప్ప ఇతర విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదంటూ తప్పుబట్టారు. తెలంగాణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టలేదన్నదే తమ అభిప్రాయమని ఆయన స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ బిల్లు అసలు సభ ఎజెండాలోనే లేదు. ఇది సభా నిబంధనలను బాహాటంగా ఉల్లంఘించడమే. పైగా బిల్లును ప్రవేశపెట్టినట్టుగా స్పీకర్ మీరాకుమార్ ప్రకటిస్తున్న సమయంలో, కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ‘నేను బిల్లును ప్రవేశపెడుతున్నాను’ అని అనలేదు. అలా అనడం తప్పనిసరి’’ అని తొమ్మిదోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచార్య చెప్పారు. తమ హయాంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా పూర్తి చేశామన్న బీజేపీ వాదనను సీపీఎం నేత సీతారాం ఏచూరి ఖండించారు. సభలో పూర్తి గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆ బిల్లులను ఆమోదింపజేసుకున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హింసాకాండ వ్యాప్తి చేసేందుకు పార్లమెంటును వేదికగా కాంగ్రెస్ వాడుకుంటోందని సీపీఐ మండిపడింది. సాకులతో తెలంగాణ ఏర్పాటును వీలైనంత ఆలస్యం చేయడమే వారి లక్ష్యమని ఆరోపించింది. -
కాంగ్రెస్ వల్లే ఇదంతా..!
సాక్షి, న్యూఢిల్లీ: గత మూడురోజులుగా పార్లమెంటు స్తంభించడంపై పలు విపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిస్థితికి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని స్పష్టం చేశాయి. జేడీయూ అధినేత శరద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఎం నేత బాసుదేవ్ ఆచార్య శుక్రవారం పార్లమెంటు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విభజన కు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో జరుగుతున్న ఆందోళనలు పార్లమెంటు ఉభయ సభలను వెంటాడుతున్నాయని శరద్ యాదవ్ అన్నారు. సభల ప్రతిష్టంభనకు కాంగ్రెస్ పార్టీదే బాధ్యత అని చెప్పారు. ‘పరిస్థితి మీరే చూస్తున్నారు.. సభ్యులు రోజూ వస్తున్నారు. వెళ్లిపోతున్నారు. పార్లమెంటు నడవకుంటే దేశం కూడా నడవదు’ అని అన్నారు. ‘అధికార పార్టీవారే ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ చేసిన ఆ పని (విభజన) మమ్మల్ని గడచిన మూడు సమావేశాల నుంచి వెంటాడుతోంది. వారి వల్లే ఇదంతా జరుగుతోంది’ అని చెప్పారు. తెలంగాణపై పార్లమెంటు స్తంభించడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిణామాలకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అయితే తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధిస్తోందని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులే అవిశ్వాస తీర్మానం ఇవ్వడం చూస్తుంటే.. ఆ పార్టీ కనుసన్నల్లోనే సభకు అంతరాయాలు కలుగుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయని సీపీఎం సభ్యుడు బాసుదేవ్ ఆచార్య వాఖ్యానించారు. పార్టీలన్నీ కలసి పరిష్కరించుకోవాలి: షిండే హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మాత్రం పార్టీలన్నీ కలసి తెలంగాణ అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో సభలో అంతరాయాలు ఏర్పడటం కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలకు సంబంధించిన అంశం కాదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాధ్ పేర్కొన్నారు. ఇది సీమాంధ్ర ఎంపీలు వర్సెస్ తెలంగాణ ఎంపీలకు సంబంధించిన ప్రశ్న అన్నారు. ఈ సభలో పరిష్కారం కాకపోతే తదుపరి సభలో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు.