బ్యాట్ సైజు ఎందుకు తగ్గించాలి: వాట్సన్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ‘బ్యాట్ల’ సైజ్ తగ్గించాలనే సూచనను వ్యతిరేకిస్తున్నాడు. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఇటీవల ముంబై సమావేశంలో పలు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. ‘బ్యాట్ కంపెనీలు ఎప్పటికప్పు డు బంతితో పోటీతత్వ ప్రయోజనానికి అనుగుణంగానే బ్యాట్లను రూపొందిస్తున్నాయి. చాలా ఏళ్లుగా వారి కృషి న్యాయబద్ధంగానే ఉంది. ఇప్పుడు కొత్తగా బ్యాట్ల సైజ్‌పై అర్థంలేని కుదింపులు తగవు. క్రిస్ గేల్‌నే చూస్తే... తనకు నప్పిన మూడు పౌండ్ల బరువున్న బ్యాట్‌తోనే సహజసిద్ధమైన ఆట ఆడతాడు. అంతేతప్ప అక్కర్లేని లెక్కల పరిమాణాలతో బ్యాట్ ను తగ్గిస్తే అతనికి నప్పుతుందా’ అని అసంతృప్తి వెళ్లగక్కాడు. మెరుగైన బౌలింగ్‌తో ఎంతటి ఆటగాడినైనా ఔట్ చేసే అవకాశం బౌలర్‌కు ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దని అతను సూచించాడు.