breaking news
Bathukamma celebrations at Telangana
-
కూకట్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
సరూర్‌నగర్ స్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
బతుకమ్మ వేడుకలు
మొదటి రోజున అమ్మవారిని శ్రీ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పరమాన్నం సమర్పిస్తారు.రెండో రోజున శ్రీ గాయత్రీదేవి రూపంలో నారింజరంగు చీరతో అలంకరిస్తారు. కొబ్బరి అన్నం, అల్లం గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు.మూడో రోజున శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా మినప వడలు, పులిహోర సమర్పిస్తారు.నాలుగో రోజున శ్రీ కాత్యాయనీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పాయసం, రవ్వకేసరి నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజున శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో గులాబిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణాలు, రవ్వకేసరి సమర్పిస్తారు.ఆరో రోజున శ్రీ లలితా త్రిపురసుందరీదేవి రూపంలో పసుపురంగు చీరతో అలంకరిస్తారు. రవ్వకేసరి, పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు.ఏడో రోజున శ్రీ మహాచండీదేవి రూపంలో బంగారురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కట్టుపొంగలి సమర్పిస్తారు.మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి రూపంలో తెలుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా పాయసం, శాకాన్నం సమర్పిస్తారు.దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గాదేవి రూపంలో ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం సమర్పిస్తారు. మహర్నవమి రోజున శ్రీ మహిషాసురమర్దిని రూపంలో నీలిరంగు చీరతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్కెరపొంగలి సమర్పిస్తారు.చివరిగా విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి రూపంలో ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. దద్ధ్యోదనం సహా మహానైవేద్యాన్ని సమర్పిస్తారు.దసరా నవరాత్రులతో పాటు తెలంగాణలో బతుకమ్మ వేడుకలు కూడా ఘనంగా జరుగుతాయి. ఈ తొమ్మిది రోజుల వేడుకలు దసరా నవరాత్రులకు ఒకరోజు ముందుగానే, భాద్రపద బహుళ అమావాస్య– అంటే మహాలయ అమావాస్య నుంచి మొదలవుతాయి. బతుకమ్మ వేడుకలు దుర్గాష్టమి నాటితో ముగుస్తాయి. బతుకమ్మ వేడుకల్లో రంగురంగుల పూలతో బతుకమ్మను వాకిళ్లలో కొలువుదీర్చి; బాలికలు, మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడతారు.బతుకమ్మ వేడుకల తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండి, నువ్వులు కలిపిన నైవేద్యాన్ని బతుకమ్మకు సమర్పిస్తారు. రెండో రోజు అటుకుల బతుకమ్మ. ఈ రోజున చప్పిడిపప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారు.నాలుగో రోజు నానేబియ్యం బతుకమ్మ. ఈ రోజున నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు.ఐదో రోజు అట్ల బతుకమ్మ. ఈ రోజున నైవేద్యంగా అట్లు సమర్పిస్తారు.ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఈ రోజున నైవేద్యం ఏమీ సమర్పించరు.ఏడో రోజు వేపకాయల బతుకమ్మ. ఈ రోజున బియ్యంపిండిని బాగా వేపి, వేపకాయల్లా తయారుచేసి, నైవేద్యంగా సమర్పిస్తారు.ఎనిమిది రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈ రోజున నువ్వులు, వెన్న, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మ. ఈ రోజున ఐదురకాల నైవేద్యాలను సమర్పిస్తారు. బతుకమ్మ వేడుకలు ముగిశాక విజయదశమి నాడు దసరా పండుగను ఊరూరా ఘనంగా జరుపుకొంటారు. శమీవృక్షానికి– అంటే, జమ్మిచెట్టుకుపూజ చేస్తారు. ఒకరికొకరు జమ్మి ఆకులను ‘బంగారం’గా ఇచ్చుకుని, అభినందనలు తెలుపుకుంటారు. విందు వినోదాలతో దసరా పండుగను ఆనందంగా జరుపుకొంటారు. -
కోఠి ఉమెన్స్ కాలేజీలో బతుకమ్మ వేడుకలు..అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)
-
పీపుల్స్ ప్లాజా వేదికగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు (ఫొటోలు)
-
సర్వాంగ సుందరంగా బతుకమ్మ కుంట.. హైడ్రాపై ప్రశంసలు (ఫొటోలు)
-
బీజేపీ మహిళా నేతలతో కలిసి బతుకమ్మ ఆడిన నటి ఖుష్బూ (ఫొటోలు)
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
హన్మకొండ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)
-
తంగేడు పూసింది గునుగు నవ్వింది
చినుకుల చాటు నుంచి కురిసిన మంచు బిందువులు ముత్యం మాదిరిగా గుమ్మడి ఆకును అలంకరించగా.. సూర్యుడి కన్నా ముందే గుమ్మడి పువ్వు ప్రకాశించగా.. పచ్చపచ్చని తీగల మధ్య ముద్దగౌరమ్మ ముద్దుగా కనిపించగా.. నేలపై పాలు పారినట్లు గునుగు నవ్వంగా.. తంగేడు తన్మయం చెందగా.. పట్టుకుచ్చు పురివిప్పగా.. తొలిపొద్దున చేనులో నుంచి తెంపుకొచ్చి.. దేవుళ్ల ఎదుట ఉంచి.. అందంగా పేర్చి, గౌరమ్మను చేర్చి ఆడపడుచులు ఆడిపాడే బతుకమ్మ పండుగ వచ్చేసింది. నేటి ఎంగిలిపూలతో మొదలయ్యే వేడుక.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.వీధులు.. పూల వనాలురామరామరామ ఉయ్యాలో.. రామనే సీరామ ఉయ్యాలో.. సిరుల మాతల్లి ఉయ్యాలో.. సిరులతో రావమ్మా ఉయ్యాలో.. అని ఊరూవాడా తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆడిపాడే పండుగ వచ్చేసింది. ఆశ్వయుజ పాఢ్యమి నుంచి ఎంగిలిపూలతో మొదలై తొమ్మిదో రోజు సద్దులతో ముగిసే బతుకమ్మ సంబరాలతో పల్లె, పట్టణాల్లోని వీధులన్నీ పూలవనాలు గా మారనున్నాయి. ఆశ్వయుజ మాసంలో విరి విగా పూసే పూలతో సిబ్బిలో పేర్చి సాయంత్రం ఆడపడుచులందరూ ఒక్కచోట చేరి రామరామ అంటూ రమణీయంగా ఆడిపాడనున్నారు. కనిపించని గునుగుగునుగుపువ్వు బతుకమ్మ కూర్పులో కీలకం. ఆ రోజుల్లో పట్నాలు.. పల్లెల పరిసరాల్లో ఎక్కడ చూసినా గునుగుపూలకు కొదువ ఉండేది కాదు. ఇప్పుడు గునుగు దొరకాలంటే కష్టమవుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో.. బీడుభూముల్లో కనబడుతున్నా.. అనుకున్న రీతిలో లేకపోవడం కలవరపెడుతోంది. ఫలితంగా మార్కెట్లో సరుకుగా మారిపోయింది. ఔషధ గుణాలతో అలరించే గునుగుపూలకు రంగులు పూస్తుండటం మరో సమస్యగా మారింది. గునుగు చిన్నకట్ట రూ.50కి ఇస్తున్నారు. కొంచెం పెద్దకట్ట కావాలంటే రూ.వంద వరకు చెల్లించాల్సిందే. ఈ పది రోజుల పాటు గునుగుపూలకు ఎక్కడాలేని డిమాండ్ ఏర్పడనుంది.ఆడపడుచుల వేడుకబతుకమ్మ అంటే బతుకునిచ్చే వేడుక. చిన్నాపెద్దా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించే అమ్మవారి దీవెన. తల్లి కటాక్షాన్ని ఆకాంక్షిస్తూ ఆడపడుచులంతా ఒక చోట చేరి ఆటపాటలతో సందడి చేస్తారు. అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్లలు బతుకమ్మ పండుగకి పుట్టింటికి రావడంతో ఆ ఇల్లు కొత్తకళను సంతరించుకుంటుంది. బతుకమ్మ పండుగ మొదటిరోజు సందడి ఉంటుంది. కాబట్టి సమీపంలోని చేనూచెలకా నుంచి ఒకరోజు ముందే అవసరమైన పూల సేకరణ జరుగుతుంది. తడి వస్త్రంలో కప్పి ఉంచి వాడిపోకుండా జాగ్రత్త పడతారు. మరుసటి రోజు ఆ పూలతో బతుకమ్మను పేరుస్తారు. ముందురోజు పూలతో పేరుస్తారు కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు.విభిన్నం బతుకమ్మఉమ్మడి జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. అయితే జిల్లాలోని విభిన్న సాంస్కృతుల కారణంగా బతుకమ్మను కూడా విభిన్న తీరిలో జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని వేములవాడ, మానకొండూర్ మండలం శ్రీని వాస్నగర్, రాఘవాపూర్, కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, ఇల్లంతకుంట మండలం పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకుంటారు. మెజారిటీ ప్రాంతాల్లో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ ఆడతారు. రుద్రంగి, చందుర్తి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో దసరా మరునాడు బతుకమ్మ ఆడడం ఆనవా యితీ. అదే విధంగా జగిత్యాల జిల్లాలో బావి బతుకమ్మ ఆడతారు. ఎంగిలిపూల రోజున మధ్యలో బావి లాంటి గుంత తవ్వి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడతారు. తొమ్మిదిరోజులు ఇదే విధంగా ఆడతారు. సద్దుల బతుమ్మ అనంతరం బావిని పూడ్చుతారు.రాజన్న పాట వినాలి్సందేఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన మీసాల రాజయ్య బతుక మ్మ పాటల స్పెషలిస్ట్. మ హిళలకన్నా మధురంగా పాడుతున్నాడు. రాజయ్య జానపద యక్షగాన కళాకారుడు. జానపద యక్షగానాలను తన 27వ ఏటే ప్రారంభించాడు. సొంత గ్రామంలో బతుక మ్మ పాటలు పాడుతూ.. గుర్తింపు తెచ్చుకున్నాడు.60 ఏళ్లనుంచి ఆడుతున్నమల్యాల: పదేళ్ల వయసు నుంచి బతుకమ్మ ఆడుతున్న. పొద్దంతా పనికి పోయి వచ్చి పొద్దూకి ఇంటి వెనక ఉన్న గుమ్మడి పూలతో బతుకమ్మ పేర్చి ఆడేవాళ్లం. వాడకట్టోళ్లందరం చప్పట్లు కొట్టుకుంటూ.. పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడితే పనికిపోయిన అలసట పోయేది.– ఇట్టిరెడ్డి భూమవ్వ, గుడిపేట, మల్యాలనుదుటి సిందూరం పండుగల్లో ముఖ్యమైంది బతుకమ్మ. ఆడవాళ్లకు ఇష్టమైన వేడుక. పెళ్లయి అత్తారిళ్లకు వెళ్లినవారు పుట్టింటికి చేరుకుని, బంధుమిత్రులతో కలిసి జ్ఞాపకాలు నెమరేసుకునే పండుగ. మన సంప్రదాయాలు, సంస్కృతికి అద్దంగా నిలుస్తుంది. తెలంగాణ పర్వదినాల్లో పూల దేవత పూజదే ప్రాముఖ్యత. – వాసాల స్నేహ, సాయినగర్, కరీంనగర్ -
బతుకమ్మ సంబరాలకు సర్వం సిద్ధం: ఉత్సవాల షెడ్యూల్ ఇదే!
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబురాలు రేపటి (ఆదివారం) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుకానున్నాయి. బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అనసూయ బతుకమ్మ అరంభ వేడుకలో పాల్గొననున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపోందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.బతుకమ్మ పండగను సంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని కోరారు.బతుకమ్మ ఉత్సవాల షెడ్యూల్21వ తేదీ ఆదివారం • వేయి స్తంభాల గుడి, వరంగల్ – బతుకమ్మ ప్రారంభోత్సవం (సాయంత్రం) • హైదరాబాద్ శివారులో మొక్కలు నాటడం (ఉదయం)22వ తేదీ పోమవారం • శిల్పరామం, హైదరాబాద్ • పిల్లలమర్రి, మహబూబ్‌నగర్23వ తేదీ మంగళవారం • బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ24వ తేదీ బుధవారం • కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి • సిటీ సెంటర్, కరీంనగర్ 25వ తేదీ గురువారం • భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం • జోగులాంబ అలంపూర్, గద్వాల • స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ (25/09/2025 నుంచి 29/09/2025 వరకు)26వ తేదీ శుక్రవారం • అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్ • ఆదిలాబాద్, మెదక్ • నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం)27వ తేదీ శనివారం • మహిళల బైక్ ర్యాలీ - నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ – (ఉదయం) • ఐటి కారిడార్, హైదరాబాద్ – బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)28వ తేదీ ఆదివారం • ఎల్బి స్టేడియం, హైదరాబాద్ – గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)29వ తేదీ సోమవారం • పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ – ఉత్తమ బతుకమ్మ పోటీలు, సరస్ ఫెయిర్ (SHG’s తో) • RWA’s (రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేషన్స్), Hyderabad Software Enterprises Association: (HYSEA) , హైదరాబాద్30/09/2025 & రంగారెడ్డి ప్రాంతం – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు30 తేదీ మంగళవారం • ట్యాంక్‌బండ్ – గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ఫ్లోట్స్, IKEBANA (ఇకెబానా - జపనీయుల) ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3D మ్యాప్ లేజర్ షో -
‘తెలంగాణ’ జిల్లాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
తెలంగాణలో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)
-
భాగ్యనగరం.. బతుకమ్మ వేడుకలు
-
భాగ్యనగరం.. బతుకమ్మ వనం
-
ఏమేమి పువ్వొప్పునే.. గౌరమ్మ