ఉన్మాదిని విచారిస్తున్న పోలీసులు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో శనివారం రాత్రి పట్టుబడ్డ ఉన్మాది బత్తల రామచంద్రను పోలీసులు విచారిస్తున్నారు. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను గత ఏడాది డిసెంబరులో కడప జైలులో జీవితఖైదు అనుభవిస్తూ పారిపోవడం, తాజాగా ఐరాలలో పోలీసులకు పట్టుబడటం తెలిసిందే.
జైలు నుంచి ఎలా పారిపోయాడు..? ఇంతకాలం ఎక్కడ తలదాచుకున్నాడు..? అనే వివరాలను నిందితుడి నుంచి రాబట్టేందుకు చిత్తూరు పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక ఇతన్ని అరెస్టుచూపే అవకాశం ఉంది.