శాతకర్ణి వీణ మీటితే...
శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి యుద్ధంలో అపజయం ఎరుగని వీరుడు మాత్రమే కాదు.. సంగీత ప్రియుడు, శృంగార పురుషుడు అట. క్రిష్ దర్శకత్వంలో శాతకర్ణిగా బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ప్రచార చిత్రాల్లో యుద్ధ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో చూపించారు. యుద్ధంతో పాటు నవరసాలు ఉన్నాయని చెప్పడానికి శాంపిల్ అన్నట్టు, నేడు క్రిష్ పుట్టినరోజు సందర్భంగా ఈ వర్కింగ్ స్టిల్ విడుదల చేశారు.
శాతకర్ణి వీణ మీటితే ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ తర్వాత చూడాలి. ఓ పాట, శివ రాజ్‌కుమార్‌పై రెండు రోజుల పాటు సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉందట. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తు న్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు..