Bavana giri
-
ప్రధాని సభకు భారీ బందోబస్తు
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి మండలం రాయిగిరి శివారులో శనివారం నిర్వహించే కాంగ్రెస్ సభకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొనే ఈ బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ర్ట అదనపు డీజీ సదీప్లాక్టాకియా, ఇంటలిజెన్స్ సెక్యూరిటీస్ ఐజీ మహేష్ భగవత్‌ల అధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే సభాస్థలిని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంచెల బందోబస్తును ఏర్పా టు చేశారు. వేదిక సభాప్రాంగణం, హెలిప్యాడ్, వీఐపీ, వీడియో గ్యాలరీ, పార్కింగ్ స్థలాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావుతో పాటు ఆరుగురు డీఎస్పీ లు, 24మంది సీఐలు, 23మంది ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులు స్పెషల్ పార్టీలు బాంబ్ డిస్పోజల్ టీమ్‌లు తమ విధులను నిర్వహించనున్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బం దికి ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. కాగా నాయకులకు వీఐపీ పాస్‌లు జారీ చేసినట్లు చెప్పారు. పాస్‌లు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. నాలుగు గంటలకు సభ ఉన్నందున 3గంటలకే నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సభా ప్రాంగణం సిద్ధం ప్రధాని సభ కోసం సభా ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేశారు. సభా ప్రాంగణం, వేదిక, హెలిప్యాడ్లు సిద్ధమయ్యాయి. సభ ఏర్పాట్లను భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం గూడూరు నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. 3లక్షల మంది హాజరయ్యే ఈ సభకు ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్, రా్రష్ట వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్, కుంతియాతో పాటు పలువురు కాంగ్రెస్ ఉన్నతస్థాయి నాయకులు హాజరౌతారని చెప్పారు. ఏర్పాట్ల పరిశీలనలో మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, జహంగీర్, లాల్రాజ్లు పాల్గొన్నారు. ప్రధాని పర్యటన షెడ్యూల్ ప్రధానిమంత్రి మన్మోహన్సింగ్ శని వారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 3.10గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి 3.15గంటలకు హెలిక్యాప్టర్‌లో బయలుదేరి భువనగిరి సమీపంలో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ వద్దకు 3.45గంటలకు చేరుకుంటా రు. అక్కడి నుంచి సాయంత్రం నాలుగు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం పూర్తికాగానే తిరిగి ఐదు గంటలకు తిరుగు పయనమవుతారు. -
నేతన్నకు బాసట
పట్టుచీరల తయారీకి కావాల్సిన ముడిసరుకు కోసం చేనేత కార్మికులు ఇక ప్రైవేట్వ్యాపారులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఆలేరులోనే పట్టుదారం డిపోను ప్రారంభించబోతున్నారు. పట్టుపరిశ్రమశాఖ తెలంగాణ ప్రాంతంలో పెలైట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తున్నఈ పట్టుదారం(సిల్క్ యాన్) డిపో వల్ల చేనేతకార్మికులకు లబ్ధిచేకూరనుంది. భువనగిరి, న్యూస్‌లైన్: నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని భువనగిరి, జన గామ డివిజన్లలో పట్టు చీరలు తయారు చేసే చేనేత కార్మికులు వేలాదిగా ఉన్నారు. పట్టు చీరల తయారీకి అవసరమైన పట్టు దారం కొనుగోలు కోసం కార్మికులు నెలనెలా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వీరు ఇచ్చే పట్టు దారంపై ఎలాంటి రాయితీ లభించదు. అయితే చేనేత కార్మికులకు కిలో పట్టుదారంపై 10శాతం సబ్సిడీ ఇచ్చే సిల్క్యాన్ డిపోను శుక్రవారం ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ప్రారంభినున్నారు. కేంద్ర ప్రభుత్వం పట్టుదారంపై ఇస్తున్న సబ్సిడీని ఇంతకాలం పొందకుండా నష్టపోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఈ డిపో ద్వారా లబ్ధిచేకూరనుంది. పట్టు పరిశ్రమ శాఖ తెలంగాణ ప్రాంతంలో ఈ డిపోను తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తోంది. ఈ డిపో వల్ల ప్రతి చేనేత కుటుంబానికి నెలకు నాలుగు కిలోల పట్టుదారంపై 10 శాతం రాయితీ లభిస్తుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం కేంద్రాలను పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నడిపి స్తున్నారు. సబ్సిడీ ఇలా.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 10 శాతం రాయితీని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేనేత కార్మికులకు అందజేస్తారు ఈ మొత్తాన్ని కార్మికులకు నేరుగా ఇవ్వరు ఎన్‌హెచ్‌డీసీ ద్వారా గుర్తింపు పొందిన పట్టు దారం సప్లయర్స్‌కు సబ్సిడీ ఇస్తారు అతను ప్రతి కార్మికుడికి నెలకు 4 కిలోల పట్టుదారం సరఫరా చేయాలి ఇందుకోసం కార్మికులు 90 శాతం చెల్లించి అతని ద్వారా డిపోలో దారం పొందాలి చేనేత కార్మికులను గుర్తించనున్న జౌళిశాఖ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని పొందడానికి గుర్తింపు కార్డు తప్పనిసరి. జౌళిశాఖ అధికారులు చేనేత కార్మికులను గుర్తించి వారి జాబితాను ఎన్‌హెచ్‌డీసీకి పంపుతారు. ఆ శాఖ పాస్ బుక్‌లను ఇస్తుంది. అప్పుడు పాస్‌బుక్ ఉన్న కార్మికులకు 10 శాతం రాయితీ లభిస్తుంది. మిగతా 90 శాతం మొత్తాన్ని బ్యాంకులో గుర్తింపు పొందిన సప్లయర్ అకౌంట్లో కార్మికుడు జమ చేయాలి. చేనేత కార్మికుడు రాయితీ పొందాలంటే ఆయా సంఘాలు తమ పరిధిలోని నేత కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వడంతో పాటు వారికి గుర్తింపుకార్డులు అందేలా చూడాలి. డిపో నిర్వహణ ఇలా.. ఈ డిపో నిర్వహణకు ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమిస్తారు. అతడికి 2.5 శాతం సర్వీస్‌చార్జీలు చెల్లించి డిపోను నడిపిస్తారు. కార్మికులు ఉపయోగించుకుంటే భవిష్యత్‌లో పట్టుపరిశ్రమశాఖ తమ ఉద్యోగులను నియమించుకుంటుంది. చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది సిల్క్యాన్ డిపో ఆలేరులో ఏర్పాటు చేయడం వల్ల చేనేత కార్మికులకు లబ్ధిచేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 10 శాతం రాయితీ నేరుగా కార్మికుడికి అందుతుంది. అలాగే నాణ్యమైన సిల్క్ దారం లభిస్తుంది. ఎక్కువ మంది కార్మికులు ఈ డిపోను ఉపయోగించుకోవాలి. డిపోను ప్రారంభించనుండడం ఆనందంగా ఉంది. - బూడిద భిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్యే, ఆలేరు