bc sangham
-
ప్రత్యేక హోదాతోనే రాష్ర్టాభివృద్ధి
అనంతపురం న్యూటౌన్ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీసీ జనసభ యువజన సంఘం అధ్యక్షులు సగర పవన్‌కుమార్ అన్నారు. ఆదివారం జనసభ జిల్లా కార్యాలయంలో యువజన కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమంలో పవన్‌కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం హోదా ఇస్తామని చెప్పి తీరా ఇప్పుడు ప్యాకేజీ రాగం అందుకోవడం తెలుగు వారిని మోసగించడమేనన్నారు. ప్యాకేజీకి చట్టబద్ధత లేదని హోదాతో మాత్రమే అనేక రాయితీలు వస్తాయని, పరిశ్రమలు విరివిగా వచ్చి నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. తమిళులు జల్లికట్టు కోసం చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరులో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రామ్మోహన్, రమేష్, తరుణ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘జన్మభూమి’తో ప్రజలకు ఒరిగిందేమి లేదు
గుంతకల్లు : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంతో పేదలకు ఒరిగిందేమి లేదని, ఊకదంపుడు ఉపన్యాస్యాలు తప్ప సమస్యల పరిష్కారం శూన్యమని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ విమర్శించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. టీడీపీకి బీసీలు వెన్నెమొక అని చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. వడ్డెర, వాల్మీకి, రజక, బెస్త, మేదర తదితర కులాలను ఎస్టీల్లో చేరుస్తానని, రూ.10 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేస్తామని ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చనపుడు బీసీలకు ఎలా న్యాయం చేస్తారని విశ్వసించాలని ఆయన ప్రశ్నించారు.