BC Teachers
-
క్రీమీలేయర్‌ను రద్దు చేయాలి: జాజుల
యాదగిరిగుట్ట: బీసీలకు క్రీమీలేయర్‌ను పెట్టి వారికి రిజర్వేషన్లు అందకుండా ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని వెంటనే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉపాధ్యాయులకు వెంటనే పదో న్నతులు వాటిలో రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరా రు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శుక్రవారం జరిగిన బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కౌన్సిల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 47 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అనంతరం సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన సురేశ్, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి జిల్లాకు చెందిన నరేంద్రస్వామి ఎన్నికయ్యారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలి
– బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు మహబూబ్‌నగర్ విద్యావిభాగం: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని బీసీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కష్ణుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, బీసీ ఉపాధ్యాయ, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, ప్రమోషన్లకు కావాల్సిన చదువుకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అన్నారు. క్రిమిలేయర్ విధానాన్ని తొలగించేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్యతో అసెంబ్లీలో చర్చించి రద్దు చేసేందుకు రాష్ట్ర శాఖ కషి చేస్తుందన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములు, రమేష్, గురుప్రసాద్, సదాశివుడు, సత్యం, రవి, రాజు, రాఘవేందర్, శివకుమార్ పాల్గొన్నారు.