beast mode
-
తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన ఆరోగ్యంపై కీలక అప్డేట్ ఇచ్చాడు. ఎట్టకేలకు 8నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్నట్లు తెలిపాడు. విజయ్‌కు కొన్నినెలల కొందట భుజానికి గాయం అయ్యింది. ఆ నొప్పితోనే లైగర్ షూటింగ్‌తో పాటు ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. అయితే చికిత్స అనంతరం ఇప్పుడు పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడినట్లు విజయ్ పేర్కొన్నాడు. ఈ మేరకు ఓ ఫోటోను షేర్ చేస్తూ.. ‘బీస్ట్ బయటకు రావడానికి ఉబలాటపడుతోంది. అది ఇంతకాలం పంజరంలో ఉండిపోయింది’ అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. సినిమాల్లోకి రాకముందే విజయ్‌కు షోల్డర్ ఇంజ్యురీ అయ్యిందట. లైగర్ షూటింగ్ సమయంలో ఆ గాయం మళ్లీ తిరిగబెట్టిందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే కొంతవరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా కొద్ది రోజులు షూటింగ్‌కు బ్రేక్‌పడింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బీస్ట్ మోడ్ తో ఎస్-8!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శామ్సంగ్ నుంచి సరికొత్త పరిజ్ఞానంతో ఎస్-8 రానుంది. వాస్తవానికి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఎస్8ను శాంసంగ్ విడుదల చేస్తుందని అందరూ భావించారు. అయితే, ఆ సమయానికి ఎస్8 మొబైల్ విడుదల కాదని తెలిసింది. బ్యాటరీ లోపాలతో నోట్7 మొబైల్ ఫోన్లు పేలిపోవడంతో సంస్థ గెలాక్సీ ఎస్8పై శాంసంగ్ ప్రత్యేక దృష్టి సారించిందట. ముఖ్యంగా బ్యాటరీ విషయంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 27, 2017 నుంచి మార్చి 2 వరకు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ జరగనుంది. అయితే ఎస్8ను ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు శామ్సంగ్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త ఫోన్లో 'బీస్ట్'మోడ్‌ను అందుబాటులోకి తీసుకురానుందట. దీనివల్ల ప్రాసెసర్ వేగం పెరగడంతో పాటు, మొబైల్ మెమొరీ సామర్థ్యం మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఎస్8 8 జీబీ ర్యామ్‌ను కలిగి, డ్యుయల్ కెమెరాతో రానున్నట్లు పలు టెక్నాలజీ సైట్లు పేర్కొన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్‌తో పనిచేయనుంది.