Beauty treatment
-
ముఖంపై ముడతలు, మచ్చలను మాయం చేసే డివైజ్..!
మేకప్, టచప్ అంటూ ఎన్ని కాస్మొటిక్ ప్రోడక్ట్స్ మార్చినా.. యవ్వనానికి మించిన అందమే ఉండదు. అందుకే ఆ యవ్వనం కోసం తాపత్రయపడుతుంటారు సౌందర్యప్రియులు. వయసు పెరిగేకొలదీ వచ్చిన.. ముడతల చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్. చూడటానికి సిస్టమ్‌లానే, మినీ ల్యాప్‌టాప్‌లా కనిపించే... ఈ డివైజ్ వయసుతో వచ్చే ముడతలను, గీతలను ఇట్టే పోగొడుతుంది. చర్మానికి తగిన స్పాను అందిస్తుంది. Microdermabrasion: ఆటో మోడ్, సెన్సిటివ్ మోడ్, మాన్యువల్ మోడ్.. అనే మూడు వేరువేరు మోడ్స్‌తో చర్మానికి ఎక్స్ఫోలియేటర్ స్క్రబ్‌ను అందిస్తుంది. సిస్టమ్‌కి కుడివైపున అటాచ్ అయిన పొడవాటి ట్యూబ్ (ప్లాస్టిక్ వాండ్) లాంటిది ఉంటుంది. దానికే మరో చివర, డివైజ్‌తో పాటు లభించే.. 3 విడి భాగాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవే.. పోర్ ఎక్స్ట్రాక్షన్ టిప్ (రంధ్రాలను రూపుమాపేందుకు సహకరించే పార్ట్), మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ (మృతకణాలను, వ్యర్థాలను తొలగించే పార్ట్), డైమండ్ టిప్ (ముడతలు, గీతలు తొలగించే పార్ట్). వాటిని అమర్చిన తర్వాత.. ప్లాస్టిక్ వాండ్‌ను పెన్ మాదిరి పట్టుకుని, చర్మానికి ఆనిస్తే సరిపోతుంది. పునర్యవ్వనంతో కూడిన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్ బటన్, మోడ్ సెలెక్షన్ బటన్, స్టార్ట్/స్టాప్ బటన్, లెవల్స్/ఏరియా బటన్, ఎల్సిడి స్క్రీన్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పవర్ అడాప్టర్, క్లీనింగ్ బ్రష్, రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ (డైమండ్ టిప్‌లో మార్చాల్సిన ఫిల్టర్స్) మెషిన్‌తో పాటు లభిస్తాయి. దీని ధర సుమారు 179 డాలర్లు. అంటే 13,405 రూపాయలు. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
మీ చర్మ కాంతిని మరింత పెంచే మసాజ్ స్క్రాపర్.. ధర ఎంతంటే..
చర్మ సంరక్షణకు మించిన సౌందర్య రహస్యం మరోకటి లేదు. దానికి అద్భుతమైన టూల్ ఈ మసాజ్ స్క్రాపర్. హై క్వాలిటీ ఆక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టెరిన్ – స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిందీ మినీ డివైజ్. దీని నుంచి విడుదలయ్యే 45 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. స్కిన్ కేర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వైబ్రేషన్స్.. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, కాంతిమంతం చేయడానికి తోడ్పడతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఈ స్క్రాపింగ్ మసాజ్ టూల్.. చర్మంపైన ఆక్యుపాయింట్స్ని ప్రేరేపించేలా త్రికోణ ఆకారంలో ఉంటుంది. దీనిలో స్మూతింగ్ మోడ్, యాక్టివేటింగ్ మోడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్మూతింగ్ మోడ్.. లో–వైబ్రేషన్ అందిస్తే, యాక్టివేటింగ్ మోడ్.. హైయర్–వైబ్రేషన్‌ను అందిస్తుంది. దాంతో కొన్ని నిమిషాల్లోనే చర్మం తేజోవంతమవుతుంది. ఇక్కడున్న చిత్రాన్ని గమనించినట్లైతే.. కింద ఉన్న చార్జింగ్ బేస్‌కి వెనుక భాగంలో యు.ఎస్.బి పోర్ట్ ఉంటుంది. దాంతో ఈ డివైజ్‌ని చార్జింగ్ బేస్‌లో అమర్చి.. యు.ఎస్.బి పోర్ట్‌కి చార్జర్ పెట్టుకుంటే.. వైర్లెస్ మసాజర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరోసారి ఉపయోగిస్తున్నప్పుడు.. చివరిగా ఏ మోడ్‌తో ఆఫ్ అయ్యిందో అదే మోడ్‌తో పని చేస్తుంది. ఈ ట్రయాంగిల్ టూల్ వాటర్ ప్రూఫ్ కావడంతో నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర 159 డాలర్లు. అంటే సుమారు 12 వేల రూపాయలు. చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి.. లక్షల్లో ధర! -
Skin Care Tips: అలొవెరా జ్యూస్ తాగితే ఇన్ని ఉపయోగాలా?!
కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులు, పని ఒత్తిడి కారణమేదైనా.. మీ చర్మం సహజ కాంతిని కోల్పోతున్నట్లనిపిస్తే వెంటనే తగుజాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చర్మానికి తీరని నష్టం వాటిల్లుతుంది. వీటితోపాటు మీ ఆహార అలవాట్లలో కూడా కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా అందే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా, మృదువుగా ఉంచేందుకు ఎంతో తోడ్పడతాయి. ఒకవేళ సహజమైన పద్ధతుల్లో మీ చర్మానికి చికిత్స అందించాలంటే అలోవెరా (కలబంద)కు మించిన ఔషధం మరొకటి లేదని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అలొవెరా ఏ విధంగా చర్మకాంతిని మెరుగుపరుస్తుందో తెలుసుకుందాం.. చర్మానికి కలబంద చేసే మేలు.. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు అధికంగా ఉంటాయి. డల్ స్కిన్, ముడతలకు కారణమయ్యేఫ్రీ రాడికల్స్ నివారణకు సహాయపడుతుంది. డీకే పబ్లిషింగ్ హౌస్ వారి ‘హీలింగ్ ఫుడ్స్’బుక్ ప్రకారం బేటా కెరోటిన్, సి, ఇ, బి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బిలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఆయుర్వేదంలో కూడా మొటిమలు, కాలిన గాయాల నివారణకు అలొవెరా ఉపయోగంలో ఉంది. అలొవెరా జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే.. కలబందను జ్యూస్ రూపంలో తాగడం చాలా ఉత్తమమైన మార్గం. మీడియం సైజులో ఉండే ఒక అలొవెరా ఆకును తీసుకుని, చిన్న ముక్కలుగా కట్ చేయాలి. పై తోలును తొలగించి జెల్‌ను ఒక గిన్నెలో వేసి నీళ్లతో శుభ్రం చేయాలి. దీనిలో పైనాపిల్,యాపిల్ ముక్కలను వేపి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. అంతే! కలబంద జ్యూస్ రెడీ!! ఈ విధంగా తయారుచేసుకున్న జ్యూస్ ను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Mental Health: ‘తులసి’ గురించి ఈ ఆసకక్తికర విషయాలు తెలుసా?! -
జిడ్డును ఓడించేద్దాం...
బ్యూటిప్స్ జిడ్డు చర్మానికి... వేసవి కష్టకాలం. ఎండ తీవ్రతకు చర్మంలోని నూనె గ్రంథులు మరింతగా స్రవిస్తాయి. ఆ జిడ్డు మీద దుమ్మూధూళి, కాలుష్య రేణువులు చేరినప్పుడు చర్మం ఇరిటేషన్‌కు గురవుతుంది. గుల్లలు, మచ్చలు వస్తాయి. ఈ కష్టాలను తప్పించడానికి ఇంట్లోనే చేసుకోగలిగిన బ్యూటీ ట్రీట్మెంట్లు కొన్ని. టొమాటో ప్యాక్... టొమాటోను చిదిమి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. వంట కోసం వాడేటప్పుడు చిన్న ముక్కను తీసుకుని ముఖానికి రుద్దుకోవచ్చు. కొంతమందికి టొమాటో సరిపడదు, స్కిన్‌కు ఇరిటేషన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను స్కిన్ తొలగించి గుజ్జును చిదిమి ముఖానికి రాసుకోవచ్చు. హనీ–కార్న్ మాస్క్... ఒక పచ్చిబంగాళదుంప, ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోవాలి. బంగాళదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసానికి తేనె, కార్న్‌ఫ్లోర్ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ వేయాలి. ఇది ఆరే కొద్దీ స్కిన్‌ను టైట్ చేస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్‌ను కడిగేయాలి. కడిగిన వెంటనే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆయిలీ స్కిన్‌కు మాత్రమే. సెన్సిటివ్ చర్మానికి, పొడి చర్మానికి ఈ ప్యాక్ వేస్తే మరీ పొడిబారే అవకాశముంది. కాబట్టి ఈ రెండు రకాల చర్మానికి కార్న్‌ఫ్లోర్‌ను మినహాయించి ప్యాక్ వేసుకోవచ్చు. క్యారట్ ఫేస్ మాస్క్... ఎర్రని క్యారట్‌ను గ్రైండ్ చేసి రసం తీసుకుని అందులో నాలుగైదు చుక్కల బాదం నూనె కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత వేడి నీటితో కడగాలి. ఇలా రోజుకొకసారి నెలరోజుల పాటు ప్యాక్ వేస్తే ముఖం మీద ఉన్న ట్యాన్తో పాటు ఇతర మచ్చలు పోయి ముఖవర్చస్సు పెరుగుతుంది. -
అందం కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా
ముంబై: మనిషికి అందం చాలా ముఖ్యమైన ఈ రోజుల్లో నటి జెనీలియా అందం ఆవిరై పోయిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఒకప్పటి దక్షిణాది కలల రాణి ఈ అమ్మడు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయికగా వెలుగొందారు. కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. ఒక బిడ్డకు తల్లి కూడా అయిన జెనీలియా మళ్లీ నటించడానికి రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దాన్ని బలపరచేలా ఇప్పుడీ ముద్దుగుమ్మ అందం పెంచుకునే అంశంపై శ్రద్ధ పెట్టారు. అందుకోసం కొత్త ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారట. ఈ విషయాన్ని జెనీలియా తెలుపుతూ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత తన శరీర చాయ బాగా నల్లబడిపోయిందన్నారు. ముఖమంతా ప్యాచ్ ప్యాచ్‌గా మారిపోయిందన్నారు. నిజం చెప్పాలంటే తన ముఖాన్ని తానే అద్దంలో చూసుకోవడం మానేశానన్నారు. అంతేకాదు తాను వయసుకు మించి కనిపించడంతో ఆలోచించి మళ్లీ యవ్వనంగా కనిపించడానికి ఆధునిక ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు జెనీలియా.