became
-
ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావచ్చు
-ఇస్రో మాజీ డైరెక్టర్ సుందరమూర్తి కాకినాడ: మేధస్సుకు పదునుపెడితే ప్రతి విద్యార్థీ శాస్త్రవేత్త కావచ్చని ఇస్రో మాజీ డైరెక్టర్ టి.కె.సుందరమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్‌హాలులో నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహాల తయారీపై ఆసక్తి కల్పించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉపగ్రహాలను రోదసిలోకి పంపే విధానాన్ని స్లైడ్స్ ద్వారా వివరించారు. వీటివల్ల వర్షాభావ పరిస్థితులు, తుపాన్ల బారిన పడే ప్రాంతాలను సులభంగా తెలుసుకోవచ్చునన్నారు. ఉపగ్రహ సమాచారం మానవాళి ఆర్థికాభివృద్ధికి, ప్రాణరక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కమిషనర్ ఆలీమ్‌భాషా మాట్లాడుతూ భవిష్యత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. యువశాస్త్రవేత్త సౌరభ్ కౌశల్ మాట్లాడుతూ విద్యార్థులు ఆవిష్కరణలపై మక్కువ చూపిస్తే దేశం త్వరితగతిన సూపర్‌పవర్‌గా ఎదగగలదన్నారు. ఆస్ట్రేలియా శాస్త్రవేత్త షాన్మోజ్ అంగారక గ్రహ యాత్రపై జరుగుతున్న పరిశోధనలను వివరించారు. నాసా ప్రతినిధి దీపికా దౌలూరి శాస్త్రవేత్తలను పరిచయం చేశారు. డీఆర్డీవో మాజీ శాస్త్రవేత్త అందె మురళి మిసైల్స్ తయారీని వివరించారు. యువశాస్త్రవేత్త కె.ఎన్.రావు దేశ పురోభివృద్ధికి పాటుపడతామని ప్రమాణం చేయించారు. శాస్త్రవేత్తలు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. వ్యాలీస్ మెరినరీస్ ఇంటర్నేషనల్ సంస్థ సీఈవో జయకుమార్, కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.రమేష్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ జి.సన్యాసిరావు, మేనేజర్ కె.సత్యనారాయణ, స్టేట్‌బ్యాంక్ అధికారి డి.రాంబాబు, లయన్స్‌క్లబ్ మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ, స్కూల్స్ సూపర్వైజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి రాజధాని ఏ నగరమో తెలుసా?
వేల ఏళ్ళ చరిత్రకలిగిన.. సంస్కృతికి సాక్షీభూతమైన ప్రాంతం.. భారత్ లోని నాసిక్ పట్టణం. హిందూ తీర్థ క్షేత్రాలకు, దేవాలయాలకు ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతం ఇప్పుడు వైన్ రాజధానిగానూ వెలుగొందుతోంది. మహరాష్ట్ర లోని జిల్లా కేంద్రమైన నాసిక్ లో సూలా ద్రాక్షతోటలు, వైన్ పరిశ్రమలతోపాటు మరికొన్ని ప్రధాన వ్యాపారాలు అభివృద్ధి చెందడంతో అక్కడ కొత్త ఒరవడిని తెచ్చింది. దీంతో నాసిక్ వైన్ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. లిక్కర్ అమ్మకాల నిషేధంలో గుజరాత్ మహరాష్ట్రలు ప్రత్యేక చట్టాలను కలిగి ఉన్నాయి. ఇటీవల కేరళ కూడ ఈ జాబితాలో చేరే ప్రయత్నంలో ఉంది. అయితే ఇప్పటిదాకా కుంభ మేళాకు ప్రసిద్ధి చెందిన మహరాష్ట్రలోని నాసిక్ ను తీర్థక్షేత్రంగానే భావించిన పర్యాటకులు.. క్రమంగా వైనరీ కేంద్రంగాను గుర్తిస్తున్నారు. దీంతో వైన్ టూరిజానికీ నాసిక్ ప్రధాన కేంద్రంగా మారిపోయింది. సుమారు 50 వైన్ ఉత్పత్తి కేంద్రాలు నాసిక్ చుట్టుపక్కల వెలిశాయి. వాటిలోని కొన్నికేంద్రాల్లో వైన్ టేస్టింగ్ రూమ్ లను కూడ ఏర్పాటు చేశారు. వారాంతాల్లోనూ, విరామ సమయాల్లోనూ వచ్చే విధేశీ పర్యాటకులకోసం ఈ కొత్త సంస్కృతి అందుబాటులోకి వచ్చింది. ఇది స్థానికులను సైతం ఆకట్టుకుంటోంది. అంతేకాక స్థానిక చట్టాన్ని సడలించాల్సిన స్థాయికి కూడ చేరేట్టు కనిపిస్తోంది. నాసిక్ లో వైన్ పరిశ్రమ.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తున్నా... ఇప్పటికే అంతర్జాతీయ గౌరవాన్ని దక్కించుకుంది. 'సూలా' సావినన్ బ్లాంక్, 'వల్లోన్' మాల్బెక్ డికాంటర్లు ప్రపంచ వైన్ అవార్డులను, పురస్కారాలను పొందాయి. వైన్ పరిమితంగా తీసుకోవడవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయన్నది పూర్వకాలంనుంచీ తెలిసిన విషయమే. ద్రాక్షరసంతో తయారయ్యే వైన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగ పడుతుంది. గుండె, ఎముకలను ధృఢపరచడమే కాక మధుమేహం, రక్తపోటు, కాన్సర్ వంటి కొన్ని రకాల రోగాలను కూడ రాకుండా చేస్తుంది. అందుకే వైన్ పరిశ్రమలకు కేంద్రమైన నాసిక్ ఇప్పుడు భారత వైన్ రాజధానిగా మారిపోయింది.