హార్వడ్ యూనివర్శిటీలో పవన్ ప్రసంగం
ఐదు రోజుల పర్యటన కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అమెరికా చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన బోస్టన్ చేరుకున్నట్లు పార్టీ మీడియా హెడ్ తెలిపారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు చెప్పారు.
ఈ నెల 11వ తేదీన హార్వడ్ విశ్వవిద్యాలయంలో 'బికమింగ్ జనసేనాని' అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించారు. పర్యటనలో చివరి రోజైన 12వ తేదీన కూడా హార్వడ్ యూనివర్శిటీలో కీ నోట్‌ను ప్రసంగిస్తారని తెలిపారు.