Beijing Games
-
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా పంజా
Beijing Winter Olympics 2022: బీజింగ్ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. తాజాగా 45 కొత్త కేసులు నమోదైనట్లు ఒలింపిక్ నిర్వాహక కమిటీ శనివారం ప్రకటించింది. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, మిగతా వారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారు. ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు, సహాయ సిబ్బంది కలుపుకుని దాదాపు 12 వేల మంది బీజింగ్‌లో అడుగుపెట్టగా.. వీరిలో 353 మంది మహమ్మారి బారిన పడినట్లు నిర్వాహకులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, భారత్ నుంచి ఒకే ఒక అథ్లెట్ బీజింగ్ ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్.. స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. చదవండి: 'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం' -
బీజింగ్ గేమ్స్ తర్వాత వైదొలగమన్నారు: సుశీల్
న్యూఢిల్లీ: భారత్ నుంచి వరుసగా రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రెజ్లర్ సుశీల్ కుమార్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారిగా తను 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన అనంతరం కెరీర్ నుంచి తప్పుకోవాలని కొంతమంది సలహాలిచ్చారని తెలిపాడు. ‘మై ఒలింపిక్ జర్నీ’ అనే పుస్తకంలో సుశీల్ ఈ విషయాన్ని తెలిపాడు. అయితే ఈ పతకం తన కెరీర్‌కు ఆరంభంగానే భావించానని అన్నాడు. ‘బీజింగ్ గేమ్స్ అనంతరం నేను స్వదేశానికి రాగానే నా శ్రేయోభిలాషులు ఇక కెరీర్‌కు ముగింపు పలికితే బావుంటుందని చెప్పారు. నాకు కూడా ఆ సమయంలో ఏమీ అర్థం కాలేదు. అయితే ఇన్నేళ్ల కాలంలో ఒలింపిక్ విజేతకు గల అర్థమేమిటో తెలిసింది. ఆ పత కం సాధించిన అనంతరం రెజ్లింగ్‌పై మరింత అవగాహన పెంచుకున్నాను. అందుకే అది ఆరంభమే కానీ ముగింపు కాదని భావించాను’ అని సుశీల్ పేర్కొన్నాడు.