Beijing hotel
-
రూ. 5 కోట్లు కావాలన్నాడు.. ఆఖరికి జైలుకెళ్లాడు
బీజింగ్ : హోటల్‌కెళ్లి సుష్టుగా భోంచేయడం.. ఆపై బిల్లు ఎగ్గొట్టడం కోసం ప్లేట్లో వెంట్రుకలు, బొద్దింకలు లాంటివి వేయడం చాలా సినిమాల్లో చూశాం కదా. ఇదే ట్రిక్కు ప్రయోగించబోయి.. ఆఖరుకి జైలు పాలయ్యడో వ్యక్తి. బిల్లు ఎగ్గొట్టడం కోసం ఏకంగా భోజనంలో చచ్చిన ఎలుకను వేశాడు. ఆ తర్వాత ఏమైంది... చదవండి. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదిలావో అనేది చైనాలో చాలా ఫేమస్ రెస్టారెంట్. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ వ్యక్తి సదరు రెస్టారెంట్లో ఉచితంగా భోజనం చేయాలని భావించాడు. ఎలా అని ఆలోచిస్తుండగా రోడ్డు పక్కన ఓ చచ్చిన ఎలుక కనిపించింది. దాంతో అతడి బుర్రలోకి ఓ ఆలోచన వచ్చింది. ఆ ఎలుకను తీసుకుని రెస్టారెంట్‌కు వెళ్లాడు. భోజనం ఆర్డర్ చేశాడు. తినడం పూర్తయిన తరువాత తనతో పాటు తీసుకువచ్చిన ఎలుకను ప్లేట్లో వేశాడు. ఆ తర్వాత తనకు భోజనంలో ఎలుక వచ్చిందని చెప్పి నానా హంగామా సృష్టించాడు. ఈ విషయం బయటకు తెలిస్తే రెస్టారెంట్‌కున్న పేరు పొతుందని భావించిన యాజమాన్యం.. సదరు వ్యక్తి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. కానీ అందుకతడు ఒప్పుకోలేదు. దాంతో ఓ రెండు లక్షల రూపాయలు ఇస్తామంది. ఆ వ్యక్తి దాన్ని కూడా తిరస్కరించి.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశాడు. ఈ వివాదం ఎటు తేలకపోవడంతో.. సదరు రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభంచడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉచితంగా భోజనం చేయాలని భావించి.. చచ్చిన ఎలుకను తెచ్చి ఈ నాటకం ఆడానని.. కానీ చివర్లో అత్యాశకు పోవడంతో దొరికిపోయానని విచారం వ్యక్తం చేశాడు. పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. -
గ్యాంగ్ రేప్: ఆర్మీ ఉన్నతాధికారి కొడుక్కి జైలుశిక్ష
బీజింగ్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనలో చైనా ఆర్మీ ఉన్నతాధికారి పుత్రరత్నం లీ తియానీ ప్రమేయం ఉందని స్థానిక కోర్టు నిర్థారించింది. ఈ నేపథ్యంలో లీ తియానికి 10 ఏళ్ల జైలు శిక్షను బీజింగ్ మున్సిపల్ నంబర్ వన్ ఇంటర్మీడియట్ కోర్టు ఖరారు చేసింది. ఈ మేరకు స్థానిక మీడియా బుధవారం కథనాన్ని ప్రచురించింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దేశంలోని బడబాబులు పుత్రరత్నాలకు ఆ ఘటనతో సంబంధం ఉందని విపక్షాలతోపాటు దేశ ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. అందులోభాగంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో సామూహిక అత్యాచారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే అత్యాచారం ఘటనతో తన కుమారుడికి ఎటువంటి సంబంధంలేదని లీ తాయాని తండ్రి మేజర్ జనరల్ లీ షుయన్జియాంగ్ కోర్టుకు విన్నవించారు. లీ షుయన్జియాంగ్ చైనా ఆర్మీలో అత్యున్నత అధికారిగా పని చేస్తున్నారు. ఆమె భార్య, లీ తాయాని తల్లీ కూడా ఆర్మీలో గాయకురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఆ యువకులకు... గ్యాంగ్‌రేప్‌తో సంబంధం లేదు!
బీజింగ్‌లోని హోటల్లో ఓ మహిళపై సామూహిక అత్యాచార ఘటనతో ప్రముఖ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కు చెందిన మేజర్ జనరల్ జెన్లీ షౌజియాంగ్ కుమారుడు లీ తియానికి ఎటువంటి సంబంధం లేదని డిపెన్స్ న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలిపారు. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన శిక్ష పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ శిక్షను వెంటనే రద్దు చేయాలని డిఫెన్స్ న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. సామూహిక అత్యాచార కేసులో శిక్ష పడిన ఇద్దరు యువకులు అమాయకులని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. బీజింగ్‌లో నెంబర్1 ఇంటర్మీడియట్ కోర్టులో సామూహిక అత్యాచార కేసుపై మంగళవారం రెండవ సారి విచారణ జరిగింది. ఈ సందర్బంగా లీ తియానిక తరుఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను పైవిధంగా వినిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనా రాజధాని బీజింగ్‌లోని ప్రముఖ హోటల్లో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఆ ఘటన చైనాను అతలాకుతలం చేశాయి. ఆ దుశ్చర్యకు బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి, శిక్ష విధించాలని చైనీయులు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు. ఆ కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో షౌజియాంగ్ కుమారుడు లి తియాని, మరో యువకుడు నిందితులని పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలో సెప్టెంబర్ 26న బీజింగ్ హైడియన్ జిల్లా కోర్టు లి తియానికి 10 ఏళ్ల, మరో యువకుడికి 12 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దాంతో తమకు న్యాయం చేయాలని బాధితులు ఎగువ కోర్టును ఆశ్రయించారు. అయితే చైనా ఆర్మీ అనుబంధ సంస్థ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌లో లి తియాని తండ్రి షౌజియాంగ్ ఉన్నతాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.