ఈ ఫొటోలో దెయ్యం ఎక్కడ ఉంది?
సమ్‌థింగ్ స్పెషల్
ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటో 1900 సంవత్సరంలోనిది. ఐర్లాండ్‌లోని బెల్ఫాస్ట్ నగరంలో ఒక మిల్లులో పనిచేసే యువతులందరూ కలిసి దిగిన ఫొటో ఇది. అది సరే, మరి ఈ దెయ్యం గోల ఏమిటి? విషయం ఏమిటంటే, ‘దెయ్యాలు ఉన్నాయి’, ‘లేనే లేవు’ అనుకునే వాళ్లు ఈ ఫొటోను చూస్తూ రెండు వర్గాలుగా చీలిపోయారు. ఎవరి వాదనలు వారు గట్టిగా వినిపిస్తున్నారు. గోల ఎక్కడ మొదలైందంటే... మూడో వరుసలో చివరన కూర్చున్న అమ్మాయి భుజం మీద చెయ్యి కనిపిస్తుంది. వ్యక్తి మాత్రం కనిపించరు. ఇది చాలదా దెయ్యం ఉందని చెప్పుకోవడానికని ఒక వర్గం, ఫొటో ట్రిక్ అని మరో వర్గం హీట్ హీట్‌గా వాదులాడుకుంటున్నాయి!