శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు మంగళవారం ఓ భక్తుడు రూ. లక్ష విరాళంగా అందజేశారు. ఏలూరుకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు జమ్మా రామకృష్ణ తన తల్లిదండ్రులు గంగరాజు, గంగామహాలక్ష్మి పేరున విరాళం అందజేశారు. ఆలయ అధికారులు దాతను అభినందించి విరాళం బాండ్ అందజేశారు.