చినవెంకన్న ఆలయానికి 101 ఎల్ఈడీ బల్బుల బహూకరణ
ద్వారకాతిరుమల : చినవెంకన్న ఆలయానికి ఒక దాత 101 చైనా ఎల్ఈడీ బల్బులను దేవస్థానానికి అందజేశారు. గుడివాడకు చెందిన ఎన్.మీనాకుమారి, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణితో కలసి వచ్చి ఈ ల్యాంప్స్‌ను దేవస్థానం ఛైర్మన్ సుధాకరరావుకు అందించారు. ఈ సందర్భంగా సుధాకరరావు మాట్లాడుతూ చైనాలో వ్యాపారం చేస్తున్న మీనాకుమారి అందించిన ఈ ల్యాంప్‌ల విలువ రూ. 2,12,100 అని చెప్పారు. మాలతీరాణి మాట్లాడుతూ చినవెంకన్న ఆలయానికి అశ్వాలు (గుర్రాలు) కూడా ఉంటే బాగుంటుందని, తాను బహుమతిగా ఒక అశ్వాన్ని అందజేస్తానని అన్నారు. నివతరావు, ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, రిటైర్డ్ ఈవో వీవీఎస్ఎన్.మూర్తి, ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు వెంపరాల నారాయణమూర్తి, ఉంగుటూరు మండలం బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శోభారాణి పాల్గొన్నారు.