belt shoap
-
బెల్ట్ షాపుపై మహిళల దాడి
-
బెల్ట్ షాపుపై మహిళల దాడి
విశాఖపట్నం: తమ సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు మహిళలు ముందుకొచ్చారు. బెల్ట్ షాపు పై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. విశాఖ జిల్లా మధురవాడలో ఆదివారం ఉదయం మహిళలు పెద్ద ఎత్తున బెల్ట్‌షాపు వద్దకు చేరుకొని మద్యం విక్రయించొద్దని ఆందోళన చేపట్టారు. దీనికి షాపు యజమాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.