Bengal CM Mamata Banerjee
-
చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ గుట్టు విప్పిన మమతా బెనర్జీ
సాక్షి, అమరావతి: ప్రశాంత్‌కిశోర్‌పై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను బయటపెట్టారు. ప్రశాంత్ కిశోర్ కేవలం చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని, క్షేత్ర స్థాయిలో ఎలాంటి పని చేయకున్నా.. చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, బీజేపీని గెలిపించేందుకు ప్రశాంత్‌కిశోర్ తెర వెనక పనిచేస్తున్నారని.. దీనిపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. ప్రశాంత్‌కిశోర్‌కు ఇతరత్రా ఏవో సమస్యలున్నాయన్నారు. "బెంగాల్లో ప్రశాంత్ కిశోర్ టీఎంసీ కోసం పనిచేయడం లేదన్నారు" మమతా. ప్రశాంత్ కిశోర్ తక్షణ కర్తవ్యం చంద్రబాబు, మోదీనేనని తెలిపారు. డామిట్ కథ అడ్డం తిరిగింది పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల తర్వాత ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనని భీషణ ప్రతిజ్ఞ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఐప్యాక్ సంస్థ నుంచి తప్పుకుని.. బీహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశాడు పీకే. తొలుత బీహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి, జేడీ(యూ) నేతగా చలామణి అయ్యారు. ఆ తర్వాత నితీశ్‌తో విభేదించి.. సొంత కుంపటి పెట్టుకుని బీహార్‌లో పాదయాత్ర చేశారు. అయినప్పటికీ బీహార్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అంటే.. అక్కడ చెల్లని కాసుగా ముద్రపడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది ఆఖర్లో తెలంగాణ, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ జోస్యాలన్నీ తప్పాయి. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ప్రశాంత్ కిశోర్ కుండబద్ధలు కొడితే.. అక్కడ తేడా కొట్టింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే.. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలిచింది. వివాదాల పీకే సర్వే సంస్థలు, రాజకీయ పార్టీలకు సలహాలతో అప్పట్లో పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్.. ఎంత వేగంగా ఎదిగాడో.. అంతే వేగంగా నేలకు దిగివచ్చాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న సంబంధాలన్ని తెగిపోవడంతో తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుడు కావాలనుకున్న కల కాస్తా చెదిరిపోయింది. ఈ నేపథ్యంలో భారీగా డబ్బులకు ఆశపడి పొలిటికల్ బ్రోకర్‌గా మారాడన్న ఆరోపణలు ఢిల్లీలో వెల్లువెత్తాయి. కరకట్ట ఇంట్లో ప్యాకేజీ చర్చలు ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. చంద్రబాబు విసిరిన ప్యాకేజీకి పీకే పడిపోయాడని తెలుగుదేశంలో ప్రచారం ఉంది. ప్రత్యేక విమానంలో ప్రశాంత్ కిషోర్‌ను విజయవాడకు తీసుకువచ్చిన లోకేష్.. నేరుగా కరకట్ట ఇంట్లో మీటింగ్ పెట్టించాడు. ఆ సమావేశంలో ఏం జరిగిందో కానీ.. ఏపీలో కూటమి గెలుస్తుందంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు పీకే. తన వ్యాఖ్యలకు ఎలాంటి సాంకేతిక ఆధారాలను కానీ, లాజిక్ గానీ చూపించకుండా.. తన పాత బ్రాండ్‌ను వాడుకుని ప్రచారం చేసుకునే పనిలో పడ్డాడు. అయితే విశ్వసనీయత కోల్పోవడంతో పీకే మాటలు ఎవరూ పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. "నోటు" మాటలు ప్యాకేజీ ఎంత ముట్టిందో గానీ, బాకా ఊదడంలో పీకే ముందుంటున్నాడు. ఎలాంటి సర్వేలు చేయకుండా, గణాంకాల్లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పడం కచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రోజురోజుకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటం, టీడీపీ ఓటమి ఖాయమని తేలడంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ అసలు రంగును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బయటపెట్టడం.. పీకే వ్యాఖ్యల డొల్లతనం బయటపడ్డట్టయింది. -
‘మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి’.. బీజేపీకి దీదీ సవాల్
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని పశ్చిమ బంగాల్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి. ఈ క్రమంలో మీకు చేతనైతే నన్ను అరెస్ట్ చేయండి అంటూ బీజేపీకి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పశువులు స్మగ్లింగ్, స్కూల్ జాబ్స్ స్కామ్ కేసుల్లో టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, అనుబాత్రా మోండల్ అరెస్టుల నేపథ్యంలో ఈ వ్యాఖ్యల చేశారు. కోల్‌కతాలో టీఎంసీ విద్యార్థి విభాగం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు మమతా బెనర్జీ. కోల్‌కతా మేయర్, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకిమ్, పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీలు సహా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని విమర్శించారు. ‘ప్రతి ఒక్కరు దొంగలేనని బీజేపీ ముద్ర వేస్తోంది. టీఎంసీలోని వారంతా దొంగలు, కేవలం బీజేపీ, తమ నేతలు మంచి వారుగా కాషాయ పార్టీ ప్రచారం చేస్తోంది. నేను రాజకీయంలో లేకపోయుంటే.. వారి నాలుకలను తెగ్గోసే దానిని. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోంది. అలాగే, అక్రమంగా సాధించిన డబ్బుతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఉపయోగిస్తోంది. హకిమ్ త్వరలోనే అరెస్ట్ కానున్నారు. కేవలం వేధించేందుకే ఆయనపై తప్పుడు కేసులు పెడుతున్నారు.’ అని పేర్కొన్నారు మమతా బెనర్జీ. మహారాష్ట్ర విధంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు మమత. 2024లో జరిగే సాదారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. స్కూల్ జాబ్స్ కేసులో పార్థా ఛటర్జీని అరెస్ట్ చేసినప్పటికీ ఎలాంటి నేరాన్ని నిరూపించలేకపోయారని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్ -
పెగాసస్‌ను కొన్నది నాటి చంద్రబాబు ప్రభుత్వమే: బెంగాల్ సీఎం మమత
-
దీదీ చేతులు రక్తంతో తడిశాయి : నడ్డా
కోల్‌కతా: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడినాటి నుంచి కొనసాగుతున్న దాడులు, అల్లర్లు, రాజకీయ హింస నుంచి బెంగాల్‌ను, బెంగాల్ ప్రజలను కాపాడు తానని బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రతిజ్ఞ చేశారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బెంగాల్‌కు వచ్చిన నడ్డా బుధవారం కోల్‌కతా నడిబొడ్డున ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నాలో పాల్గొని ప్రసంగించారు. ‘నార్త్ 24 పరగణాల సహా పలు జిల్లాల్లో అమానుష దాడుల్లో చనిపోయిన బీజేపీ సభ్యుల కుటుంబాలను కలుస్తా. ఇక్కడి దారుణ ఘటనల వివరాలను మొత్తం భారతావనికి తెలియజేస్తా. బెంగాల్ ప్రజలకు బీజేపీ సేవా కార్యక్రమాలు ఇకపైనా కొనసాగుతాయి. హింస కారణంగా 14 మంది బీజేపీ కార్య కర్తలు, మద్దతుదారులు ప్రాణాలు కోల్పోయా రు. మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. అల్లర్ల కారణంగా దాదాపు లక్ష మంది స్థానికులు సొంతూర్లను వదిలేసిపోయారు. ఈ కుట్ర వెనుక ఆమె ప్రమేయం ఉందిగనుకే ఆమె నోరు మెదపకుండా ఉన్నారు. హింసను ప్రేరేపించిన మమత చేతులు రక్తంతో తడిశాయి. గత ఏడాది అంపన్ తుపాను కారణంగా గ్రామాల్లో విధ్వంసం చూశాం. నేడు మమత కారణంగా అదే విధ్వంసం పునరావృతమైంది. హింస కారణంగా బెంగాళీలు పొరుగున ఉన్న అస్సాంకు వలసవెళ్లారు’ అని నడ్డా వ్యాఖ్యానించారు. -
ఆధార్ కార్డు లింకు : సీఎం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంతో ఇన్నాళ్లూ రాజకీయ పోరాటం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇప్పుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. మొబైల్, సిమ్ కార్డుల కనెక్షన్లకు ఆధార్ కార్డు లింకును తప్పని సరిచేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ మేరకు మమత తరఫు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. సోమవారం (అక్టోబర్ 30న) ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్రం ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించిన దరిమిలా ఈ దావాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. ఆధార్ ఇవ్వను.. కనెక్షన్ రద్దు చేసుకోండి : ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆధార్ కార్డు వివరాలను టెలికాం కంపెనీలకు ఇవ్వబోన్న మమతా.. ‘అవసరమనుకుంటే నా మొబైల్ కనెక్షన్ రద్దు చేయండి’ అని గత వారం కేంద్రానికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా కేంద్రం ‘ఆధార్ లింకు’ ఆదేశాలు జారీ చేసిందని ఆమె మొదటి నుంచీ వాదిస్తున్నారు. మమత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. -
చొరబాట్లే ప్రచారాయుధం
అస్సాం ఎన్నికల ముఖచిత్రం ♦ బంగ్లా నుంచి చొరబాట్లను అడ్డుకుంటాం: బీజేపీ ♦ దిగువ అస్సాంలోని బెంగాలీ ముస్లింలపై కాంగ్రెస్ ఆశలు ♦ జంగల్మహల్లో తృణమూల్, లెఫ్ట్ కూటమి హోరాహోరీ సాక్షి, సెంట్రల్ డెస్క్: అస్సాం అసెంబ్లీ రెండోదశ, బెంగాల్ మొదటి దశ రెండో భాగం ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఏప్రిల్ 11న ఈ రెండు రాష్ట్రాల్లోను ఎన్నికలు జరగనున్నాయి. అస్సాంలో బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు హోరాహోరీ తలపడుతుండగా... బెంగాల్లో తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్-కాంగ్రెస్ కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. బంగ్లా చొరబాట్లు, బెంగాలీ ముస్లింల ఓటు బ్యాంకు అస్సాం భవితను తేల్చనున్నాయి. రెండో దశలో దిగువ, మధ్య అస్సాంలోని మొత్తం 61 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 523 మంది అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అక్రమ చొరబాట్లే ప్రధాన ప్రచారాస్త్రం రెండో దశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమ చొరబాట్లను ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రం చేసుకున్నాయి. అక్రమంగా అస్సాంలోకి వచ్చిన బంగ్లాదేశీయులను కాంగ్రెస్ కాపాడుతోందంటూ బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దిగువ, మధ్య అస్సాంలోని చాలా నియోజకవర్గాల్లో బెంగాలీ ముస్లింల ఓట్లు అధికం. కొన్నేళ్లుగా ఈ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలుగా ఉన్నాయి. ఈ సారి పరిస్థితి తిరగబడింది. మార్పు, అభివృద్ధి కాకుండా అక్రమ చొరబాట్లకు శాశ్వత పరిష్కారం కావాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. దాన్నే బీజేపీ ప్రచారాస్త్రం చేసుకుని కాంగ్రెస్ కోటల్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. తాము అధికారంలోకి వస్తే చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు, వారికి ఉద్యోగాలిచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రచారం చేసింది. అభివృద్ధి కోసం మార్పుకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేసింది. బొడో పీపుల్స్ ఫ్రంట్‌తో పొత్తుపెట్టుకున్న బీజేపీ బొడోలాండ్లోని మెజార్టీ సీట్లు గెల్చేందుకు ప్రయత్నించింది. చొరబాట్లకు పరిష్కారం చూపుతున్నామని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్‌ను(పౌరుల జాతీయ జాబితా) ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్న బీజేపీ విమర్శల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రాష్ట్రంలో బంగ్లాదేశీయులు లేరని, ఒక్క అక్రమణదారుడుఉన్నా తాను రాజీనామా చేస్తానంటూ సీఎం గొగొయ్ సవాలు విసిరారు. గత 15 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో శాంతిని నెలకొల్పామని ఆ పార్టీ ప్రచారం చేసుకుంది. బెంగాలీ ముస్లిం ఓట్లతో గట్టెక్కవచ్చని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. తృణమూల్- లెఫ్ట్ కూటమి హోరాహోరీ పశ్చిమబెంగాల్లో మొదటి దశ రెండో భాగంలో మొత్తం 31 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జంగల్‌మహల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 13 నియోజవర్గాలు, బంకూరాలో 9, బుర్ద్వాన్‌లో 9 స్థానాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. బీజేపీ తరఫున ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా పలు సభలో మాట్లాడారు. సీఎం మమత దాదాపు అన్ని నియోజకవర్గాల్ని చుట్టేశారు. చొరబాట్లను వాజ్‌పేయి అడ్డుకోలే కపోయారు: అమిత్ షా గువాహటి/కాండీ: బంగ్లా చొరబాట్ల సమస్యను మాజీ ప్రధాని వాజ్‌పేయి పరిష్కరించలేకపోయారని బీజేపీ చీఫ్ అమిత్ షా శనివారం గువాహటిలో అన్నారు. ఆనాడు బంగ్లాతో సరిహద్దు ఒప్పందం లేకపోవడంతో రక్షణ కంచె పూర్తి కాలేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. ప్రస్తుతం ఒప్పందం చేసుకోవడంతో అక్రమ చొరబాట్లను అడ్డుకుంటామన్నారు. జైల్లో పెట్టినా భారీ మెజార్టీతో గెలుస్తాం.. తృణమూల్ కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ అవినీతి పార్టీ అనడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ధైర్యముంటే తనను జైల్లో పెట్టాలని దీదీ సవాల్ విసిరారు. జైల్లో ఉన్నా ఎన్నికల్లో భారీ మెజార్టీతో సత్తా చాటుతామన్నారు.