సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంతో ఇన్నాళ్లూ రాజకీయ పోరాటం చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఇప్పుడు న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. మొబైల్, సిమ్ కార్డుల కనెక్షన్లకు ఆధార్ కార్డు లింకును తప్పని సరిచేస్తూ కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను ఆమె సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఈ మేరకు మమత తరఫు న్యాయవాదులు శుక్రవారం పిటిషన్‌ను దాఖలు చేశారు. సోమవారం (అక్టోబర్ 30న) ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. కేంద్రం ఉత్తర్వులపై కోర్టును ఆశ్రయించిన దరిమిలా ఈ దావాకు ఎనలేని ప్రాధాన్యం లభించింది.
ఆధార్ ఇవ్వను.. కనెక్షన్ రద్దు చేసుకోండి : ఎట్టిపరిస్థితుల్లోనూ తన ఆధార్ కార్డు వివరాలను టెలికాం కంపెనీలకు ఇవ్వబోన్న మమతా.. ‘అవసరమనుకుంటే నా మొబైల్ కనెక్షన్ రద్దు చేయండి’ అని గత వారం కేంద్రానికి సవాలు విసిరిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్ధంగా కేంద్రం ‘ఆధార్ లింకు’ ఆదేశాలు జారీ చేసిందని ఆమె మొదటి నుంచీ వాదిస్తున్నారు. మమత దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment