Berth
-
నిఖత్ ‘డబుల్’ ధమాకా
తన పంచ్ పవర్ ఎలా ఉంటుందో భారత మహిళా స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి చాటుకుంది. ఆసియా క్రీడల్లో తొలిసారి పాల్గొంటున్న ఈ తెలంగాణ బాక్సర్ 50 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకోవడంతోపాటు వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ కేవలం 53 సెకన్లలో రిఫరీ స్టాప్స్ కంటెస్ట్ (ఆర్ఎస్సీ) పద్ధతిలో విజయాన్ని అందుకుంది. హనన్ నాసర్ (జోర్డాన్)తో జరిగిన ఈ బౌట్లో నిఖత్ సంధించిన పంచ్‌లకు ఆమె ప్రత్యర్థి బెంబేలెత్తిపోయింది. దాంతో మూడు నిమిషాల నిడివి గల తొలి రౌండ్లో 53 సెకన్లు ముగియగానే రిఫరీ బౌట్‌ను నిలిపివేసి నిఖత్‌ను విజేతగా ప్రకటించారు. గత ఏడాది బర్మింగ్హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో.. 2022, 2023 ప్రపంచ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు గెలిచిన నిఖత్ ఆసియా క్రీడల పతకాన్ని కూడా ఖాయం చేసుకుంది. ‘క్వార్టర్ ఫైనల్లో గెలవడంతోపాటు తొలిసారి ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తదుపరి లక్ష్యం పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే’ అని 27 ఏళ్ల నిఖత్ వ్యాఖ్యానించింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో చుథామట్ రక్సత్ (థాయ్‌లాండ్)తో నిఖత్ తలపడుతుంది. మరోవైపు 57 కేజీల విభాగంలో పర్వీన్ క్వార్టర్ ఫైనల్ చేరగా.. పురుషుల 80 కేజీల విభాగంలో లక్ష్య చహర్ ఓడిపోయాడు. పరీ్వన్ 5–0తో జిచున్ జు (చైనా)పై నెగ్గగా... లక్ష్య చహర్ 1–4తో ఒముర్బెక్ (కిర్గిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. -
వచ్చేసారైనా భారత్ ఉంటుందా?
92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఏనాడూ భారత్ నేరుగా అర్హత సాధించలేకపోయింది. బ్రెజిల్ వేదికగా 1950లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం లభించినా పలు కారణాలతో వెళ్లలేకపోయింది. 1950 నుంచి 1970 వరకు భారత ఫుట్‌బాల్ జట్టు ఓ వెలుగు వెలిగింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో హైదరాబాద్ నుంచి ఏకంగా ఎనిమిది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌కే చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో రహీమ్ శిక్షణలో భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. 1963లో కోచ్ రహీమ్ క్యాన్సర్‌తో మృతి చెందడంతో భారత ఫుట్‌బాల్ కూడా వెనుకడుగులు వేయడం ప్రారంభించింది. కాలానుగుణంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వస్తున్న మార్పులకు తగ్గట్టు ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య అభివృద్ధి చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో ఫుట్‌బాల్‌కు క్రమక్రమంగా ఆదరణ తగ్గిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఆసియాలో నంబర్‌వన్‌గా ఉన్న జట్టు నేడు దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, నేపాల్ జట్లపై కూడా గెలవడానికి ఇబ్బంది పడుతోంది. 2022 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే వెను దిరిగింది. 2026 ప్రపంచకప్ కోసం ఆసియా నుంచి 8 లేదా 9 జట్లకు బెర్త్‌లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ తమ ప్రపంచకప్ కలను సాకారం చేసుకోవాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 106వ ర్యాంక్‌లో... ఆసియా లో 19వ స్థానంలో ఉంది. జపాన్, కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఖతర్, యూఏఈ, ఒమన్, ఉజ్బెకిస్తాన్, చైనా, బహ్రెయిన్, జోర్డాన్ లాంటి పటిష్ట జట్లను దాటుకొని భారత్ ప్రపంచకప్ బెర్త్ సాధించాలంటే అత్యద్భుతంగా ఆడాలి. భారత జట్టు మాజీ గోల్‌కీపర్ కల్యాణ్ చౌబే ఇటీవల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మాజీ ఫుట్‌బాలర్ అధ్యక్షతలోనైనా భారత ఫుట్‌బాల్ అభివృద్ధివైపు అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి. -
తేజస్విని ‘టోక్యో’ గురి
దోహా (ఖతర్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత మహిళా సీనియర్ స్టార్ షూటర్ తేజస్విని సావంత్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో 39 ఏళ్ల ఈ మహారాష్ట్ర షూటర్ 1171 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఫైనల్‌కు చేరిన ఎనిమిది మందిలో ఆరుగురు ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో అందుబాటులో ఉన్న రెండు బెర్త్‌లలో ఒకటి భారత్‌కు, మరోటి జపాన్ (షివోరి)కు లభించాయి. ఫైనల్లో తేజస్విని 435.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయింది. 2010లో 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్‌గా గుర్తింపు పొందిన తేజస్వినికి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కలేదు. ట్రయల్స్ లేకపోతే మాత్రం... ఆమె ఒలింపిక్ కల ఈసారి సాకారం అవుతుంది. ట్రయల్స్ నిర్వహిస్తే తేజస్విని అందులో నెగ్గాల్సి ఉంటుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకు భారత్ నుంచి 12 మంది షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. తేజస్విని, కాజల్, గాయత్రిలతో కూడిన భారత బృందానికి 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో కాంస్యం దక్కింది. పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో గుర్ప్రీత్ సింగ్ 586 పాయింట్లతో రజతం నెగ్గగా... గుర్ప్రీత్, యోగేశ్, ఆదర్శ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం గెలిచింది. -
బెర్త్ పదిలం
రెండేళ్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఎలాంటి రాయిల్టీ చెల్లించలేదు. ఇలాంటి సంస్థను ఎవరైనా ఏం చేస్తారు. తప్పించేస్తారు. మరో సంస్థకు ఇస్తారు. కానీ అదానీ సంస్థ తనకున్న రాజకీయ పలుకుబడితో పోర్టులో తనకున్న బెర్త్‌ను మళ్లీ చేజిక్కించుకుంది. త్వరలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : దేశంలోని బడా పారిశ్రామికవేత్త అదానీ గ్రూపు వైజాగ్ పోర్టులో తనకున్న బెర్త్‌ను చేజార్చుకోకుండా పదిలపర్చుకుంది. రెండేళ్లుగా బెర్త్ ఖాళీగానే ఉంచడంతో ఏటా కోట్ల ఆదాయం కోల్పోతుండడంతో ఎలాగైనా ఈ సంస్థను వదిలించుకొని మరో సంస్థకు బెర్త్‌ను కేటాయించాలని విశాఖ పోర్టు రంగం సిద్ధం చేసింది. అదానీ గ్రూపునకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి నోటీసులను వెనక్కి తీసుకునేలా విశాఖ పోర్టుపై ఒత్తిడి తీసుకొచ్చింది. తద్వారా విశాఖ పోర్టులో రెండేళ్లుగా మూతబడిన బొగ్గు టెర్మినల్‌ను తెరిపించుకునేందుకు మార్గం సుగమం చేసుకుంది. జూలై 1వ తేదీ నుంచి తిరిగి విశాఖ పోర్టు ద్వారా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రెండేళ్లు కార్యకలాపాలు నిలిపేసినా?a 2014 ఆగస్టు నాటికి రూ.323.18 కోట్ల వ్యయంతో తూర్పు క్వారీ–1 బెర్త్ నిర్మాణానికి 2011లో పోర్టుతో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. రూ.400 కోట్లతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను కూడా ఏర్పాటు చేసింది. బెర్త్ కోసం ఏటా రూ.3 కోట్లు, టెర్మినల్‌లో జరిగే కార్యక లాపాల ద్వారా టన్నుకు 40 శాతం రాయిల్టీ రూపంలో పోర్టుకు రెవెన్యూ చెల్లించాలన్నది ఒప్పందం. 2016 ఫిబ్రవరి వరకు ఈ బెర్త్ ద్వారా లోడింగ్, అన్లోడింగ్ కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ ఆ తర్వాత కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్లుగా పోర్టు ఆదాయానికి గండిపడింది. దీంతో అదానీ గ్రూపుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు పోర్టు సిద్ధమై నోటీసులు జారీ చేయడంతో ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో పోర్టు యాజమాన్యం కూడా దిగిరాక తప్పలేదు. విశాఖ పోర్టులో ప్రతిపాదించిన ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు రూ.20 లక్షలు చొప్పున జరిమానా విధించింది. కాగా 2015లో చేసుకున్న ఒప్పందం మేరకు బెర్త్ తిరిగి ప్రారంభించాలని అదానీ గ్రూపు నిర్ణయించింది. ఈ నిర్ణయం పోర్టు అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రాజెక్టు కోసం పొందిన రుణాల చెల్లింపు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలు పోర్టు ముందస్తు ఆమోదంతో హోల్డింగ్ కంపెనీకి బదిలీ చేయలేదు. ఏడాదికి నాలుగు మిలియన్ టన్నుల నిర్వహణకు అదానీ గ్రూపు ఒప్పందం చేసుకుంది. అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా 10 పోర్టుల్లో బెర్త్‌లను కలిగి ఉంది. ముంద్రా, హజీరా, దేహెజ్, కాండ్ల, ధీమ్, గోమా, మార్ముగోవాల వద్ద ఈ గ్రూపునకు టెర్మినల్స్ కలిగి ఉంది. తాజాగా ఒడిశాలోని పోర్టు ప్రాజెక్టు అభివృద్ధిని అప్పగించింది. ఏటా 4 మిలియన్ టన్నుల ఎగుమతి, దిగుమతులు చేపడతామని అదానీ గ్రూపు అంగీకరించిందని, దీంతో బెర్త్ పునరుద్ధరణకు ఆమోదం తెలిపినట్టుగా విశాఖ పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు చెప్పారు. -
నిద్రకు కోటా?!
సాక్షి, న్యూఢిల్లీ : ఇది నా బెర్తు.. నా ఇష్టం.. ఎన్ని గంటలైనా నిద్రపోతా.. అయినా అడిగేందుకు మీరెవరూ? అనే ప్రశ్నలు, మాటలు ఇక కదరదు. ఎందుకంటే.. రిజర్వేషన్‌కు, బెర్తులకు ఉన్నట్లే నిద్రకూడా కోటా విధించింది రైల్వేశాఖ. లోయర్, మిడిల్ బెర్తులు దక్కించుకున్న ప్రయాణికులు జర్నీలో అధిక సమయం నిద్ర పోతుండడం వల్ల పలు ఫిర్యాదులు రైల్వే శాఖకు అందాయి. మరీ ముఖ్యంగా పగటివేళలో కూడా ప్రయాణికులు బెర్తులు కిందకు దించి నిద్రించడం వల్ల ఆర్ఏసీ ప్రయాణికుల సీట్లు లభించడం లేదని కొంతకాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి పరిష్కారంగా రైల్వే శాఖ తాజా ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యురల్లో ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి.. ఉదయం 6 గంటల వరకూ బెర్తుల మీద నిద్రించేందుకు అవకాశం కల్పించింది. ఇతర ప్రయాణికుల నుంచి వ్యతిరేకత లేకపోతే .. రాత్రి 9 గంటలకే పడుకోవచ్చని అందులో రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే శాఖ తాజాగా జారీ చేసిన సర్క్యులర్ని ఇండియన్ రైల్వేస్ కమర్షియల్ మాన్యువల్ వాల్యుమ్ -1 లో 652వ పేరాలో చేరుస్తున్నట్లు రైల్వే బోర్డు సభ్యుడు, ప్యాసెంజర్ మార్కెటింగ్ డైరెక్టర్ విక్రమ్ సింగ్ ప్రకటించారు. -
పార్టీ బతకాలా ... పదవి ఇవ్వండి
తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు కొత్త పాఠం ఒంటబట్టించుకున్నారు. తమ పనులు చక్కబెట్టుకోవడానికి అధినేత చంద్రబాబుకు ఏ మంత్రం వేయాలో ప్రావీణ్యం సంపాదించారు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలంతా ఒకరి వెనుక ఒకరు టీఆర్ఎస్ బాట పట్టడంతో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు, మాజీలే మిగిలారు. తెలంగాణలో పార్టీని బతికించుకోవాలంటే తమకు అధికార పదవులు కావాల్సిందేనని కొత్త మెలిక పెడుతున్నారు. ఏపీలో అధికారంలో ఉండడంతో అక్కడ కూడా పదవులు కావాలనే అత్యాశకు పోతున్న నాయకులు కొందరు నేరుగా అధినేత ముందే కోరికల చిట్టా విప్పుతున్నారు. జాతీయ పార్టీ హోదా కొనసాగాలంటే తెలంగాణలో పార్టీ దుకాణం మూస్తే కుదరదన్న అవగాహనతో ఉన్న ఏపీ టీడీపీ పెద్దలు అవునన లేక, కాదనలేక మిన్నకుండి పోతున్నారు. ‘ఒక నాయకుడేమో ఏకంగా గవర్నర్ పదవి కోరుకుంటుంటే, మరో నాయకుడు రాజ్యసభ సభ్యత్వం కావాలంటుంటే, ఇంకో నేత టీటీడీ బోర్డు పదవి మాకివ్వరా అంటున్నారు. చివరకు ఏపీ ప్రభుత్వంలో ఒకటీ రెండు నామినేటెడ్ పదవులకూ గాలం వేస్తున్నారు. ఇదయ్యేదా.. పోయ్యేదా.. ఆశకు అంతుండక్కర్లేదా..’ అని పార్టీ నేత ఒకరు కుండబద్దలు కొట్టారు. వీరి గొంతెమ్మ కోర్కెలు వింటున్న పార్టీ అగ్రనేతలకు దిమ్మతిరిగి పోతోందట. మరంతే.. పదువుల్లేకుండా పార్టీని ఎలా కాపాడుతాం అంటూ కొత్త సూత్రీకరణ చేస్తున్నారట. పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులున్న వారే గోడదూకిన చేదు అనుభవాల నేపథ్యంలో .. ఎన్నికల్లో ఓడిపోయిన వీరి కోసం ఏపీ నేతలను త్యాగం చేయమంటారా? నిజంగానే తెలంగాణ తమ్ముళ్లకు పదవీ యోగం పడుతుందా... అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.. -
బెర్తు కోసం ఘర్షణ
చీరాల రైల్వే స్టేషన్లో రెండున్నర గంటలపాటు వాగ్వాదాలు, తోపులాటలు చీరాల: బెర్తు విషయంలో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గుంటూరు పట్టణానికి చెందిన సుశీల, లలితకుమారి తెనాలి నుంచి చెన్నై వెళ్లేందుకు అహ్మదాబాద్ - చెన్నై నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. వీరికి ఎస్-8 బోగీలో 61, 62 బెర్తులు కేటాయించారు. తెనాలిలో సుశీల సోదరుడు శవరం శ్రీనివాసరావు వీరిని రైలు ఎక్కించాడు. అప్పటికే వీరికి కేటాయించిన బెర్తుల్లో అహ్మదాబాద్‌కు చెందిన ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. వారితో మాట్లాడుతున్న శ్రీనివాసరావుతో అహ్మదాబాద్‌కు చెందిన మరో ప్రయాణికుడు కుమారన్ వచ్చి గొడవకు దిగాడు. అంతలోనే హిందీ ప్రయాణికుల బంధువులు శ్రీనివాసరావు, సుశీలపై దాడిచేశారు. బాధితులు చీరాల రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కుమరన్‌ను ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో చీరాల నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న రైలును అహ్మదాబాద్‌కు చెందిన ప్రయాణికులు స్వర్ణ గేటు ప్రాంతంలో చైను లాగి ఆపేశారు. తమవాడిని పోలీసులు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు.ఒక దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. చివరకు పోలీసులు ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమ అదుపులో ఉన్న ప్రయాణికుడిని వదిలివేసిన తర్వాత ఆందోళనకారులు శాంతించారు. -
తిరుపతమ్మ ఆలయ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళ్ల’ ఆరాటం
రేసులో 13మంది ! ప్రజాప్రతిధుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం రెండుగా చీలిన టీడీపీ నాయకులు? పెనుగంచిప్రోలు : రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ పాలకవర్గ చైర్మన్ పదవి కోసం ‘తెలుగు తమ్ముళు’్ల ఆరాట పడుతున్నారు. ఈ పదవిపై ఎప్పటి నుంచో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు కన్నేశారు. ఇప్పటి వరకు ఉన్న పాలకవర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. అనంతరం రెండు వారాల్లో ఆలయాలకు నూతన పాలవర్గాలను నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రకటించడంతో చైర్మన్ పదవి ఆశిస్తున్న స్థానిక నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన పదవి కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 13 మంది రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మరికొందరు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకరిద్దరు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఆశ్రయించినట్లు సమాచారం. చైర్మన్ పదవి రేసులో నీటి సంఘం మాజీ అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, పార్టీ గ్రామ అధ్యక్షుడు, ఇటీవలనే పార్టీలోకి వచ్చిన వారు ఉన్నారు. దీంతో చైర్మన్ పదవి విషయంలో గ్రామంలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద పదవి ఎవరికి లభిస్తుందనే విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
రైళ్లలో అదనపు బెర్త్‌లు
సాక్షి, సిటీబ్యూరో: ఏపీ ఎన్జీవోల నిరవధిక సమ్మె ప్రభావం రాకపోకలపై చూపనుంది. రాజధాని హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు రాకపోకలు సాగించే 1500కు పైగా బస్సులు మంగళవారం నుంచి నిలిచిపోనున్నాయి. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 13 నుంచి 20 వరకు 16 రైళ్లలో అదనపు బెర్త్ సౌకర్యాన్ని కల్పించారు. ఫలితంగా అదనపు ప్రయాణ సదుపాయం ఏర్పడుతుందని సీపీఆర్వో సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగించే పద్మావతి (12764/12763) ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 15,16,17,18,19 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్, తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఈనెల 13,16,17,18,19,20 తేదీల్లో ఒక స్లీపర్ క్లాస్ బోగీ అదనంగా అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12731/12732) బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 13,14 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,15 తేదీల్లో అదనపు స్లీపర్‌కోచ్‌లు ఉంటాయి. కాచిగూడ-యశ్వంత్‌పూర్-కాచిగూడ (17603/17604) మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్‌లో ఈ నెల 12,19, 13,120 తేదీల్లో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తారు. తిరుపతి-మచిలీపట్నం-తిరుపతి (17401/17402) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి మచిలీపట్నంకు ఈనెల 19న, తిరుగు ప్రయాణంలో 13,20 తేదీల్లో అదనపు స్లీపర్ క్లాస్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ (17256/17255) ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 13,19 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 14,20 తేదీల్లో అదనపు బెర్తులు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్ (17429/17430) రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు ఈ నెల 19న, తిరుగు ప్రయాణంలో ఈ నెల 13,20 తేదీల్లో అదనపు బోగీలు ఉంటాయి. సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ (12770/12769) సెవెన్‌హిల్స్ బై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వెళ్లేటప్పుడు 13,17 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో ఈ నెల 16,18 తేదీల్లో అదనపు బెర్తులు ఉంటాయి. తిరుపతి-కరీంనగర్-తిరుపతి (12761/12762) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి నుంచి కరీంనగర్‌కు ఈ నెల 16,18 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 15వ తేదీన ఒక స్లీపర్ క్లాస్ చొప్పున అందుబాటులోకి రానున్నాయి. రాకపోకలెలా? ఎన్జీఓల సమ్మె ప్రకటనతో చాలామంది ముందస్తుగా ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. మంగళవారం నుంచి బస్సుల రాకపోకలు పూర్తిగా స్తంభిస్తాయని ఆర్టీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీంతో విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, కర్నూలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఉభయగోదావరి ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించే వేల మంది ఇబ్బందులకు గురికానున్నారు. రోజూ 3500 బస్సులు రాష్ట్రవ్యాప్తంగా రాకపోకలు సాగిస్తాయి. లక్ష మందికి పైగా హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. అయితే, కొద్ది రోజులుగా సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్‌లు, ఆందోళనల నేపథ్యంలో రాజధాని నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్న సంగతి తెలిసిందే.