హాస్టల్ ‘బెస్ట్’.. వసతుల్లో వేస్ట్!
అస్తవ్యస్తంగా సెయింట్ జోసఫ్ హైస్కూల్ బెస్ట్ అవలెబుల్ హాస్టల్
అవస్థలు పడుతున్న పేద ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ హైస్కూల్(ఇంగ్లిష్ మీడియం)లోని బెస్ట్ అవలెబుల్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని నిరుపేదఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు ఇక్కడ చదువుతుంటారు. చదువుతో పాటు హాస్టల్ సదుపాయం సైతం స్కూల్ యాజమాన్యమే సమకూర్చాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఆయా శాఖల ద్వారా మెస్ చార్జీల కోసం ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.18 వేల నుంచి రూ.21 వేల చొప్పున పాఠశాలకు అందుతోంది. కాగా, నిధులు సక్రమంగా అందుతున్నా హాస్టల్ నిర్వహణ సక్రమంగా లేదు. దీనిపై విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదుచేసినా నిర్వాహకుల్లో మార్పు రాలేదు.
138 మంది విద్యార్థినులు, 132 మంది విద్యార్థులు
సంగారెడ్డి పట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్‌మీడియం హైస్కూల్లో బాలబాలికలకు హాస్టల్ వసతి కల్పిచడంతో పాటు పాఠశాలఅవకాశం ఉంది.స్కూల్లో 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 85 మంది ఎస్సీ, 138 మంది ఎస్టీ విద్యార్థినులుచదువుతున్నారు. వీరితో పాటు డేస్కాలర్స్ కూడా ఉన్నారు. కాగా, విద్యార్థులకు వసతి కల్పించడంలో యాజమాన్యం పూర్తి నిర్లక్ష్యాన్ని వహిస్తోంది.
బాలుర హాస్టల్ గదులతోపాటు మూత్రశాలలు, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. భవనానికి కనీసం డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. 132 మంది బాలుర విద్యార్థులకుకేవలం ఐదు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నీటి సరఫరాలేకపోవడంతో విద్యార్థులే బకెట్లలో నీరు తీసుకెళ్తున్నారు. ఇకబాలికల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
కుళ్లిన కూరగాయలు
బెస్ట్ అవలేబుల్ స్కూల్ అంటే కాన్వెంట్ స్కూల్అన్న పేరుకే తప్ప.. ఇక్కడ చీకటి గదులు, కూలేందుకు సిద్ధంగా ఉన్న బాత్రూమ్లు, కిటికీలు లేని గదులతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. విద్యార్థులకు వడ్డించే భోజనం సైతం అధ్వానంగా ఉంది. కుళ్లిన కూరగాయలతో వంట చేస్తున్నారు.
కలెక్టర్‌కు నివేదిస్తాం: వెంకటేశం, ఎంఈఓ
పట్టణంలోని సెయింట్ జోసెఫ్ బెస్ట్ అవలెబుల్ స్కూల్‌పై వచ్చిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకువిచారణ చేశాం. నివేదికలు కలెక్టర్‌కు అందిస్తాం.