Best employees
-
Yasmeen:అసలు పెళ్లి అవుతుందా అని హేళన.. దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్
Acid Attack Survivor Yasmeen Mansoori: ఎవరో మూర్ఖంగా చేసిన పనికి ముఖం కాలిపోయింది, కళ్లు తెరవలేని పరిస్థితి. అయినా జీవితం మీద ఆశలు వదులుకోలేదు. ఇరవై సర్జరీలు చేయించుకున్నా, ముఖం పూర్వస్థితికి రాలేదు. ఏ మాత్రం నిరాశపడకుండా కష్టపడి చదివి ఏకంగా ఎయిమ్స్‌లో నర్సింగ్ ఆఫీసర్ అయ్యింది యాస్మిన్ మన్సూరి. చిన్నపాటి కష్టాలను సాకులుగా చూపుతూ లక్ష్యం లేకుండా, నిర్లక్ష్యంగా బతుకుతోన్న ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది యాస్మిన్. అది 2004.. ఉత్తర్ ప్రదేశ్‌లో షామిలీ జిల్లాలో ఉంటోన్న యాస్మిన్ వాళ్ల కుటుంబం జీవనం ఎంతో ఆనందంగా సాగిపోతుంది. అప్పుడు యాస్మిన్‌కు పదహారేళ్లు. ఒకరోజు వారిమీద కిట్టని వాళ్లెవరో యాసిడ్ పోశారు. ఈ దుర్ఘటనలో యాస్మిన్ చర్మం మూడు పొరల లోతు వరకు కాలిపోయింది. కళ్లు తెరిచే పరిస్థితి లేదు. తనతోపాటు ఉన్న చెల్లి శరీరం కూడా కాలింది. మంచి వైద్యం తీసుకునేందుకు యూపీ నుంచి ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు వారిని. కొన్నాళ్లు కుటుంబం మొత్తం అక్కడే ఉంటూ మెరుగైన వైద్యం చేయించుకున్నారు. చికిత్స తర్వాత ఇంటికి వచ్చాక కూడా ఆసుపత్రికి వెళ్లక తప్పని పరిస్థితి వారిది. దీంతో రెండు వారాలకొకసారి ఢిల్లీ వెళ్లడం యాస్మిన్ జీవితంలో ఒక భాగమైంది. చికిత్సలో వాడే మందులు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించడంతో చాలా ఇబ్బందులకు గురైంది. ఈ అక్క చెల్లెళ్లను చూసిన వాళ్లు ‘‘ఈ పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వీరికి అసలు పెళ్లి అవుతుందా?’’ అని గుసగుసలాడుకునేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క గుండెల్లో గుచ్చుకునే మాటలు మానసికంగా బలహీన పరిచేవి. కొన్నాళ్లకు ఇలా కాదు. అయ్యిందేదో అయ్యింది. దానిని మార్చలేము కాబట్టి అలాగే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది యాస్మిన్. సేవలు నచ్చి... సఫ్దర్ జంగ్ తర్వాత చికిత్స కోసం ఎయిమ్స్‌కు వెళ్లింది యాస్మిన్. అక్కడ కొంతమంది నర్సులు రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు నచ్చడంతో తను కూడా నర్స్ అయ్యి సేవలందించాలనుకుంది. అనుకున్న వెంటనే దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్ చదువుతూనే, మరోపక్క కంప్యూటర్ కోర్సు చేసింది. ఆ తరువాత ఢిల్లీ యూనివర్సిటీలో బిఏలో చేరింది. ఒకపక్క బిఏ చేస్తూనే ‘జామియా హమ్దార్ద్ యూనివర్సిటీ’లో నర్సింగ్‌లో చేరింది. అయితే ఆర్ట్స్ సబ్జెక్ట్ చదవడం వల్ల నర్సింగ్ బాగా కష్టంగా అనిపించేది తనకు. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ నిరాశ పడకుండా తరువాతి ప్రయత్నంలో పాస్ అయ్యింది. ఉత్తమ ఉద్యోగిగా నర్సింగ్ అయిపోయిన వెంటనే 2014లో హకీమ్ అబ్దుల్ అహ్మద్ సెంటెనరీ ఆసుపత్రిలో ఉద్యోగం దొరికింది. ఇక్కడ రెండేళ్లు పనిచేసాక, మరో ఆసుపత్రిలో చేరింది. ఇక్కడ యాస్మిన్ సేవలకు గుర్తింపుగా ‘బెస్ట్ ఎంప్లాయీ అవార్డు’ వచ్చింది. ఒకపక్క ప్రైవేటు హాస్పిటల్స్‌లో చేస్తూనే మరోపక్క ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఇదే సమయంలో ఎయిమ్స్‌లో నర్సులు కావాలన్న ప్రకటన చూసి అప్లై చేసింది,. అర్హతలన్నీ ఉన్నప్పటికీ డిజెబిలిటీ నిబంధనలకు ఆమె సరిపోదని తిరస్కరించారు. దీంతో యాసిడ్ సర్వైవర్‌ను కూడా డిజెబిలిటీ విభాగంలో చేర్చాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ధర్మాసనం 2016లో డిజెబిలిటీ చట్టంలో కొన్ని సవరణలు చేసి యాసిడ్ సర్వైర్స్‌ను కూడా ఈ చట్టపరిధిలోకి చేర్చింది. దీంతో రెండేళ్ల తరువాత ఎయిమ్స్‌లో ఉద్యోగాన్ని పొంది, ‘‘దేశంలోనే తొలి యాసిడ్ సర్వైర్ నర్స్’’ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ రోగులకు మంచి సేవలందించడంతో ‘ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ పర్సన్’ విభాగంలో ‘బెస్ట్ ఎంప్లాయీ’ అవార్డును అందుకుంది. ‘‘ప్రస్తుతం దేశంలో ఎంతోమంది అమ్మాయిలు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. అమ్మాయిల జీవితంలో పెళ్లి అతిముఖ్యమైన అంశంగా చూస్తారు. అది సరికాదు. పెళ్లికి ముందు మనకెన్నో కలలు ఉంటాయి. వాటిని నిజం చేసుకుని ఆ తర్వాతే, జీవితంలో ముందుకు సాగాలి’’ అని యువతకు చెబుతోంది. -
ముంబైకు షాక్..సమ్మె చేపట్టిన ‘బెస్ట్’ ఉద్యోగులు
ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో దాదాపు మూడో వంతుకు పైగా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అతిపెద్ద కరోనా హాట్‌స్పాట్‌గా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లే, ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో యూనియన్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వైరస్‌తో ఇప్పటికే బెస్ట్ ఉద్యోగుల్లో ఎనిమిది మంది మృతి చెందగా 120 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం (మే 18) నుంచి బస్సులు నడపమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ముంబైలో కరోనా విజృంభిస్తున్న సమయంలో బెస్ట్ సంస్థ తీసుకున్న నిర్ణయం నగరానికి మరింత ప్రమదకరంగా మారనుంది. (లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు ) ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణాకు సంబంధించి కేవలం బెస్ట్ బస్సులు మాత్రమే పనిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సబర్బన్ రైళ్ల సేవలు నిలిపి వేసిన అనంతరం ముంబై అంతటా అత్యవసర సేవల ఉద్యోగుల కోసం బెస్ట్ బస్సులు ముఖ్యపాత్ర పోషించాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తమ సిబ్బందికి తగిన భద్రతా చర్యలు అందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచిన్నట్లు యూనియన్ అధినేత శశాంక్ రావు తెలిపారు. కార్మికులకు ప్రత్యేక క్వారంటైన్, ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కింద కోటి రూపాయలతోపాటు కుంటుంటంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. (లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే! ) కాగా ముంబైలో బెస్ట్ బస్సుల స్థానంలో కనీసం 1,200 మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 96,169కు చేరాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కరోనా కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. (ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు ) -
ఉత్తమ ఉద్యోగులు వీరే..
►158 మందిని ఎంపిక చేసిన జిల్లా అధికారులు ►మైనారిటీ శాఖకు మొండిచెయ్యి ►పోలీసుశాఖకు అత్యధికంగా 41 అవార్డులు ►ఖరారుకాని స్వచ్ఛంద సంస్థలు, కళాకారుల జాబితా సాక్షి, జగిత్యాల : జిల్లా ఉత్తమ ఉద్యోగులు ఖరారయ్యారు. జిల్లా మైనార్టీ శాఖను విస్మరించిన అధికారులు వివిధ శాఖల్లో పని చేస్తున్న 158 మంది ఉద్యోగులతో తుది జాబితా ఖరారు చేశారు. జిల్లా కేంద్రంలోని ఖిలాలో మంగళవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ వీరికి పురస్కారాలు, ప్రశంసాపత్రాలు ప్రదానం చేస్తారు. పోలీస్ శాఖ నుంచి అత్యధికంగా 41 మంది నిపురస్కారాలు వరించాయి. మెట్పల్లి సబ్ కలెక్టర్ ముషర్రఫ్అలీ, జిల్లా రెవెన్యూ అధికారి టి.శ్యాంప్రకాశ్, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్‌రాజు, ఇరిగేషన్ అధికారి నారాయణరెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి ఎం.రాజేందర్, పంచాయతీరాజ్ ఈఈ మనోహర్‌రెడ్డి, కోఆపరేటివ్ అధికారి ఎస్.రామానుజచారి, జిల్లా వైద్యాధికారి సుగంధిని, జిల్లా పౌరసంబంధాల అధికారి ముహ్మద్ గౌస్, కోరుట్ల మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి జిల్లా అధికారుల కోవలో ఎంపికయ్యారు. జిల్లా రెవెన్యూ శాఖ నుంచి 25 మంది, డీఆర్డీవో కార్యాలయం నుంచి పది మంది, పంచాయతీరాజ్ నుంచి ఎనిమిది మంది ఎంపికయ్యారు. పశుసంవర్ధకశాఖ, వైద్యారోగ్యం, ఎక్సైజ్, విద్యాశాఖల నుంచి ఐదుగురు, కలెక్టరేట్, రెసిడెన్షియల్ స్కూళ్లు, రవాణా, జిల్లా కోఆపరేటివ్, ధాన్యం కొనుగోలు, సేకరణ గ్రూపులకు మూడు చొప్పున అవార్డులు వరించాయి. కలెక్టరేట్, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, బీసీ వెల్ఫేర్, ఈఈ పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్ శాఖల నుంచి రెండు చొప్పున.. మిషన్ భగీరథ, ఆర్అండ్బీ, అగ్రికల్చర్, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, హౌసింగ్, సీఐడీ రీజినల్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు శాఖల నుంచి ఒక్కొక్కరిని అవార్డులకు ఎంపిక చేశారు. స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, కళాకారుల జాబితా సోమవారం రాత్రి 10:30 గంటల వరకు ప్రకటించలేదు. ఎన్జీవోలు, కళాకారులు తమకు పురస్కారాలు వస్తాయో రావోననే ఉత్కంఠ నెలకొంది. గణతంత్ర దినోత్సవం.. రాష్ట్రావతరణ వేడుకల్లోనూ జి ల్లా మైనార్టీ శాఖ కార్యాలయ ఉద్యోగులను వి స్మరించిన అధికారులు.. స్వాతంత్ర దినో త్స వ వేడుకల్లోనూ అదే తీరుగా వ్యవహరించడంతో మైనార్టీల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.