రికార్డు సృష్టించిన హెచ్సీయూ, జేఎన్యూ
న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా రాజకీయ వివాదాల్లో పడి నలిగిపోతున్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం రికార్డు సృష్టించాయి. రోహిత్ ఆత్మహత్య ఘటన జరిగినప్పటి నుంచి హెచ్సీయూ అట్టుడుకుతుండగా.. కన్హయ్య కుమార్ ఇతర విద్యార్థుల అరెస్టులు జరిగిన అనంతరం జేఎన్యూ ఆగ్రహ జ్వాలల్లో ఉండిపోయింది. కానీ, ఇంతటి ఘర్షణల మధ్య ఉండి కూడా ఇప్పుడు ఈ రెండు విశ్వవిద్యాలయాలు అందరితో ఔరా అనిపించాయి.
ఓ ప్రభుత్వ సంస్థ నిర్వహించిన సర్వేలలో ఈ రెండు వర్సిటీలే భారత దేశంలో ఉత్తమ వర్సిటీలుగా నిలిచాయి. పరిశోధన సౌకర్యాలు, విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చి దిద్దేందుకు అవసరమైన ఏర్పాట్లు, బోధన సామర్థ్యం, మౌలిక సదుపాయాలవంటి అంశాల్లో ఈ వర్సిటీలే ముందు వరుసలో ఉన్నట్లు సర్వే తేల్చింది. ఈ ఏడాది ప్రారంభంలోని జనవరి నుంచి ఈ రెండు విశ్వవిద్యాలయాలు పలు రాజకీయ కార్యక్రమాలకు నెలవులుగా మారిన విషయం తెలిసిందే.