'సాక్షి' ఫొటోగ్రాఫర్లకు బహుమతులు
ఆస్కార్ బర్నాక్ 137వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల సంఘం (ఎస్పిఏఏపీ) జాతీయస్థాయిలో నిర్వహించిన ఫొటో పోటీలలో సాక్షి ఫొటోగ్రాఫర్లకు పలు బహుమతులు వచ్చాయి. మొత్తం ఆరుగురు ఫొటోగ్రాఫర్లు వివిధ విభాగాల్లో బహుమతులు పొందారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి..
ఎస్పిఏఏపి అచీవ్మెంట్ అవార్డుల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఫొటోగ్రాఫర్ గరగ ప్రసాద్ తీసిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ మంటల ఫొటోకు, విజయవాడ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియెల్ తీసిన ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఫొటోకు, విజయవాడ ఫొటోగ్రాఫర్ తెలగారెడ్డి వీరభగవాన్ తీసిన మహిళల ఆగ్రహం ఫొటోకు బహుమతులు వచ్చాయి.
ఉత్తమ ఆర్ట్ అండ్ కల్చరల్ పెర్ఫార్మెన్స్ విభాగంలో తిరుపతి ఫొటోగ్రాఫర్ ఇరుగు సుబ్రహ్మణ్యం తీసిన రౌద్రం ఫొటోకు బహుమతి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల ఫొటోగ్రాఫర్లకు స్పెషల్ అచీవ్మెంట్ విభాగంలో విశాఖపట్నం ఫొటోగ్రాఫర్ నవాజ్ మహ్మద్ తీసిన పోలీసు కాళ్లు మొక్కుతున్న మహిళ ఫొటోకు, కర్నూలు ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ తీసిన పింఛను కోసం వృద్ధురాలి పాట్ల ఫొటోకు బహుమతులు వచ్చాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఫొటోగ్రాఫర్ గరగ ప్రసాద్ తీసిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ మంటల ఫొటో
విజయవాడ ఫొటోగ్రాఫర్ రూబెన్ బెసాలియెల్ తీసిన ఆస్పత్రిలో నిర్లక్ష్యం ఫొటో
విజయవాడ ఫొటోగ్రాఫర్ తెలగారెడ్డి వీరభగవాన్ తీసిన మహిళల ఆగ్రహం ఫొటో
తిరుపతి ఫొటోగ్రాఫర్ ఇరుగు సుబ్రహ్మణ్యం తీసిన రౌద్రం ఫొటో
విశాఖపట్నం ఫొటోగ్రాఫర్ నవాజ్ మహ్మద్ తీసిన పోలీసు కాళ్లు మొక్కుతున్న మహిళ ఫొటో
కర్నూలు ఫొటోగ్రాఫర్ డి.హుస్సేన్ తీసిన పింఛను కోసం వృద్ధురాలి పాట్ల ఫొటో