Beti bacavo Beti padavo scheme
-
బేటీ పడావోను తప్పుగా రాసిన కేంద్రమంత్రి.. కాంగ్రెస్ విమర్శలు
‘బేటీ బచావో, బేటీ పడావో’.. దేశంలో బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నినాదాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని 22 జనవరి 2015న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. భ్రూణహత్యలను తగ్గించి, బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు, ముఖ్యంగా చదువుల్లోనూ అమ్మాయిలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చారు.కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ నినాదాన్ని తాజాగా ఓ మహిళా కేంద్రమంతి సరిగా రాయలేకపోయారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఆమె మాతృ భాష ‘బేటీ బచావో, బేటీ పడావో’ నినాదా హిందీలో తప్పుగా రాశారు. మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో జరిగిన ‘స్కూల్ ఛలో అభియాన్’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.ये केंद्रीय महिला एवं बाल विकास राज्यमंत्री सावित्री ठाकुर हैं जिले में शिक्षा जागरूकता रथ पर उन्हें ‘बेटी बचाओ बेटी पढ़ाओ’ का स्लोगन लिखना था लेकिन, मंत्रीजी ने लिखा- "बेढी पडाओ बच्चाव" शपथ-पत्र के मुताबिक वे 12वीं पास हैं ये टीप उनके नहीं बल्कि देश के "शैक्षणिक स्तर" पर है pic.twitter.com/v66qM05Uyc— Anurag Dwary (@Anurag_Dwary) June 19, 2024అయితే జాతీయ స్థాయి నేత మాతృభాషలో ఈ పదాన్ని తప్పుగా రాయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చిన్న నినాదాన్ని కూడా మంత్రి సరిగా రాయలేకపోయారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పార్టీ సీనియర్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ..రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటూ పెద్ద శాఖలు చూస్తున్న వ్యక్తులకు తమ మాతృభాషలో సైతం సామర్థ్యం లేకపోవడం దురదృష్టకరం. వాళ్లు తమ శాఖలను సమర్థంగా ఎలా నిర్వహించగలరు?’ అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత నిబంధనను రాజ్యాంగం విధించాలని అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ విమర్శలను ధార్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఖండించారు.. మంత్రి తొందరపాటులో చేసిన తప్పును కాంగ్రెస్ పెద్దది చేసి చూపడం ఆ పార్టీ అల్పమైన ఆలోచనలకు, గిరిజన వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. ఆదివాసీ మహిళా ప్రతినిధి అని కూడా చూడకుండా కాంగ్రెస్ అనవసరపు రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.కాగా సావిత్రి ఠాకుర్.. మధ్యప్రదేశ్‌లోని ధార్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల మోదీ 3.0 కేబినెట్లో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. -
ప్రత్యూషతో స్వయంగా మాట్లాడతాం
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి శ్యామల, కన్నతండ్రి రమేశ్ కుమార్ చేతుల్లో తీవ్ర హింసకు గురై, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషతో స్వయంగా తాము మాట్లాడదలచామని, ఆమెను సోమవారం తమ ముందు హాజరుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆమె మేనమామను కూడా కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలంది. ప్రత్యూష భవిష్యత్తు గురించి ఆమెతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యూషను ఆమె సవతి తల్లి తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలపై చలించిపోయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఈ ఘటనపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలేకు లేఖ రాశారు. పత్రిక కథనాల ఆధారంగా ఈ ఘటనను సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ జరపాలని కోరారు. దీనికి అంగీకరించిన జస్టిస్ బొసాలే.. పత్రిక కథనాలను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించేందుకు అంగీకరించి, ఆ మేరకు జస్టిస్ ఎస్.వి.భట్‌తో కలిసి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. గురువారం నాడు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ప్రత్యూషతో మాట్లాడానని, ఆమె శారీరకంగా, మానసికంగా బాగానే ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ తెలిపారు. అంతేకాక ప్రత్యూష పెద్దమ్మ, పెదనాన్న కోర్టు ముందు హాజరయ్యారని వివరించారు. దీంతో ధర్మాసనం వారిద్దరినీ తమ వద్దకు పిలిపించుకుని పలు విషయాల గురించి మాట్లాడింది. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ప్రత్యూష తండ్రి జీతం ఎంత..? ఆయనకు ఇతర ఆదాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా..? ప్రత్యూష పేరు మీద ఉన్న ఇంటి వివరాలను సేకరించి వాటిని తమ ముందుంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ‘బేటీ బచావో-బేటీ పడావో’ పథకం గురించి అధ్యయనం చేసి, అది ప్రత్యూషకు ఏ రకంగా ఉపయోగపడగలదో చెప్పాలంది. ప్రత్యూషను తాత్కాలికంగా ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచే విషయంపై పరిశీలన చేయాలని శరత్‌కుమార్‌కు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.