BGL
-
నత్తనడకన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇళ్లకు నేరుగా పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలనే లక్ష్యంతో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) 2011లో ప్రారంభించిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. ఎనిమిదేళ్లయినా లక్ష్యం చేరుకోలేదు. దీంతో పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ చౌకగా అందుతుందని భావించిన నగరవాసుల ఆశలు అడియాసలయ్యాయి. బీజీఎల్‌తొలి విడతగా మూడేళ్లలో నగరంలోని లక్ష కుటుంబాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) అందించాలని లక్ష్యంనిర్దేశించుకుంది. ఆ గడువు ముగిసి ఐదేళ్లయినా లక్ష్యంచేరుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల నగరంలో పర్యటించిన కేంద్రమంత్రి 2021 నాటికి 2.5 లక్షల కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు అందించేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నట్లుప్రకటించిన విషయం విదితమే. ఇదీ లక్ష్యం... నగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించేందుకు బీజీఎల్ సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న ప్రాజెక్టును ప్రారంభించింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పీఎన్జీ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా వాహనాలకు సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యం పెట్టుకుంది. తొలి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పీఎన్జీ కనెక్షన్లు ఇచ్చేందుకు సుమారు రూ.733 కోట్లతో ప్రాజెక్టును ప్రారంభించింది. రానున్న 20 ఏళ్లలో సుమారు రూ.3,166 కోట్లతో నగరవ్యాప్తంగా విస్తరించాలని ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇప్పటికీ 10 శాతమే... బీజీఎల్ తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఉన్న 30 ఫ్లాట్లకు పీఎన్జీ కనెక్షన్లు అందించింది. ఆ తర్వాత మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. వాస్తవానికి మేడ్చల్‌లో దాదాపు వెయ్యి కనెక్షన్లు ఇచ్చి, అప్పటి సీఎం ద్వారా ప్రారంభించాలని అనుకున్నప్పటికీ అది వాయిదా పడడంతో కొన్ని కనెక్షన్లే ఇచ్చి చేతులు దులుపుకుంది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ పరిధిలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్ర తదితర ప్రాంతాల్లో కనెక్షన్లు ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 10,579 పీఎన్జీ కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలిగింది. ఇక శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ మీదుగా జీడిమెట్ల వరకు 46.6 కిలోమీటర్ల మేరనే çస్టీల్ పైప్‌లైన్ పనులు జరిగాయి. కొంతకాలంగా పైప్‌లైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాలకు పైప్‌లైన్ నిర్మాణ పనుల ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. సీఎన్జీ అంతంతే... వాహనాలకు సీఎన్జీ కూడా అందుబాటులో లేకుండా పోయింది. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ గ్రిడ్ నుంచి గ్యాస్ కొరత ఫలితంగా స్టేషన్లకు డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉండడం లేదు. నగరంలో ప్రజారవాణకు వినియోగించే 85వేల ఆటోలు.. 7,500 బస్సులు, 20 వేలకు పైగా ట్యాక్సీలకు కలిపి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకే బీజీఎల్ ప్రాజెక్టును ప్రారంభించింది. తొలి దశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు సంబంధించిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ తర్వాత 130 బస్సులకే పరిమితమైంది. మొత్తమ్మీద 25వేల వాహనాలకు సీఎన్జీ అందిస్తోంది. -
వంటింట్లోకి గ్యాస్
వంటింట్లో గ్యాస్ కష్టాలు నగరంలోని ప్రతి ఒక్కరికీ అనుభవమే. పండగ సీజన్లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఇకపై ఈ కష్టాలకు ఫుల్స్టాప్ పడనుంది. ఇప్పటికే నగర శివారులోని గేటెడ్ కమ్యూనిటీలకు పైప్‌ల ద్వారా వంటింటికే గ్యాస్‌ను సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ.. కోర్ సిటీలోని మరికొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనుంది. ఇందుకోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసింది. తాజాగా చింతల్, బాలాగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బల్కంపేట్, వరకు పనులు పూర్తయ్యాయి. మరికొన్ని రోజుల్లో 30 కి.మీ పొడవునా పనులు పూర్తి చేసి గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్‌ను అందించాలని యోచిస్తోంది. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరంలో ఇంటింటీకి పైపులైన్ వంట గ్యాస్ వచ్చేస్తోంది. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ.. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగంగా పైపులైన్ల విస్తరణ పనులను వేగిరం చేస్తోంది. నగర శివారులోని శామీర్‌పేట మదర్ స్టేషన్ సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయ క్యాంపస్, మేడ్చల్‌కు పరిమితమైన వంటగ్యాస్ సరఫరాను కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాలకు విస్తరింపజేసింది. తాజాగా చింతల్, బాలనగర్, బల్కంపేట కూకట్పల్లి వరకు పైపులైన్ పనులు పూర్తి చేసి వంట గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు సిద్ధమైంది. మరో ఏడాదిలో సుమారు 30 కిలో మీటర్ పొడవునా అల్వాల్, బొల్లారం, ఫతేనగర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, టోలిచౌకి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్, ప్యాట్ని. షేక్‌పేట, మదీనాగూడ, బల్కంపేట, నిజాంపేట, ప్రగతి నగర్ వరకు పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టి గృహ, వాణిజ్య, పరిశ్రమలకు గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఆరేళ్ల క్రితం శ్రీకారం.. హైదరాబాద్ మహానగరంలో ఇంటింటీకి పైపులైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ) అందించేందుకు ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థ ఆరేళ్ల క్రితం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసి ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. ఐదేళ్ల ప్రాజెక్టులో సుమారు 2.66 లక్షల కుటుంబాలకు పైపులైన్ ద్వారా వంటగ్యాస్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి విడతగా 2014 ఎప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు గ్యాస్ సరఫరా చేయాలని భావించినప్పటికీ.. ఈ డిసెంబర్ నాటికి 2,706 గ్యాస్ కనెక్షన్లు మాత్రమే అందించగలిగింది. రెండేళ్ల క్రితం కుత్బుల్లాపూర్ పరిధిలోని గోదావరి హోమ్స్ సమీపంలోని గాయత్రినగర్, కొంపల్లి, సుచిత్రలలో కనెక్షన్లు అందించింది. రూ.733 కోట్లతో.. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్లలో సుమారు రూ.733 కోట్లు ఖర్చుతో పైపులైన్ పనులు విస్తరించాలని భావించినట్లు బీజేఎల్ తన వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని ప్రణాళిక రూపొందించి ఇప్పటి వరకు 34 కిలో మీటర్ల పనులు మాత్రమే పూర్తి చేయగలిగింది. వాస్తవంగా గ్రిడ్ నుంచి సరైన గ్యాస్సరఫరా లేక, ఆ తర్వాత పైపులైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ లేకపోవడం పనులకు అడ్డంకిగా మారాయి. తాజాగా స్టీల్ పైపులైన్ పనులకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ కమ్యూనిటీలకు.. నగరంలోని గ్రేటర్ కమ్యూనిటీలకు పైప్‌లైన్ వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ఇప్పటికే నగరం శివారులోని కొంపల్లి, సినీ ప్లానెట్, ప్రజెయ్ అపార్టుమెంట్, జయభేరి, వెన్సాయి, ఎన్సిఎల్, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, గోదావరి హోమ్స్, గాయత్రీనగర్, బ్యాంక్ కాలనీ, సుచిత్ర, వెన్నెలగడ్డ, బౌద్దనగర్, వెంకటేశ్వర కాలనీ, కౌండిన్య క్లబ్, ఎన్సిఎల్ నార్త్, మీనాక్షి ఎన్క్లేవ్, స్ప్రింగ్ ఫీల్డ్, ఓం బుక్స్, రామరాజునగర్, శ్రీకష్ణనగర్, భాగ్యలక్ష్మికాలనీ, జయరాంనగర్, విమానపురి కాలనీ, కుత్బుల్లాపూర్, అయోధ్యనగర్, కష్ణకుంజ్ గార్డెన్, వీరస్వామినగర్, బీరప్పనగర్, మంజీర అపార్టుమెంట్స్ ప్రాంతాలకు పైప్‌లైన్‌ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వినియోగదారులు ఎంత గ్యాస్ వాడుకుంటే అన్ని డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులు ప్రతిరోజు 0.5 ఎంసిహెచ్ గ్యాస్ వాడే అవకాశముందని బీజేఎల్ సిబ్బంది పేర్కొంటున్నారు. -
వంటింటికి మహాభాగ్యం!
* లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్ * బీజీఎల్ విస్తరణకు కేంద్రం చర్యలు * కేంద్రమంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా సా...గుతున్న పనులు.. కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటనతో ఆశలు చిగురించాయి. వచ్చే రెండేళ్లలో లక్ష ఇళ్లకు, ఐదేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందుకోసం నగరానికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థను బలోపేతం చేయనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును సైతం విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనంగా పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ స్టేషన్లను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పైప్‌లైన్ పనులపై బీజీఎల్ ప్రతినిధులతో చర్చించారు. మరోమారు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం కేంద్ర మంత్రి నగరానికి రానున్నారు. ఐదేళ్లుగా నత్తనడకనే.. హైదరాబాద్‌లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (బీజీఎల్) సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టుకు బీజీఎల్ శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఇప్పటికి కేవలం 1140 ఇళ్లకు మాత్రమే సరఫరా చేసింది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ పీఎన్జీ, సీఎన్జీ విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళిక కూడా కాగితాలకే పరిమితమైంది. ఐదేళ్లలో శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 33 కిలో మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం పైప్‌లైన్ నిర్మాణ పనులు పడకేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో పనుల్లో కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎన్జీ అంతంతే.. భాగ్యనగరాన్ని పూర్తి స్థాయిలో సీఎన్జీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ఆచరణకు నోచుకోలేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా.. డిమాండ్‌కు తగ్గట్టు గ్రిడ్ నుంచి గ్యాస్ సరఫరా లేదు. వాస్తవంగా నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని బీజీఎల్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని సంస్థ సిద్ధమైంది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డి పోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసి, ప్రస్తుతం 110 బస్సులకే పరిమితమైంది. నగరంలో మొత్తం 20 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీకి 3, ప్రయివేటు వాహనాల కోసం 17 ఉన్నాయి. వీటిలో రెండింటిని బీజీఎల్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో సీఎన్జీ వాహనాలు 23 వేలకు మించి లేవు. ఢిల్లీలో మాత్రం 10 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో సైతం అదే స్థాయిలో విస్తరించేందుకు మరిన్ని సీఎన్జీ బంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.