Bhadradri Ramaiah
-
విశ్వవిరాట్ వైభవం
సాక్షి, తిరుమల/భద్రాచలం/యాదగిరిగుట్ట: తెలుగు రాష్ట్రాల్లోని పలు దేవాలయాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. వేకువ జాము నుంచే ఆలయాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కనులపండువగా జరుగుతోంది. ఉత్తరద్వారం నుంచి దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రం శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భూలోక వైకుంఠంగా మారింది. శ్రీసీతాలక్ష్మణసమేతుడైన రామచంద్రస్వామి ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో భద్రగిరి పులకించింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, ధూపదీపాల మధ్య వైకుంఠ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడు గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తరద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. వైకుంఠనాథుడిగా దర్శనమిచ్చిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో పాటు అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట (çపూర్వగిరి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామునే ప్రధానాలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ఆచార్యులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు ఏర్పాట్లు చేశారు. ఉదయం శ్రీస్వామి వారు గరుడ వాహనంపై లక్ష్మీనృసింహస్వామి అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం వద్ద వైకుంఠనాథుడిగా భక్తులకు కనువిందు చేశారు. సాయంత్రం శ్రీస్వామిని విష్ణుమూర్తిగా అలంకరణ చేసి మత్సా్వతారంలో మాడవీధిలో సేవను ఊరేగించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, అనిరు«ద్‌రెడ్డి, అదనపు జిల్లా జడ్జి మారుతీదేవి, సబ్ జడ్జి దశరథరామయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో.. తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వైకుంఠం నుంచి వచ్చిన వేంకటేశుడి దర్శనానికి ఉత్తర ద్వారం స్వా గతం పలికింది. అలాగే.. శ్రీవారి ఆలయంలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగారు. రథోత్సవాన్ని గ్యాలరీల్లోంచి భక్తులు దర్శించి తరించారు. -
‘మహా’ సందడి..
భద్రాచలంటౌన్: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాద్రి భక్తజన సంద్రమైంది. శుక్రవారం తెల్లవారుజామునుంచే రామాలయానికి భక్తులు పోటెత్తారు. దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి పవిత్ర గోదావరి తీరాన పుణ్య(మహా) నదీ హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ధూప, నాగ, రుద్ర, సూర్య, నేత్ర, నంది, సింహ, చక్ర, కుంభ హారతులను గోదారమ్మకు సమర్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవనాథ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచదేశాలకు భారత దేశ సంస్కృతీ సంప్రదాయాలే స్ఫూర్తి అని అన్నారు. పురాణకాలం నుంచే భారతదేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, నేడు ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్నే అనుసరిస్తున్నాయని చెప్పారు. కాశీ క్షేత్రంలో నిర్వహించే మహా హారతి కార్యక్రమాన్ని దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామచంద్రస్వామి వారి సన్నిధిలోని గోదావరి తీరంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. మహా హారతి కార్యక్రమ వ్యవస్థాపకులు పి. మురళీధరరావు మాట్లాడుతూ నదులే జీవనాధారమని, అటువంటి నదులను పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. భద్రాచలంలో నాలుగేళ్లుగా నిరాటంకంగా మహాహారతి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కాశీలోనే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని భద్రాచలం ప్రజలు కూడా తిలకించే అవకాశాన్ని కల్పించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు బూసిరెడ్డి శంకరరెడ్డి, ఐటీసీ పీఎస్పీడీ జనరల్ మేనేజర్ ప్రభోధ్కుమార్ పాత్రో, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అజయ్ రావత్, ఆర్టీసీ డీవీవీఎం శ్రీకృష్ణ, భద్రాచలం డీఎం నామా నర్సింహా, మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఎస్. వెంకటపుల్లయ్య, భద్రాచలం స్పెషల్ సబ్‌జైల్ సూపరింటెండెంట్ ఆనందరావు, ప్రముఖ వైద్యులు ఎస్ఎల్కాంతారావు, జీవీవీ సుదర్శనరావు, జయభారతి, లయన్స్‌క్లబ్ అధ్యక్షులు పాకాల దుర్గాప్రసాద్, బీఎస్ఎస్ శర్మ, గోళ్ల భూపతిరావు, కృష్ణమోహన్, గాదె మాధవరెడ్డి, చారుగుళ్ల శ్రీనివాస్, గట్టు వెంకటాచార్యులు, మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భూక్యా శ్రీనివాస్, కడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
వారి నాదస్వరమే... రామయ్యకు మేల్కొలుపు
సీతారామచంద్రస్వామి సేవలో తరిస్తున్న ముస్లింలు నిత్యం భద్రాద్రి రామయ్య వీరి నాదస్వరంతోనే మేల్కొంటాడు. వీరి తియ్యని ‘నాద’స్వరంతో రామాలయ ప్రాంగణం పరవశించిపోతుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ ముస్లింలు.. కౌసల్యా, సుప్రజా, రామ... అని వేకువజామున వినిపించే సుప్రభాత సేవ నుంచి రాత్రి నిర్వహించే పవళింపు సేవ వరకు వీరు రామయ్య సన్నిధిలోనే గడుపుతారు. వి.శివకుమార్, భద్రాచలం రూరల్ భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో దశాబ్దాల కాలంగా ఇద్దరు ముస్లింలు మంగళవాయిద్య బృందంలో నాదస్వరం(సన్నాయి), తాళం వాయించే కళాకారులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. నల్గొండ జిల్లా మటంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామానికి చెందిన షేక్ మౌలాసాహెబ్ 2000 సంవత్సరం నుంచి భద్రాద్రి రామాలయంలో నాదస్వర కళాకారుడిగావిధులు నిర్వహిస్తున్నారు. ఈయన తన తాతగారైన పల్నాడు నాదస్వర విద్వాంసులు హుస్సేన్ వద్ద నాదస్వర వాయిద్య నేర్చుకున్నాడు. మొదట్లో రామాలయంలో ప్రతి ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు మౌలాసాహెబ్‌ను పిలిపించేవారు. ఈ క్రమంలో 2000 సంవత్సరం నుంచి దేవస్థానం ఆస్థాన నాదస్వర కళాకారుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని పెద్ద కుమారుడు బాషా కూడా భద్రాద్రి ఆలయంలోనే పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు హుస్సేన్ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఉదయం దీపారాధన చేసి రామయ్య సేవకు ఉపక్రమించటం మౌలాసాహెబ్‌కు నిత్యకత్యమైంది. దేవస్థానంలో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లోనూ పాల్గొంటాడు. అయితే రంజాన్, బక్రీద్ పండగల సమయంలో మసీద్‌లకు వెళ్లి నమాజు చేస్తాడు. రామయ్య దయ వల్లే తన కుటుంబం సంతోషంగా ఉందని, జీవితాంతం రాములోరి సేవలోనే తరిస్తానని ఆనందంగా చెపుతున్నాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం గోసవీడుకు చెందిన షేక్ కాశిం బాబు కూడా సంగీత విద్వాంసుల కుటుంబానికి చెందిన వారే. ఈయన తండ్రి హసన్ సాహెబ్ 1953 నుంచి భద్రాద్రి సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాలలో నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. అయితే తన చిన్నప్పుడే సంగీతం నేర్చుకున్న కాశిం బాబు కూడా ఉత్సవాల సమయంలో రామయ్య సేవలో తరించేవాడు. 2000 సంవత్సరం నుంచి ఇక్కడే మంగళవాయిద్య బృందంలో పనిచేస్తున్నాడు. ఈయన నాదస్వరంతో పాటు, తాళం వాయించటంలోనూ దిట్ట. కుల, మత భేదం లేదని, మనసు స్వచ్ఛంగా ఉంటే ఏ దేవుడైనా చల్లగా చూస్తాడని, తాము రామయ్య సన్నిధిలో హాయిగా బతుకుతున్నామని చెపుతున్నారు. -
దేవుళ్ల గొడవ వద్దు: లగడపాటి
హైదరాబాద్: మనుష్యుల విభజన గొడవలు పడుతుంటే, భద్రాద్రి రామయ్య పేరుతో దేవుళ్ల గొడవ మంచిదికాదని కాంగ్రెస్ ఎంపి లగడపాటి రాజగోపాల్ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి ఒక లేఖ రాశారు. భద్రాచలం రామయ్య కావాలని కోరుకోవడంలోని లౌకిక సూత్రం ఏమిటి? అని ఆయన ఆ లేఖలో ప్రశ్నించారు. విశాలభావంతో ఆలోచించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని జైపాల్ రెడ్డిని లగడపాటి కోరారు.