Bhagwant khuba
-
ఫార్మాలో భారత్ ‘విశ్వగురు’
బాలానగర్: ఫార్మసీ రంగంలో భారతదేశం ఎంతో పురోగతి సాధించిందని, ప్రస్తుతం విశ్వగురువుగా కూడా మారిందని కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి భగవత్ కూబా అన్నారు. శుక్రవారం బాలానగర్‌లోని నైపర్ 10వ స్నాతకోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులు పరిశోధనల్లో పాలుపంచుకుని విజయం సాధించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. కరోనా లాంటి కష్టకాలంలోనే మన ఫార్మసీలో ఎన్నో ఆవిష్కరణలు జరిగాయని అన్నారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన నైపర్ కేవలం 16 సంవత్సరాల కాలంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో అధునాతన అధ్యయనాలు, అభ్యాసానికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడటం మంచి పరిణామమన్నారు. ‘నా కెరీర్లో నాకెప్పుడూ గోల్డ్‌మెడల్ రాలేదు...కానీ నేను విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని’ ఆయన పేర్కొన్నారు. లారస్ ల్యాబ్స్ చైర్మన్ చావా సత్యనారాయణ మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఫార్మా రంగంలోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారు. దేశ ఖ్యాతిని పెంచేలా విద్యార్థులు పనిచేయాలని కోరారు. అనంతరం స్నాతకోత్సవంలో 187 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. అందులో 25 మంది పీహెచ్డీ, 162 మంది ఎంఎస్ (ఫార్మ్), ఎంబీఏ(ఫార్మ్) విద్యార్థులు ఉన్నారు. కార్యక్రమంలో నైపర్ హైదరాబాద్ డైరెక్టర్ డా.శశిబాలా సింగ్, డీన్ డా.ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ గణనాథం తదితరులు పాల్గొన్నారు. -
యాదాద్రి అద్భుత శిల్పకళా ఖండం
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన శిల్పకళా ఖండమని, రానున్న రోజుల్లో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి భగవంత్ ఖుబా కితాబిచ్చారు. ఆదివారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రీశుడిని దర్శించుకోవడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అభివర్ణించారు. ఆలయం మార్చి 28వ తేదీన పునః ప్రారంభం కానుందని, దేశ ప్రజలంతా ప్రారంభోత్సవంలో అశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రు లు కావాలని కోరారు. ఆలయం, ప్రాకార మండపాల విశిష్టతను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో గీతారెడ్డి మంత్రికి వివరించారు. అంతకు ముందు ఆలయ ఆచార్యులు ఖుబా, కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, బీజే పీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి అచ్చయ్య ఉన్నారు. -
బాసరలో బీదర్ ఎంపీ
నిర్మల్: బాసరలో కొలువుదీరిన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటకలోని బీదర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ భగవంత్ కూభా ఈ రోజు ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, నిర్మాల్ జిల్లా బీజేపీ ఇంన్ఛార్జి మురళీధర్‌గౌడ్ ఇతర నాయకులు ఉన్నారు.