కేంద్రమంత్రి భగవంత్ ఖుబాకు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్న ఆచార్యులు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలోనే అద్భుతమైన శిల్పకళా ఖండమని, రానున్న రోజుల్లో గొప్ప పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖమంత్రి భగవంత్ ఖుబా కితాబిచ్చారు. ఆదివారం ఆయన కుటుంబసభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిం చారు.
ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ యాదాద్రీశుడిని దర్శించుకోవడం తన జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా అభివర్ణించారు. ఆలయం మార్చి 28వ తేదీన పునః ప్రారంభం కానుందని, దేశ ప్రజలంతా ప్రారంభోత్సవంలో అశేషంగా పాల్గొని శ్రీవారి కృపకు పాత్రు లు కావాలని కోరారు.
ఆలయం, ప్రాకార మండపాల విశిష్టతను ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈవో గీతారెడ్డి మంత్రికి వివరించారు. అంతకు ముందు ఆలయ ఆచార్యులు ఖుబా, కుటుంబ సభ్యులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆయన వెంట భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, బీజే పీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి నరేందర్, కోశాధికారి అచ్చయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment