Bhairavakona
-
ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్
-
కళావిహీనంగా భైరవకోన..
సాక్షి, ప్రకాశం : అది ప్రకాశం జిల్లాలోనే అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం... అందమైన ఎత్తయిన జలపాతం ప్రకృతి అందాలతో భక్తులనే కాక పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షించే దివ్య శైవ క్షేత్రం. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షానికి ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిని కళావిహీనంగా మారడం భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. అదే ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలంలోని చారిత్రిక శైవ క్షేత్రం భైరవకోన త్రిముఖ దుర్గాంబ దేవి ఆలయం. ఎత్తయిన కొండలు.. జలజలా జాలువారే జలపాతం.. ఒకే రాతి పై చెక్కిన వివిధ శైవ ఆలయాలు... మంత్రముగ్ధుల్ని చేసే ప్రకృతి సౌందర్యం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. నిత్యం భక్తులతో కళకళలాడే ఈ ప్రాంతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా దెబ్బతింది. భైరవకోనకు చేరుకునే ఆర్ అండ్ బి రహదారులు ధ్వంసమై రాకపోకలకు వీలు లేకుండా పోయింది. ప్రాచీన గుడికి దగ్గర్లోని కళావేదిక అన్నదాన సత్రం, అతిథి గృహం దెబ్బతిన్నాయి. భైరవకోన ఆలయం చుట్టూ ఉండే కొండ ప్రాంతం నుండి కొండ చరియలు విరిగిపడటంతో భారీగా రాళ్లు కొట్టుకు వచ్చి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను కప్పివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రకృతి సోయగాలతో పర్యాటకులను మైమరిపిస్తున్న బైరవకోన క్షేత్రం ఇలా కళావిహీనంగా మారడం భక్తులను తీవ్రంగా కలచివేస్తోంది. అధికారులు తక్షణం స్పందించి దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రాతి పదికన పునర్ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని అక్కడికి వచ్యే భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. దీంతో పాటు అక్కడ ఉన్న రాళ్ల గుట్టలను తొలగించి రాకపోకలను పునరుద్ధరించాలన్నారు. అలాగే దెబ్బతిన్నకళా భవనం, అన్నదాన సత్రం, అతిథి గృహలను వెంటనే నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. -
సరదాగా వెళ్లి.. సంకటంలో పడ్డారు..
మైదుకూరు టౌన్ : అటవీ ప్రాంతంలో వివాహ దినోత్సవ వేడుక జరుపుకోవాలనుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఇద్దరు యువకులకు ముప్పు తెచ్చి పెట్టింది. అటవీ ప్రాంతంలో దారి తప్పి చివరకు పోలీసుల సాయంతో బతికి బయటపడ్డారు. వివరాల్లోకెళితే.. ప్రొద్దుటూరు మండలం భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న షరీఫ్ మంగళవారం తన 20వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనేందుకు స్నేహితులను తీసుకొని ట్రాక్టర్, జీపులో మైదుకూరు సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాతంలో భైరేని స్వామి దైవ క్షేత్రానికి వెళ్లారు. భోజనం అనంతరం సాయంత్రం వడ్డే శివకుమార్, మోటకట్ల శివసాగర్ అనే వ్యక్తులు షరీఫ్‌కు వివాహ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బహుమతిని ఇవ్వాలని ఆలోచించి వారిద్దరూ ద్విచక్రవాహనంలో మైదుకూరుకు బయలుదేరి వెళ్లారు. అయితే అప్పటికే చీకటి పడటంతో అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు, పాములు సంచరించడం చూసి వాహనాల్లో వెళ్లిన వారిని తీసుకొని షరీఫ్ తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ విషయం శివకుమార్, శివసాగర్‌కు తెలియకపోవడంతో పట్టణానికి వెళ్లి కేక్‌ను తీసుకొని భైరవ కోన వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంతలో రెండు ఎలుగుబంట్లను చూడటంతో భయాందోళనకు గురై వారు తమ ద్విచక్రవాహనంలో పరారయ్యారు. అయితే వారు వచ్చిన దారి తప్పి అటవీ ప్రాంతం లోపలికి వెళ్లారు. శివకుమార్ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ ద్వారా తాము అడవిలో దారి తప్పామని అతని సోదరికి సమాచారం ఇచ్చాడు. ఆమె పోలీస్ కంట్రోల్ 100కు డయల్ చేయడంతో మైదుకూరు పోలీసు స్టేషన్లో సెంట్రీ విధుల్లో ఉన్న ఏఎస్ఐ ద్వారకాకు సమాచారం అందింది. దీంతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు 100కు వచ్చిన ఫోన్ నంబర్ ఆధారంగా అటవీ ప్రాంతంలోని యువకులతో మాట్లాడి వారి వద్ద ఉన్న గూగుల్‌యాప్ లొకేషన్ ఆధారంగా స్పెషల్ పార్టీ, పోలీస్ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి 1 గంట సమయంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఎట్టకేలకు బుధవారం తెల్లవారుజామున తప్పిపోయిన వారి ఆచూకీ తెలుసుకుని వారిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆ యువకులు అడవిలో భయపడటం వల్లే దారి తప్పారని.. వారు చదువుకున్న వారు కావడం.. సెల్‌ఫోన్ టెక్నాలజీపై వారికి అవగాహన ఉండటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి ప్రాణాలు రక్షించామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. తప్పిపోయిన వారి ఆచూకీ గుర్తించండంలో స్పెషల్ పార్టీ సిబ్బంది రామచంద్ర, చంద్ర, నరసింహులుతో పాటు కానిస్టేబుళ్లు సుబ్బయ్య, ప్రసాద్, గోవర్దన్‌రెడ్డిలు కీలక పాత్ర పోషించారని వారిని అభినందించారు. -
ఒక్కొక్కడ్ని కాదు షేర్‌ఖాన్...
పంచ్ శాస్త్ర ఎప్పుడూ గంభీరంగా కనిపించే భైరవకోన ఆరోజు భావోద్వేగాలకు సంబంధించిన అనేక కోణాలతో వెలిగిపోతోంది. భయం, నిర్భయం, ఆగ్రహం, ఆరాటం, పోరాటం... వీరత్వం, రణతంత్రం... ఒకే సమయంలో అనేక రకాల అనుభూతులు ఆకాశంలో కారు మేఘాలై సంచరిస్తున్నాయి. దట్టంగా దుమ్ములేస్తుంది. చెవులు పిక్కటిల్లేలా గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది. షేర్‌ఖాన్ వస్తున్నాడు. పేరులోనే కాదు ధైర్యంలోనూ అతడు షేరే. ‘నేను యుద్ధానికి పిలుపునిస్తే... ప్రతిఘటించ కుండానే రాజ్యం అప్పగించి పారిపోయిన రాజులు ఉన్నారు. నేను యుద్ధరంగంలోకి దిగితే... పోరాడకుండానే పారిపోయిన సైనికులు ఉన్నారు’ అని తనను తాను పరిచయం చేసుకునే షేర్‌ఖాన్ ఉదయ్గఢ్ను జయించడానికి, అదే రాజ్యానికి చెందిన రణదేవ బిల్లాను తొత్తుగా మార్చుకొని వస్తున్నాడు. రణదేవ బిల్లాకు రాజ్యం కాదు పిల్ల కావాలి. షేర్ఖాన్కి రాజ్యం కావాలి. ‘‘యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్లో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టు... పో... నిన్ను ప్రాణాలతో వదిలేస్తా’’ గర్జించాడు షేర్‌ఖాన్. ‘అలాగే మహారాజా’ అనే భయమేదీ వినిపించలేదు. భయాన్ని భయపెట్టే మాటొకటి కాలభైరవుడి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘‘నేను నీకు మాటిస్తున్నాను షేర్‌ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పజెప్పు. నిన్నూ నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా’’ ఈ మాటకు తోక తొక్కిన తాచులా లేచాడు షేర్‌ఖాన్. ‘‘నాకు ప్రాణభిక్షపెడతావా? ఖుదా హు మై.. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కళ్లలో నిజం ఉంటే నా మనుషుల్ని వందమందిని పంపిస్తా. నీ ఒంటి మీద చేయిపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకు అప్పగిస్తా’’ అని ఆఫర్ ఇచ్చాడు షేర్‌ఖాన్. ‘‘వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్’’ అని ధైర్యంగా బదులిచ్చాడు కాలభైరవ. ‘‘వాళ్లను చూస్తేనే నువ్వు సగం ఛస్తావురా’’ బెదిరింపు ఖడ్గం విసిరాడు షేర్‌ఖాన్. దాన్ని వేలిగోరుతో దూరంగా నెట్టి ‘‘ఎక్కువైనా ఫరవాలేదు. లెక్క తక్కువ కాకుండా చూసుకో’’ సవాలుకు సవాలు విసిరాడు కాలభైరవ. ‘‘ఆ వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడిపోయినట్లే’’ కవ్వించాడు షేర్‌ఖాన్. ‘‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు’’ కాలభైరవుడి దమ్ముకు, ధైర్యానికి భైరవకోన నలుదిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కడు కాదు... నిజంగానే వందమంది ఒకేసారి కాలభైరవుడి మీది వచ్చారు. మాటల్లో పొగరు మాత్రమే కాదు... చేతల్లో దమ్ము కూడా ఉందని నిరూపిస్తున్నాడు భైరవ. షురూ... ఒక్కటి... పది... ఇరవై మూడు... కుత్తుకలు తెగిపడుతున్నాయి. ‘పిచ్చేసే మారు’’ అరుస్తున్నాడు షేర్. ఇరవై తొమ్మిది... ముప్పై.. నిమిషాల వ్యవధిలోనే కౌంట్ పూర్తయింది. వంద శిరస్సులు... ఒక్క యోధుడికి వందనం చెబుతున్నాయి ‘‘చాలా షేర్‌ఖాన్... ఇంకో వందిమందిని పంపిస్తావా?’’ భైరవుడు అడుగుతున్నాడు. ఆ ఎర్రటి నేలపై షేర్‌ఖాన్ తెల్లటి ముఖం వేశాడు. ఒక్క చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది అంటారు. ‘మగధీరా’ సినిమాలో ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్... డైలాగులో మాత్రం ఒక్కో పదం రోమాలు నిక్కబొడుచుకునేలా వందల చిత్రాలను చూపించి పంచ్శాస్త్ర పవర్ ఏమిటో రుజువు చేసింది. సినిమా: మగధీర డైలాగ్: ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్