జూట్‌మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన
గుంటూరు : గుంటూరు జిల్లాలోని భజరంగ్ జూట్‌మిల్లు లాకౌట్‌ను ఎత్తివేయాలంటూ కార్మికులు మంగళవారం ఆందోళన బాటపట్టారు. లాకౌట్‌ను ఎత్తివేయకపోతే సామూహిక ఆత్మహత్యలే దిక్కంటూ జూట్ మిల్ ముందు నిరసన చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న సబ్ రిజిస్ట్రార్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులో తేవడానికి ప్రయత్నించసాగారు.
కాగా కార్మికులు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. కార్మికులు మూకుమ్మడిగా సబ్ రిజిస్ట్రార్‌పై దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న నాయకులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.