సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తున్నారు
► తమ్మినేని, రేవంత్‌లపై మంత్రి కేటీఆర్ ఫైర్
► పాదయాత్రల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారు
► గడువుకు ముందే సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టులు
► ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
సాక్షి, ఖమ్మం: ‘‘ఒకాయన ఎర్ర కండువా, ఇంకొకాయన పచ్చ జెండాలను పెట్టుకొని పాదయాత్రల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతు న్నారు. రైతులపై లేని ప్రేమను కురిపిస్తుం డటంతో వారు ఆశ్చర్యపోతున్నారు. సంక్రాం తికి రెండు నెలల ముందే గంగిరెద్దులు ఎందు కు వస్తున్నాయని అనుకుంటున్నారు. వీరు మోకాళ్లతో ఢిల్లీ వరకు వెళ్లినా రైతులు, ప్రజలు నమ్మరు’’ అని సీపీఎం నేత తమ్మినేని వీర భద్రం, టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డిలను ఉద్దేశించి పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రూ.100 కోట్లతో చేపట్టనున్న కార్పొ రేషన్ కార్యాలయ నూతన భవనం, గోళ్లపాడు చానల్ ఆధునీకరణ, లకారం చెరువు, మమత హాస్పిటల్ రోడ్డు పనులకు ఆదివారం ఆయన ఖమ్మంలో శంకుస్థాపన చేశారు. అలాగే సత్తుపల్లి బుగ్గపాడులో రూ.109.44కోట్లతో చేపట్టనున్న ఫుడ్‌పార్క్‌కు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అధ్యక్షత వహించగా కేటీఆర్ మాట్లా డారు. ఒకాయన పల్లె నిద్ర చేస్తున్నాడని.. ధోవతీలు కట్టి, గడ్డాలు పెంచుకుంటే రైతులు, బాబాలు కాలేరని టీపీసీపీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. 65 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో కాని అభివృద్ధిని కేసీఆర్ రెండున్నరేళ్లలో ఎలా చేయ గలరని ప్రశ్నించారు. మిషన్ కాకతీయతో చెరు వులు కళకళలాడుతుంటే కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలే బొగ్గు, హెలికాప్టర్ల కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఉత్తమ్ గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కుం భకోణానికి పాల్పడ్డారన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన ఇన్నోవాలో రూ.3 కోట్లు కాలిపోలేదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ వెనక ఉన్న వారంతా సీబీఐ, అవినీతి కేసుల్లో ఇరుకున్నవారేనన్నారు.
ఖమ్మంకు ఎక్కువ నష్టం
రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లాకు ఎక్కువ నష్టం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం దొంగదెబ్బ తీసి పోలవరం ప్రాజెక్టు ముంపు పేరుతో 7 మండలాలను, 350 మెగావాట్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీలో కలిపిందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, తమకు పాలనా అనుభవం లేకున్నా సమస్యల ను ఎదుర్కొంటూ అభివృద్ధి, సంక్షేమంతో ముందుకుకెళ్తున్న ప్రభుత్వ ప్రగతి ప్రతిపక్షా లకు కనిపించదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, టీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేకున్నా ముసారుుదా పత్రంలో రాయకున్నా పేదింటి ఆడబిడ్డల కల్యాణానికి రూ.51వేలు ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ మనవడు ఏ సన్న బియ్యం తింటున్నాడో అవే బియ్యం పాఠశాలలు, వసతిగృహాల్లో ఉంటున్న పేద విద్యార్థులు తిం టున్నారన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి రూ.4,500 కోట్లు ఖర్చు చేసి పింఛన్లు అంద జేస్తున్నట్లు చెప్పారు. ‘‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’’ కేసీఆర్ నినాదమన్నారు.
స్థానిక యువతకు ఉపాధి కోసం ఐటీ పార్క్
ఖమ్మంలో ఐటీ పార్కును ప్రారం భిస్తామని, 50 వేల చదరపు అడుగుల్లో ఐటీ టవర్ నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువత హైదరాబాద్, బెంగుళూరు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి కల్పిస్తామన్నారు. సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఏర్పాటు చేసే ఫుడ్‌పార్కుకు రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 30 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభి స్తుందని కేటీఆర్ తెలిపారు. అనుకున్న సమయానికి ముందే ఖమ్మం జిల్లాలో చేప ట్టిన సీతారామ, భక్త రామదాసు ప్రాజెక్టు లను పూర్తి చేసి బీడు భూములను సస్య శ్యామలం చేస్తామన్నారు.
అనంతరం రఘు నాథపాలెం,ఈర్లపూడిలో 22 దళిత కుటుంబాలకు రూ.4.44కోట్లతో కొనుగోలు చేసిన 63.30 ఎకరాలను పంపిణీ చేశారు. మెప్మా ఆధ్వర్యంలో రూ.5.15 కోట్ల రుణాల చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందజేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, మేయర్ డాక్టర్ పాపాలాల్, కలెక్టర్ డీఎస్.లోకేశ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మినారాయణ, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.