అడవి పులకించింది
నాగోబా జాతరలో పెర్సాపేన్ పూజలు
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బుధవారం జాతరలో భాగంగా మెస్రం వంశీయులు పెర్సాపేన్, భాన్ దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. డోలు, పెప్రే, కాలీకోమ్ వాయిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు. కొత్తగా భేటింగ్ (పరిచయం) అయిన కోడళ్లు మర్రిచెట్టు వద్ద ఉన్న బావి నుంచి పవిత్ర జలం తీసుకొచ్చారు. భాన్ దేవత ఆలయం ముందు ఉన్న పాత పుట్టను తొలగించారు.
పవిత్రజలంతో మెస్రం వంశీయులు పాత భాన్ దేవతల ప్రతిమలను శుద్ధి చేశారు. కోడళ్లు కొత్త పుట్టలను తయారు చేసి భాన్ దేవతకు పూజలు చేశారు. ఆదిలాబాద్తోపాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం కిక్కిరిసింది.