bharat tour
-
భారత్లో బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో నాలుగురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం భారత్కు చేరుకున్నారు. ప్రధాని మోదీతో సమావేశమై 15 ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఆయిల్, గ్యాస్, మైనింగ్, సైబర్ భద్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక 71వ గణతంత్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇది మూడోసారి. -
జీ జిన్పింగ్తో లోక్సభ స్పీకర్ భేటీ
న్యూఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. మూడో రోజుల పర్యటన కోసం భారత్ విచ్చేసిన ఆయనను...ఈరోజు ఉదయం తాజ్ ప్యాలెస్ హోటల్లో సుమిత్రా మహాజన్ కలిశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో కూడా జిన్పింగ్ సమావేశం కానున్నారు. కాగా జీ జిన్పింగ్ తన పర్యటన ముగించుకుని మధ్యాహ్నం చైనా బయల్దేరనున్నారు.