రజతాలు నెగ్గిన హర్షిత, హర్ష
హైదరాబాద్: ఆసియా జూనియర్ అండర్–20 చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జి.హర్షిత, హైదరాబాద్ కుర్రాడు హర్ష భరతకోటి బ్లిట్జ్ విభాగంలో రజత పతకాలు సాధించారు. ఇరాన్‌లోని షిరాజ్ పట్టణంలో బుధవారం జరిగిన బాలికల బ్లిట్జ్ ఈవెంట్లో హర్షిత నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఐదు గేముల్లో గెలిచిన హర్షిత, మిగతా నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకుంది.
అలీనసాబ్ మొబీనా (ఇరాన్–8 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... హŸతామి ముత్రిబా (తజికిస్తాన్–6.5 పాయింట్లు) కాంస్యం సాధించింది. ఓపెన్ విభాగంలో హర్ష 7.5 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఏడు గేముల్లో గెలిచిన హర్ష, ఒక గేమ్‌లో ఓడి, మరో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు.