నయీం అనుచరులమంటూ..
గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ అనంతరం కూడా నయీం గ్యాంగ్ ఆగడాలు ఆగడంలేదు. తాజాగా ఓ మహిళను కొందరు గుర్తుతెలియని దుండగులు నయీం గ్యాంగ్ పేరుతో బెదిరించిన సంఘటన నగరంలోని ముసారంబాగ్లో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న భారతలక్ష్మీ ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు తాము నయీం మనుషులమని తాము చెప్పినట్లు వినాలని నానా గొడవ చేశారు. ఇంట్లో సామాగ్రి అంతా చిందర వందర చేశారు. దీంతో భయాందోళనకు గురైన బాధిత మహిళ మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.