ఉత్కంఠగా జూనియర్ కళాశాలల క్రీడా పోటీలు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్) :జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్ కళాశాలల అండర్–19 క్రీడా పోటీలు బుధవారం తాడేపల్లిగూడెం మండలంలోని భారతీయ విద్యా భవన్స్‌లో నిర్వహించారు. తొలుత ఈ పోటీలను ప్రిన్సిపాల్ రాజీవ్ కుమార్ శర్మ ప్రారంభించారు. పీడీలు ఆదిరెడ్డి సత్యనారాయణ, బీహెచ్ఎన్ తిలక్, భాస్కరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. విజేతల వివరాలను ఫిజికల్ డైరెక్టర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.ఐజక్ ప్రకటించారు.
విజేతల వివరాలు బాలికల విభాగం
200 మీటర్ల పరుగు పందెంలో యు.సింధు(కొవ్వూరు), ఎన్.అమృత(తణుకు), టి.తులసి(ఏలూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. హై జంప్‌లో ఎం.అమృత(తణుకు), జి.మానస(దూబచర్ల), యు.సింధు(కొవ్వూరు), జావాలిన్ త్రోలో ఎస్.శ్రీలత( దూబచర్ల) వై.నాగాంజలి(నిడదవోలు), బి.దీప్తి (కొవ్వురు), వ్యక్తిగత చాంపియన్స్‌గా యు.సింధు (కొవ్వూరు), వై.నాగాంజలి(నిడదవోలు), ఎం.అమృత(తణుకు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించారు. 4 ఇన్‌టూ 100 మీటర్స్ రిలేలో సెయింట్ థెరిసా(ఏలూరు), ఎస్‌కేఎస్‌డీ(తణుకు), ఎంఆర్ జీజేసీ(నిడదవోలు)ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో నిలిచారు.
బాలుర విభాగం :
100, 200 మీటర్లు పరుగు పందెంలో టి.చిన్నబాబు(ఏలూరు), కె.సందీప్(ఏలూరు), డి.సాయికృష్ణ(పెదవేగి), 400 మీటర్లు పరుగు పందెంలో కె.సందీప్(ఏలూరు), కె.సాయికుమార్(ఏలూరు), బి.చంద్రశేఖర్(ఏలూరు), 800 మీటర్ల విభాగంలో జె.శంకరరావు, పి.సోమేశ్వరరావు(ఏలూరు), ఎస్.అనిల్‌కుమార్ (నల్లజర్ల), 1,500 మీటర్లు విభాగంలో బి.మోహన్‌రావు(ఏలూరు), టి.నవీన్(ఆరుగొలను), కె.ఎస్.ఎస్.హనుమాన్(పెనుగొండ), 3,000 మీటర్లు విభాగంలో ఆర్.కృష్ణ చావన్ (నరస్పాపురం), సీహెచ్ తవిటరాజు(ఏలూరు), ఐ.నికిలేష్(ఏలూరు) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. లాంగ్ జంప్‌లో టి.చిన్నబాబు (ఏలూరు), కె.ప్రమోద్‌కుమార్(నారాయణపురం), బి.ఆశోక్‌రావు(ఏలూరు), హై జంప్‌లో కె.శ్రీను (భీమడోలు), కె.ప్రమోద్‌కుమార్ (నరసాపురం), ఎం.నవీన్ (కె.ఆర్.పురం), ట్రిపుల్‌జంప్‌లో బి.ఆశోక్‌రావు(ఏలూరు), బి.చంద్రశేఖర్(ఏలూరు), షార్ట్పుట్లో డి.విద్యాసాగర్ (ఏలూరు), సీహెచ్ ఏసుదాసు(నరసాపురం), ఇ.ఎస్.రాజు (పెదవేగి), జావాలిన్త్రోలో డి.సుధీర్, ఎల్.కుమార్(దూబచర్ల), ఎస్.రాజశేఖర్‌రెడ్డి(కె.ఆర్.పురం), డిస్కస్‌త్రోలో సీహెచ్ ఏసుదాసు (నరసాపురం), డి.విద్యాసాగర్(ఏలూరు), డి.సుధీర్(పెదవేగి) విజయం సాధించారు. వ్యక్తిగత చాంపియన్స్‌గా టి.చిన్నబాబు, కె.శంకర్, సీహెచ్ ఏసుదాసు, డి.విద్యాసాగర్ నిలిచారు. అలాగే 4 ఇన్ టూ 100 రిలేలో ఎన్‌ఎస్‌ఆర్‌కే జూనియర్ కాలేజీ(ఏలూరు), ఏపీఎస్‌డబ్ల్యూఆర్(పెదవేగి), ఎస్‌పీడీబీటీ(ఏలూరు)జట్లు నిలిచాయి. 4 ఇన్ టూ 400 రిలేలో ఎన్‌ఎస్‌ఆర్‌కే జూనియర్ కాలేజీ(ఏలూరు), ఏపీఎస్‌డబ్ల్యూఆర్(పెదవేగి), ఎస్వీజేసీ(భీమడోలు) విజేతలుగా నిలిచాయి.