ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
భువనేశ్వర్ : ఒడిశా రాయగడ్ జిల్లా భాతాపుర సమీపంలో బుధవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పుల్వానీ నుంచి బలిమెల తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవటం వల్లే చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు.