bhavans team
-
భవన్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్ కాలేజి పురుషుల క్యారమ్స్ టోర్నమెంట్లో సికింద్రాబాద్ భవన్స్ సైనిక్‌పురి డిగ్రీ కాలేజి జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. గండిపేట్ సీబీఐటీ కాలేజి ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో ఎంజేసీఈటీ రన్నరప్‌గా నిలవగా, ఐఐఎంసీ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టైటిల్‌పోరులో భవన్స్ 2–1తో ఎంజేసీఈటీపై విజయం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ఐఐఎంసీ 2–1తో ఆతిథ్య సీబీఐటీని ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భవన్స్ సైనిక్‌పురి 3–0తో ఐఐఎంసీపై, ఎంజేసీఈటీ 3–0తో సీబీఐటీపై గెలుపొందాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి వ్యాయామ విద్య డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్ కె. దీప్లా, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేశ్వరి పాల్గొన్నారు. -
భవన్స్ జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అంతర్ కాలేజి హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో భవన్స్ (సైనిక్‌పురి) కాలేజి జట్టు సత్తా చాటింది. దూలపల్లిలోని సెయింట్ మార్టిన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో జరిగిన ఈ టోర్నీలో విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో భవన్స్ జట్టు 14–9తో అరోరా డిగ్రీ కాలేజిపై గెలుపొందింది. మూడోస్థానం కోసం జరిగిన పోరులో లయోలా అకాడమీ 11–7తో బీఆర్ అంబేడ్కర్ కాలేజిపై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ పోటీల్లో అరోరా 9–4తో లయోలా అకాడమీపై, భవన్స్ సైనిక్‌పురి 15–8తో బీఆర్ అంబేడ్కర్‌పై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సెయింట్ మార్టిన్స్ కాలేజి చైర్మన్ ఎం. లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. -
నిజామ్, భవాన్స్ గెలుపు
క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నీ హైదరాబాద్: క్లబ్ లీగ్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో నిజామ్ బాస్కెట్‌బాల్ అకాడమీ (ఎన్బీఏ), భవాన్స్ జూనియర్ కాలేజి జట్లు శనివారం జరిగిన లీగ్ మ్యాచుల్లో విజయం సాధించాయి. వైఎంసీఏ సికింద్రాబాద్ కోర్టులో జరిగిన మ్యాచ్‌లో ఎన్బీఏ ‘ఎ’ జట్టు 54-38తో జోసెఫియన్ శాంతినగర్ క్లబ్‌పై గెలుపొందింది. ఎన్బీఏ తరఫున క్రిస్ విరేశ్ (16), శామ్సన్ (13) రాణించారు. జోసెఫియన్ జట్టులో ప్రకాశ్ 12, అనికేశ్ 10 పాయింట్లు సాధించారు. భవాన్స్ 40-26తో వెస్లీ గిల్డ్ జట్టును కంగుతినిపించింది. భవాన్స్ ఆటగాళ్లు శ్రీరామ్ 15, బాలశౌరి 11 పాయింట్లు చేయగా, వెస్లీ తరఫున గౌరవ్ 6, ప్రసాద్ 5 పాయింట్లు చేశారు. ఇతర మ్యాచ్‌ల్లో హాస్టలర్స్ 39-23తో నెహ్రూనగర్ ప్లేగ్రౌండ్‌పై నెగ్గింది. హాస్టలర్స్ విజయంలో అవినాశ్ (12), ప్రతీక్ (10) కీలకపాత్ర పోషించారు. నెహ్రూనగర్ జట్టులో శాండి 12, విపుల్ 6 పాయింట్లు సాధించారు. ఆర్బీవీఆర్ రెడ్డి హాస్టల్ 44-27తో సిటీ యూత్‌ను ఓడించింది. రెడ్డి హాస్టల్ జట్టులో అభిజిత్ (16) ఆకట్టుకున్నాడు. యూత్ జట్టు తరఫున జోగిందర్ 10 పాయింట్లు చేశాడు.