bheemaram
-
బీమారంలోని చైతన్య జూనియర్ కాలేజ్ ఛైర్మన్ సురేందర్ గౌడ్ అరెస్ట్
-
బట్టలు కొనలేదని బలవన్మరణం
భీమారం(చెన్నూర్): సద్దుల బతుకమ్మ పండుగకు తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఆరెపల్లిలో మంగళవారం జరిగింది. ఎస్ఐ గట్ల సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆరెపల్లి గ్రామానికి చెందిన రాంటెంకి శంకరయ్య, శంకరమ్మ దంపతులు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి కూతురు వనిత (20) ప్రాథమిక విద్య పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. సోమవారం సద్దుల బతుకమ్మ పండుగ కోసం కొత్త బట్టలు కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడింది. మంగళవారం ఉదయం మళ్లీ తల్లితో గొడవ పడి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. కుటుంబ సభ్యులు 108లో చికిత్స నిమి త్తం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోని భీమారం వద్ద చనిపోయింది. -
శ్మశానానికి రూ.6 కోట్ల భూమి విరాళం
భీమారం (వరంగల్): గజం స్థలం కోసం సొంతవాళ్లతో ఘర్షణ పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా రూ.6 కోట్ల విలువైన భూమిని దానం చేసి తన ఉదారతను చాటుకున్నారు. వరంగల్ నగరం పరిధిలోని గుండ్లసింగారానికి చెందిన గంగు గోపాల్రావుకు స్థానికంగా కొంత వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి శ్మశాన వాటిక లేకపోవడాన్ని గమనించి తనకున్న భూమిలోనుంచి మూడెకరాలను దానికి ఇవ్వాలని నిర్ణయించాడు. అక్కడ ఎకరం బహిరంగ మార్కెట్లో రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా నేత అల్వాల రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీ దయాకర్‌ను కలిసి తన నిర్ణయాన్ని వివరించాడు. ఈ మేరకు శనివారం ఎంపీలు దయాకర్, బండా ప్రకాశ్ చేతుల మీదుగా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్‌కు పత్రాలు అందజేశారు. గోపాల్‌రావు దానమిచ్చిన మూడెకరాలలో మోడల్ శ్మశానవాటిక నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పెద్దమనసు చాటుకున్న గోపాల్‌రావును కలెక్టర్ అభినందించారు. -
వరంగల్‌లో విషాదం.. రిజర్వాయర్‌లో పడి..
సాక్షి, వరంగల్ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బీమారంలో ఉన్న పుట్టలమ్మ రిజర్వాయర్‌లో పడి గురువారం ముగ్గురు బాలురు మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. బీమారానికి చెందిన దొడ్డిపాటి మనివిత్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు(14), మ్యూనికుంట్ల విష్ణు తేజ (14) ఈ ముగ్గురు బాలురు సైకిల్‌పై వెళ్లి పుట్టలమ్మ రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు రిజర్వాయర్‌లో పడి పిల్లలు గల్లంతు కావటంతో స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లని దింపి గాలింపు చర్యలు చేపట్టారు. (ఆయన గొంతు విన్నాక.. కన్నీళ్లు ఆగలేదు! ) సమాచారం అందుకున్న కేయూసీ పోలీసులు హుటాముటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికి తీయగా.. వారిని మనివిత్, మహేష్ బాబుగా గుర్తించారు. మరో బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇక ఈ దుర్ఘటనతో బాధితుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. బిడ్డల కోసం తల్లిదండ్రుల ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్..) -
కేతేపల్లిని సూర్యాపేట జిల్లాలో కలపాలి
భీమారం(కేతేపల్లి) : కేతేపల్లి మండలాన్ని సూర్యాపేట జిల్లాలో కలపాలని కోరుతూ సూర్యాపేట–మిర్యాలగూడెం రహదారిపై శనివారం మండలంలోని భీమారం గ్రామస్తులు, విద్యార్థులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ సూర్యాపేటకు కేవలం 15 కి.మీ దూరంలో ఉన్న కేతేపల్లి మండలాన్ని నల్లగొండ జిల్లాలో కొనసాగించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మండలానికి చెందిన 80 శాతం మంది విద్యార్థులు సూర్యాపేటలోని పాఠశాలలు, కళాశాలల్లోనే చదువుతున్నారని పేర్కొన్నారు. రెండు గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి ఎస్ఐ మద్దెల క్రిష్ణయ్య సిబ్బందితో భీమారం గ్రామానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామస్తులకు నచ్చచెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. ధర్నాలో ఉపసర్పంచ్ నాగరాజు, గ్రామస్తులు సుక్క వినయ్‌సాగర్, బడుగుల చంద్రశేఖర్, అవిరెండ్ల రమేష్, కూరెళ్ల వెంకన్న, ఆదాం, గునగంటి రాము, రహీం, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదగాలి
భీమారం : భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా జూనియర్ ఇంటర్ విద్యార్థినులకు సీనియర్లు స్నేహపూర్వక స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్వీఎస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమల్‌రావు హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలన్నారు. పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు ఎదగొచ్చన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్వీఎస్ విద్యాసంస్థల వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఇ.సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.