సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
భీంపూర్ (బోథ్): ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాను పుర్క సుఖ్‌దేవ్ (24) శ్రీనగర్ సరిహద్దు ప్రాంతంలో తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందజేశారు. ప్రత్యేక వాహనంలో నాగ్‌పూర్‌కు, అక్కడి నుంచి సీఆర్పీఎఫ్ వాహనంలో స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. కుటుంబసభ్యులు, మిత్రులు అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మహత్యకు గల కారణం తమకు తెలియరాలేదని తోటి జవాన్లు, కుటుంబీకులు చెప్పారు.