క్షణికావేశంతో నిండు ప్రాణం తీసుకుంది
తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య
ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతుండటమే కారణం
పెడనలో ఘటన
పెడన రూరల్ : ప్రేమికుడితో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నందుకు తల్లి మందలించిందనే కోపంతో ఓ యువతి బల వంతంగా ప్రాణం తీసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన స మాచారం ప్రకారం గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పట్టణ శివారులోని వీరభద్రపురంలో యర్రా గిరిజాకుమారి కుటుంబం నివాసం ఉంటోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉ న్నారు. భర్త చనిపోవడంతో చేనేత పనులు చేసుకుంటూ కు టుంబాన్ని పోషిస్తోంది.
పెద్దకుమార్తె దివ్య నాగరేవతి(20) గుడ్లవల్లేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో గతేడాది ఈసీఈ కో ర్సు పూర్తి చేసింది. మచిలీపట్నంలోని భెల్ కంపెనీలో అ ప్రెంటీస్గా శిక్షణ పొందుతోంది. రెండో కుమార్తె కూడా పా లిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తోంది. కు మారుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. నాగరేవతి గురువారం రాత్రి ఫోన్లో ప్రేమికుడితో మాట్లాడుతుండగా తల్లి మందలించింది.
తరువాత తల్లి, కుమారుడు నిద్రకు ఉపక్రమిస్తుండగా రేవతి కిరోసిన్ డ బ్బా తీసుకుని బాత్రూమ్లోకి వెళ్లి శరీరంపై పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో భరించలేక కేకలు వేస్తూ బయటకు వచ్చి కుప్పకూలిపోయింది. లోపలనుంచి తల్లి, కుమారుడు వచ్చి ఆమెపై ఇసుక చల్లి మంటలు ఆర్పేందుకు యత్నించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి అక్కడికక్కడే మరణించింది. ఎస్సై అల్లు దుర్గాప్రసాద్ వ చ్చి విచారణ నిర్వహించారు. బందరు డీఎస్పీ డాక్టర్ కె. శ్రీనివాస్, బందరు రూరల్ సీఐ ఎస్.వి.వి.ఎస్.మూర్తి శుక్రవారం ఘటనాస్థలికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. స్థా నిక ఆర్ఐ తేజ, వీఆర్వో భద్రంతో పంచనామా నిర్వహించి, బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై కేసు దర్యాప్తు చేపట్టారు.
రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో..
రేవతి గుడ్లవల్లేరు కళాశాలలో పాలిటెక్నిక్ చదివే రోజుల్లో పె డనకు చెందిన ఓ మాస్టర్ వీవర్ కుమారుడితో ప్రేమలో ప డింది. అతడు కూడా గుడ్లవల్లేరులో పాలిటెక్నిక్ చదివేవాడు. ఇద్దరూ రోజూ రైలులో కాలేజీకి వెళ్లి వస్తుండేవారు. రెండేళ్లు గా వీరు ప్రేమించుకుంటున్నారు. రేవతి తన ప్రేమ గురించి తల్లికి తెలియజేసి, ఇద్దరికీ పెళ్లి చేయాలని కోరింది. దీంతో గి రిజ సంవత్సరం క్రితం రేవతి ప్రేమికుడి ఇంటికి వెళ్లి, అతడి కుటుంబసభ్యులతో మాట్లాడింది.
అయితే మాస్టర్ వీవర్ స్థితిమంతుడు కావడంతో ఈ వివాహానికి అంగీకరించలేదు. అయినప్పటికీ ఇద్దరి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. రే వతి తరచూ ప్రేమికుడితో ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి అభ్యంతరం చెప్పేది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి రేవ తి ఫోన్లో మాట్లాడుతుండగా తల్లి మందలించింది. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
రేవతిని ప్రే మికుడికి ఇచ్చి వివాహం చేసేందుకు అతడి కుటుంబసభ్యు లు అంగీకరించి ఉంటే తన కుమార్తె ప్రాణం దక్కేదని గిరిజాకుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. రేవతిని కోడలిగా చేసుకునేందుకు నిరాకరించిన వారిపై కేసు నమోదు చేయా లని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు.