టీడీపీ నాయకుడి దౌర్జన్యం
బేతంచర్ల(కర్నూలు): అధికార పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని బేతంచర్ల గ్రామ పంచాయతీలో వాటర్మెన్గా పనిచేస్తున్న బి. నాగరాజు అనే వ్యక్తిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తిరుమలేశ్ చౌదరీ తీవ్ర దుర్భాషలాడాడు.
దీంతో మనస్తాపానికి గురైన వాటర్మెన్ విషయాన్ని పంచాయతి కార్మికులతో చర్చించి అందరు కలిసి ధర్నాకు దిగారు. శనివారం విధులు బహిష్కరించిన కార్మికులు తిరుమలేశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.